మెయిన్ ఫీచర్

పోరాడి గెలిచిన ‘ప్రత్యేక’ ప్రేమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె ముస్లిం..
అతను హిందూ..
వారిద్దరి మధ్యా ప్రేమ..
ఇరు కుటుంబాల నిరసన..
కానీ ప్రత్యేక వివాహ చట్టం ద్వారా పెళ్లి..
ఇదీ వారి జీవితం..
అసలు విషయం ఏమంటే..
19 సంవత్సరాల ముస్లిం యువతి అయేషాకు, హిందూ మతానికి చెందిన తన ఆదిత్యకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అప్పటికి వాళ్లు మైనర్లు. అప్పుడు ఫేస్‌బుక్‌లో పెట్టిన ప్రొఫైల్ ఫొటో, పేరు అయేషావి కావు. కానీ ఆదిత్యతో పరిచయం పెంచుకుంది మాత్రం ఆయేషానే.. రెండేళ్లపాటు మాట్లాడుకున్నారు కానీ ముఖాలు చూసుకోలేదు. ఆయేషాది బెంగళూరు. ఆదిత్యది దిల్లీ. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకోకుండానే స్నేహితులయ్యారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆయేషాకు ప్రేమ పట్ల నమ్మకం లేదు. అందుకే ఎప్పుడూ ఆదిత్యని పరీక్షిస్తుండేది. ఆయేషా, ఆదిత్యలకు ఒకరికొకరు మతాలు కూడా తెలుసు. కానీ రూపాలే తెలియవు. ఒకరోజు ఆయేషా తన కళ్లకు మాత్రమే తీసిన ఫొటోను ఆదిత్యకు పంపింది. ఆ ఫొటో చూసి ఆదిత్య బెంగళూరులోని ఆయేషా కాలేజీలో వాలిపోయాడు. కానీ ఆయేషా కలవలేదు. తరువాత కొన్నాళ్లకు ఆయేషా ఆదిత్యను కలిసింది.
వారిద్దరూ ఒకరికొకరు కలుసుకునేంతవరకు ఆదిత్య పేరు మాత్రం ఇరామ్‌ఖాన్ అని ఉండేది. కానీ అతను హిందూ అని ఆయేషాకు ముందునుంచీ తెలుసు. వారి ప్రేమకు మతం అడ్డంకి కాలేదు. కానీ వారి కుటుంబాలకు మాత్రం మతమే ముఖ్యమైంది. ఫలితంగా వారి పెళ్లికి ‘నో’ చెప్పేశారు. మతం మార్చుకోకుండా పెళ్లిచేయడం కుదరదని ఇద్దరి తల్లిదండ్రులూ తేల్చి చెప్పేశారు. కానీ వీళ్లకు తమ గుర్తింపును వదులుకోవడం ఇష్టంలేదు. గౌరవంగా పెద్దలకు చెప్పారు. వారు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు ఆపేందుకు ప్రయత్నించినా, తప్పించుకుని ఆదిత్యతో కలిసి ఆమె దిల్లీకి వచ్చేసింది. దిల్లీలో ఇద్దరూ సహజీవనం చేశారు. అయిదు నెలలపాటు గది లోపలే ఉండిపోయారు. బయటకు ఎక్కడికి వెళ్లినా వారి మతాలు వేరు కాబట్టి ఎవరైనా చంపేస్తారేమో.. అని భయపడ్డారు. కానీ వారి దాంపత్యం సజావుగా సాగాలంటే ఉద్యోగం అత్యవసరం.. దీనితో పాటు చట్టబద్ధంగా వివాహం చేసుకోవడం కూడా ముఖ్యం.. అన్న విషయాలను అర్థం చేసుకున్నారు. ఆ సమయంలో ఇంటర్నెట్ వారి జీవితాన్ని మలుపు తిప్పింది. ఇంటర్నెట్‌లో రాణు కుల్‌శ్రేష్ఠ్, ఆసిఫ్ ఇక్బాల్ దంపతుల గురించి తెలుసుకుని వారి వద్దకు వెళ్లారు. వారు కూడా మతాంతర వివాహం చేసుకున్నవారే.. వాళ్లు 2000 ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ‘ధానక్’ అనే ఓ స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు వారు. ఆ సంస్థ ద్వారా ఆయేషా, ఆదిత్యల వంటి దంపతులకు సురక్షిత ఆశ్రయం కల్పించడంతో పాటు, ‘ప్రత్యేక వివాహ చట్టం’ కింద పెళ్లిళ్లు చేసుకునేందుకు సాయపడుతున్నారు.
ప్రత్యేక వివాహ చట్టం
1954 ప్రత్యేక వివాహ చట్టం కింద.. వేరు వేరు మతాలకు చెందినవారు తమ మతాలను మార్చుకోకుండానే చట్టబద్ధంగా వివాహం చేసుకోవచ్చు. అయితే ఇద్దరూ తప్పనిసరిగా మేజర్లు అయ్యుండాలి. వారికి మరెవరితోనూ వివాహ బంధం ఉండకూడదు. అలాగే ఇద్దరూ పెళ్లికి మానసికంగా సిద్ధపడి ఉండాలి. ఈ వివాహం కోసం జిల్లా స్థాయిలో ఉండే మ్యారేజ్ అధికారికి అప్లికేషన్ ఇవ్వాలి. పెళ్లికి ముందు కనీసం 30 రోజులుగా దంపతులిద్దరూ అదే పట్టణంలో నివాసం ఉండాలి. ఆ అప్లికేషన్‌ను అధికారులు బహిరంగంగా ప్రదర్శిస్తారు. ఆ నెలరోజుల్లో అబ్బాయి, అమ్మాయి తరపు కుటుంబ సభ్యులు తమ అభ్యంతరాలను, ఫిర్యాదులను వెల్లడించవచ్చు. ఎలాంటి అభ్యంతరాలు లేని పక్షంలో వారి వివాహం సాక్షుల సమక్షంలో అధికారులు రిజిస్టర్ చేస్తారు. ఆయేషా, ఆదిత్య అధికారులను పలుమార్లు కలిశారు. ‘్ధనక్’ సంస్థకు చెందిన పలువురు దంపతులను కూడా కలిశారు. ఆయేషా, ఆదిత్యల వివాహం జరిగింది. కొత్త జీవితం ప్రారంభించారు. నెమ్మదిగా వారిలో భయం దూరమైంది. ఆయేషా ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించింది.
ధానక్ సంస్థ
‘పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి, అబ్బాయిల్లో ఆత్మవిశ్వాసం ఉండటం చాలా ముఖ్యం. వాస్తవానికి భారతదేశంలో తల్లిదండ్రులు కొడుకుల పట్ల మృదువుగా వ్యవహరిస్తుంటారు. సమాజంలో ‘గౌరవం అనే భారం’ అమ్మాయిల భుజాలపైనే ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలను తమ వంశానికి వారసులుగా చూస్తారు. అందుకే వారికి కుటుంబంలో స్వేచ్ఛ కాస్త ఎక్కువగా ఉంటుంది. అదే అమ్మాయిలపై అనేక షరతులు పెడుతుంటారు’ అని చెబుతోంది ధానక్ సంస్థను నడిపే రాణు.
‘తమ జీవితంలో ఇది అత్యంత క్లిష్టమైన దశ అని, ‘ప్రత్యేక వివాహ చట్టం’ కింద పెళ్లి చేసుకుని సొంత కాళ్లపై నిలబడాలంటే అనే బంధుత్వాల మధ్య, కలల మధ్య సమతూకం పాటించాల్సి ఉంటుంది’ అని చెబుతాడు ఆదిత్య. ఇప్పుడు ఇద్దరికీ 21 సంవత్సరాలు వచ్చాయి. ఇద్దరికీ ఇద్దరిపై పరస్పరం నమ్మకం ఉంది. ఆయేషాతో బంధాన్ని నిలబెట్టుకునేందుకు ఆదిత్య ఎంతో పోరాడాల్సి వచ్చింది. ఆ పోరాటంలో ఆదిత్య గెలిచాడు. రెండో పోరాటం కుటుంబంతో, సమాజంతో.. ఇప్పుడు ఇద్దరూ కలిశారు కాబట్టి.. ఇక ఆ పోరాటంలోనూ వారిదే విజయం.
*