మెయిన్ ఫీచర్

లవ్ లబ్ డబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమించుకోవడం నేటి ఫ్యాషన్. ప్రేమని అడ్డుపెట్టుకుని సరదాలు తీర్చుకోవడం కూడా నేటి ఫ్యాషన్. సినిమాలు, పాశ్చాత్య ఛానెళ్ళు ప్రభావం యువతీ యువకులపై వుందనడంలో సందేహం లేదు. ప్రేమించే వయసు రాగానే తొందరపడిపోవడం, వెంటనే ఎవరో ఒకళ్ళకి మనసిచ్చేయడం, ఆనక ఎన్నో బాధలు.
**
నేటి తరం యువతీ యువకుల్ని ప్రేమ మినహా మరే శక్తీ ప్ర భావితం చేయడం లేదు! కొన్ని సంవత్సరాల కిందట అమ్మాయి, అబ్బాయి స్నేహం అంటే విడ్డూరంగా చూసేవారు. ఒకరితో ఒకరు స్నేహం చెయ్యాలంటేనే సంకోచించేవారు. ఇలాంటి స్నేహాల్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు కూడా చాలా అరుదుగా కనిపించేవారు. కాని, ఇప్పుడది పూర్తిగా మారిపోయింది. నేటి యువతీ యువకులకి ఫ్రెండ్‌షిప్ ఒక స్టేటస్ సింబల్. అయితే తమ మధ్య కేవలం స్నేహాన్ని మాత్రమే పవిత్రంగా నిలుపుకునేవారు చాలా తక్కువ. తొలి యవ్వనానికి తొందర ఎక్కువ. యువతీ యువకులు ఒకరికొకరు పరిచయం అయ్యారు అంటే అదే వింత లోకం. ఊహల్లో విహరిస్తుంటారు. అవతలివారు అభిమానంగా మాట్లాడినా, ఆదరణ చూపినా ఆరాధన పెంచుకుని వీలు చూసుకుని ఇట్టే తమ ప్రేమ విషయం చెప్పేస్తారు. గ్రీన్‌సిగ్నల్ అందిందా.. పాస్ట్ఫుడ్ సెంటర్లు, పిజ్జాలు, ఐస్‌క్రీమ్ పార్లర్లు కళ్ళముందు కనిపిస్తుంటాయి. ఒకవేళ అటువైపు నుంచి రెడ్‌సిగ్నల్ అయితే గెడ్డాలు పెంచుకోవడం, వీలయితే డ్రగ్స్, రకరకాల అలవాట్లని ఆశ్రయించడం మామూలే.
ఏ కొద్దిమందో ప్రేమికులు దంపతులుగా మారి జీవితాన్ని నందనవనంగా తీర్చిదిద్దుకుంటారు, సుఖమయం చేసుకుంటారు. కొంతమంది దంపతులుగా మారినా ఊహించుకున్నంత ఆనందంగా గడపలేరు. ప్రేమించుకునే రోజుల్లో ఒకరికొకరు కొత్తగా కన్పించడం, ఒకరి లక్షణాలు మరొకర్ని ఆకర్షించడం, ఒకరికోసం ఒకరు అన్నట్టు బతికేయడం, ప్రియురాలు లేక ప్రియుడు మరొకరితో మాట్లాడుతున్నపుడు ఎటువంటి ఈగోలు ప్రదర్శించకపోవడం వంటివి ఇందుకు కొన్ని కారణాలు. ప్రేమలో పడగానే కొన్ని జంటలు ఒక స్టెప్ ముందుకు వేసి రొమాన్స్‌కి సిద్ధపడతారు. ప్రేమ ముసుగులో అవసరాలు గడుపుకోవడం, కోరికలు తీర్చుకోవడం ఆనక ఇవేం ఎరగనట్లు ఎవరిదారిన వారు వెళ్లిపోవడం, యువకుల పర్స్ చూసి ప్రేమలో పడే యువతులు కొందరైతే, యువతుల బలహీనతలని పసిగట్టి వేధించి ప్రేమని రక్తికట్టించే యువకులు మరికొందరు. అమ్మాయినో లేక అబ్బాయినో చూసేయడంతోనే వారు మనకి అనుకూలం అనుకుని వెంటనే ప్రిపేరైపోవడం కాదు. ఆకర్షణ ముందు ప్రధానంగా ఏ ప్రేమలు నిలబడవు. ఈ తరం ప్రేమల్లో కొన్ని మోసాలు వున్నాయి. డబ్బు, హోదా చూసి ప్రేమలోకి దింపడం, పెళ్లిని వ్యాపారంగా మలచుకునే ప్రబుద్ధులు కోకొల్లలు. మంచిగుణం, అంకితభావం, ప్రేమతత్వం అన్నింటికీ మించి సిన్సియారిటీతో కూడుకున్నది నిజమైన ప్రేమ. కాబట్టి యువతీ యువకులూ! స్నేహం చెయ్యబోయే ముందు ప్రేమలో పడబోయే ముందు అవగాహన తప్పనిసరి.

-బి.మున్నీబాయి