మెయిన్ ఫీచర్

ముత్యాల సోయగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాఘమాసం మొదలైపోయింది. పెళ్లిళ్లతో కళ్యాణ మండపాలు కళకళలాడిపోతున్నాయి. పెళ్లికూతుర్లు భారీ నగలతో మెరిసిపోతున్నారు. గొప్ప కోటీశ్వరుల నగల నుంచి, సాధారణ మధ్యతరగతి కుటుంబంలోని నగల వరకు ముత్యాల సోయగం లేనిదే నగల ఫినిషింగ్ పూర్తవదు. పాల నురగలా, తెల్లటి మేఘంలా మెరిసే ముత్యాలకి తరాలు మారినా ఆదరణ తగ్గలేదు. ముత్యాలు ఎవరికైనా నప్పుతాయి. అందుకే ఒకప్పుడు అమ్మాయి మెడలో ఒంటిపేట ముత్యాల సరం ఉండేది. ఇంకొంతమంది ఆ ముత్యాల పేటను బంగారు, రాగి, వెండితీగలతో అల్లించుకునేవారు. మరికొంతమంది కాస్త చిన్న పరిమాణంలో ఉండే ముత్యాలను రెండు, మూడు వరుసల్లో గుచ్చి వేసుకోవడమూ మనందరికీ తెలిసిన ఫ్యాషనే.. అయితే ఇప్పటి అమ్మాయిలు మాత్రం ముత్యాలను ఇలా వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. సంప్రదాయ నగలకి ఆధునిక సొబగులు అద్దుతూ ట్రెండీగా ఉండాలనుకుంటున్నారు. అచ్చంగా ముత్యాల నగలే కాదు.. వెండి, బంగారు, వన్‌గ్రామ్ గోల్డ్.. ఇలా ఏ రకమైన నగలైనా సరే.. వాటికి అదనపు హంగులు అద్దుతున్నారు. చిన్న పరిమాణంలో ఉండే ఒకప్పటి గుత్త పూసల హారాలు, నెక్లెస్‌లు ఇప్పటి లేటెస్ట్ ట్రెండ్. వీటికి కెంపులు, పచ్చలు కూడా జతై సొబగులు అద్దుకుంటున్నాయి. అయితే సందర్భాన్ని బట్టి ఆ డిజైన్లను ఎంపిక చేసుకుంటే బాగుంటుంది. అంటే పెళ్లి కూతురు కోసం ముత్యాలను ఎంచుకోవాలనుకున్నప్పుడు అచ్చంగా ముత్యాల దండలు బాగుండవు. ఇవి అందరికీ నప్పవు కూడా.
* పచ్చలు, కెంపులను బంగారంతో చుట్టించి వీటిని ముత్యాలతో కలిపి అల్లడం వల్ల నగ ఆకర్షణ అదిరిపోతుంది.
* ముత్యాలు వేలాడేలా డిజైన్ చేయించుకుంటే ఆ అందం అదరహో.. ఈ డిజైన్‌నే పాపిటబిళ్ల మొదలుకుని కాలి పట్టీల వరకు చేయించుకోవాలి. దీనే్న పెళ్లికూతురుకు వాడితే.. ఒక పూర్తి రూపు సొంతమవుతుంది. పెళ్లికూతురును చేయించే సందర్భానికీ, ఇతర వేడుకలకు హాజరయ్యేటప్పుడు గుత్త పూసల హారం ఒక్కటుంటే చాలు నిండుగా కనిపించవచ్చు. ఇప్పడు వీటిలో గుత్తపూసలతో గాజులు, మాటీలు, చెంపసరాలు వంటి డిజైన్లు ఎన్నో మార్కెట్లో ఉన్నాయి. కాస్త సన్నగా కనిపించే అమ్మాయిలకు ఈ నగ మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.
* నేడు ముత్యాలు రకరకాల రంగుల్లో లభిస్తున్నాయ. కాబట్టి వేసుకున్న డ్రెస్‌కు తగినట్లుగా ముత్యాల నగల్ని ధరించవచ్చు.
* సంప్రదాయం ఉట్టిపడే చీరలు, పరికిణీలపైకే కాదు అనార్కలీలు, గౌన్‌ల వంటివాటితో పాటు అన్ని సందర్భాలకు నప్పాలంటే చిన్న ముత్యాల దండలు దొంతర్లగా ఎంచుకుని అడుగున కుచ్చుల్లా వేలాడే ముత్యాల పెండెంట్‌ను అమర్చుకుంటే చాలు.. ఎంత అందమో..
* అచ్చంగా ముత్యాలు వద్దనుకునేవారు కెంపుల నెక్లెస్‌కి ముత్యాలను లేదా గుత్తపూసల్ని వేలాడదీస్తే ఆ అందమే వేరు..
* రోజువారీ నగలకి, ఆధునికంగా కనిపించే దుస్తుల మీదకూ ముత్యాలు వేలాడే చాంద్‌బాలీలు, సన్నటి ముత్యాల వరుసలు, ఏలాడే ఎసెమెట్రికల్ జుంకీలు చాలా బాగుంటాయి.