మెయిన్ ఫీచర్

నిరంతర సాహితీ తపస్వి నిర్మల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ పేరు వినంగానే అదేం చిత్రమో వెంటనే పాఠక లోకానికి భావ కవితా చక్రవర్తి, నిన్నమొన్నటిదాకా మన ముందు నడయాడినవాడూ, తెలుగు చలనచిత్ర రంగంలో పాటల రచయితగా మధ్యందిన మార్తాండునిలా వెలిగిన దేవులపల్లి కృష్ణశాస్ర్తీగారు తళుక్కుమంటారు. చిరకాలం ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నెలకొల్పబడి వున్న ‘ఆంధ్ర మహిళాసభ’ డిగ్రీ కాలేజీలో పనిచేసిన నిర్మల గారు సహజంగానే మృదుభాషిణి. పరమ సాత్త్వికురాలు.

నాలాంటివారు అమెరికా లాంటి దేశాలలో పర్యటిస్తూ, అక్కడ ఏవన్నా సాహిత్యోపన్యాసాలు, నాటక ప్రదర్శనలూ చేస్తున్న సందర్భాలలో కార్యక్రమాంతంలో కొంతమంది స్ర్తిమూర్తులు మా అమ్మాయి నిర్మలగారి శిష్యురాలేనండీ! మీరు కూడా నిర్మలగారితో కలిసి అనేక వేదికలలో సాహిత్య కార్యక్రమాలు చేయడం మేము చూశాం అంటున్నపుడు ఎందుకో ఒకరకమైన ఆనందం నాకు కలుగుతుంది. శ్రీమతి నిడమర్తి నిర్మలగారు కేవలం ఆంధ్రోపన్యాసకురాలు మాత్రమేకాదు, రంగస్థలంలో కూడా మాతో నటించిన స్ర్తిమూర్తి. విచిత్రమేమిటంటే అంతటి మృదుమధుర గాత్ర, సత్వ ప్రవర్తన గలిగిన నిర్మలగారు దుర్యోధనుడి పాత్ర వేయడమే.. శ్రీమతి వేలూరి రేణుక, దివంగత శ్రీమతి రాజలలితగారు నా ప్రక్క (కృష్ణుడు) దుర్యోధన, అర్జున పాత్రలు వేయడం మొదలైన దృశ్యాలు నాకు గుర్తుకువస్తున్నాయి. నిర్మలగారి రంగస్థల నటనా ప్రావీణ్యం, పద్యపఠనం అటు ప్రక్కకుపెడితే ఒక గొప్ప రచయిత్రిగా, వక్తగా ఆమెను గూర్చి చెప్పడమే ఈ వ్యాసంలోని ముఖ్యోద్దేశ్యం!
శ్రీమతి నిర్మలగారు ఇటీవలికాలంలో పుంఖానుపుంఖాలుగా రచనలు చేస్తున్నప్పటికీ (ముఖ్యంగా బుర్రకథలు, నృత్యరూపకాలు) నాలాంటి వాడికి మాత్రం ఆమె ఎన్నడో చాలానాళ్లక్రితం, అంటే 2002 మే నెలలో రచించిన ‘్భరత భారతి’ పుస్తకమే గుర్తుకువస్తుంది. విజయలక్ష్మీ పబ్లికేషన్స్, అరండల్‌పేట, జానీవారివీధి, విజయవాడవారు దీనిని వెలుగులోనికి తెచ్చారు. దీంట్లో ఐదు నృత్యరూపకాలను అందించారు నిర్మలగారు. ఇందులోని వసంత రాజీయం, మాళవికాగ్నిమిత్రం, గోదాపరిణయం వంటి నృత్య రూపాకాలు అనేకమార్లు అనేక వేదికలమీద (టీవీలలో కూడా) ప్రదర్శనలకు నోచుకోవడం నాకు గుర్తు. ఈ గ్రంథానికి ప్రఖ్యాత నృత్య గురువు, ఇటీవలే స్వర్గస్థురాలైన ఉమారామారావుగారు నిర్మలగారి రచనను మెచ్చుకుంటూ ‘‘సంగీతానికి ఒక సాహిత్య బాటను జూపి, నృత్యానికి ఒక మంచి ఊహను కల్పించారు’’ అన్నారు. ‘మున్నుడి’ వ్రాసిన ఆచార్య పి.యశోదారెడ్డిగారు నిర్మలగారికి అద్భుతమైన ధృవీకరణ పత్రం ఇచ్చారు. డా నిర్మల కేవలం నాటక లక్షణ పరిజ్ఞానం మాత్రమే కలిగిన రచయిత్రిగాదు రాగ తాళ ప్రస్తారాలనూ, లయ విన్యాసాన్నీ, ఛందోరీతులనూ బాగా ఆకళించుకొని గుర్తెరిగి వ్రాయగల చేవ వున్న రచయిత్రి అన్నారు. నిజంగానే ‘సువర్ణాశోకం’లోని అగ్నిమిత్రుని ‘నింగీ నేలలనొక్క ముడి వేయునదే అనురాగబంధము! అది ప్రేమ చందము’ మొదలైన వాక్యాలు యశోదగారి మాటలను నిజం చేస్తాయి.
అలాగే నిర్మలగారి వ్యాసమాధురి నేటి విద్యార్థి లోకానికేగాదు అందరికీ, ముఖ్యంగా తెలుగు సాహిత్యం (నవీన-ప్రాచీన) లోతులు తెలుసుకొనగోరేవారికి ఒక దిక్సూచి, అంటే అతిశయోక్తికాదు. ‘్భవనైర్మల్యం’ అనే శీర్షికతో ముందుమాటలు ప్రసిద్ధ పరిశోధకృతా, బహుళ గ్రంథకర్తలయిన మా అన్నగారు మంజుశ్రీగారు ఈ గ్రంథానికి అందించారు. ఇందులో 12 వ్యాసాలు కనబడుతాయి. అటు ప్రాచీనులు, యిటు ఆధునికులూ కనబడతారు. ప్రాచీన మహాకవుల మాటలటు ప్రక్కకుబెడితే, లబ్ధప్రతిష్ఠులైన ఆధునిక కవులకు ముఖ్యంగా, విశ్వనాథ, శేషేంద్ర, బోయి భీమన్నలకు పట్టంగట్టారు నిర్మలగారు.
ధరణిగల్గిన ముగ్ధ సౌందర్యమెల్ల
ఆమనిగ లేచి వాని ‘మకాములో’
గజ్జెగట్టిన దాంధ్ర రంగస్థలమ్ము
రంజితమ్మయినది నేటి రాగమందు
వసంతోత్సవమున ఈ పద్యలోకమెల్ల ద్రవియించి ‘నాక’మైందన్న మహాకవి కీ.శే. బోయి భీమన్నగారిని స్మరించారు. ఇటీవల నే రచించిన ‘్భమన్నా’ అనే ద్విశతిలో నేను గూడా అందుకే భీమన్నగారి సర్వతోముఖ పాండిత్యాన్ని గురించి- గుర్తించి-
శ్రీకంఠుని శుభనామము
ప్రాకటముగ దాల్చి వరులు వాడవుగానన్
నీ కమరె సుకవితాశ్రీ
చేకొనుమివె నతులు నుతులు శ్రీ భీమన్నా!
అన్నాను. జాతి పెడద్రోవలో పోతున్న ఈ తరుణంలో ‘స్వామి దయానంద సరస్వతి’పై నిర్మలగారు వ్రాసిన వ్యాసం చదివితే ముఖ్యంగా విద్యార్థి లోకానికి కొంతగాకపోతే కొంతైనా పరివర్తన కలుగుతుందనుకుంటాను. ఈనాటి ఉమకారులందరూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్ర సోదరులు ‘తెలుగు భాషా రాష్ట్ర విధాత పొట్టి శ్రీరాములు’ వ్యాసం అవశ్యం చదవాలి. ‘విద్య-విద్యార్థులు’ అనే వ్యాసాన్ని మనం చదువక్కర్లేదు, అదే చదివిస్తుంది. అలాగే శ్రీమతి నిర్మలగారి ‘వ్యాసవిపంచి’లో గూడా అద్భుతమైన వ్యాసాలు కనిపిస్తాయి. ఈ వ్యాస విపంచిలో ‘చలం - ఊర్వశి’ ఒక పరిశీలన, సి.నా.రె గేయకావ్యాలు ఈ రెండు వ్యాసాలు మరీ ప్రాధాన్యతను సంతరించుకున్నాయేమోనని నా మనస్సుకు అనిపిస్తుంది. సి.నా.రె సాహిత్యంమీద అనేకమంది డాక్టరేట్లు చేశారు. నిర్మలగారి ఈ వ్యాసవిపంచిలోని వ్యాసానికి నిజంగా ప్రత్యేకంగా ఒక డాక్టరేట్ ఇవ్వవచ్చునేమో అనేంత మోతాదులో కనిపిస్తుంది. 2012 సం.లో నిర్మలగారు ప్రకటించిన ‘‘పాటిబండ మాధవశర్మగారి జీవిత సాహిత్యౌన్నత్యం’’ అనే పుస్తకంలో పాడిబండ్ల వారి సమగ్ర సాహితీ మూర్తిమత్వాన్ని అందించారు. ప్రాసంగికంగా అనేక విషయాలు ఈ పుస్తకంలో మనకు కనబడతాయి. మాధవశర్మగారు నాకు కూడా గురువుగారే! నేను నిజాం కళాశాల విద్యార్థిగా ఉన్న రోజుల్లో (1972-74) మాకు ఆయన వసుచరిత్ర పాఠం చెప్పారు. గొప్ప పండితుడనే విషయం సర్వాంధ్రానికీ విదితమే! ఒక సమావేశంలో కీ.శే.దేవులపల్లివారు, మాధవశర్మగారిని గురించి విపరీతమైన ప్రశంసలతో ముంచెత్తారు. అంటే మెళ్ళో వేలాడుతున్న పెన్సిల్‌తో పేపరుమీద వ్రాశాడు. అప్పటికే ఆయన గొంతు మూగవోయింది. ఇది నా ప్రత్యక్ష అనుభవంగాబట్టి గుర్తుకువస్తున్నది. అదే చర్చలో నేను పాడిన బలిజేపల్లి సత్యహరిశ్చంద్రీయ పద్యం ‘అరమన్ వంశము’ పద్యం గూడా గుర్తుకువస్తున్నది. ఈ మాటలేం అప్రస్తుతాలని అనుకోకండి. అప్పటి కవులు, విమర్శకులూ అందరూ సంగీత, నాటకప్రియులని చెప్పడమే నా అభిమతం.
‘నరుని అమరత్వ ప్రస్థానము’ అంటూ నిర్మలగారు ప్రచురించిన పుస్తకంలో ‘మానవోత్తముడు రాముని చరితం’, అలాగే ‘తెలుగువారి కల్పవల్లి దుర్గమతల్లి’ (దుర్గాబాయి దేశ్‌ముఖ్) రెండూ అద్భుతంగా కనిపిస్తాయి. దుర్గాబాయమ్మగారి గురించి వ్రాస్తూ ఆమె ఒక వ్యక్తిగాదు ఒక మహాశక్తి అంటూనే -
తెలుగు తల్లి పూదోటను - అలుముకున్న వెలుగు వల్లిని
విలసిల్లెనొక స్నేహ సేవా పరిమళభరిత కాంతిసుమము
తల్లిదండ్రుల అనురాగాల పంట
చెలులకేమొ సరాగాల జంట
తెలుగుతల్లికే కంటిపాపయై, బాలిక దుర్గ రాజిల్లె కాకినాడింట
ఇటువంటి సంగీత శ్రుతిలయలకు అనుగుణంగా దుర్గాబాయమ్మగారి కీర్తిమత్వాన్నీ, మూర్తిమత్వాన్నీ వివరిస్తారు.
ఇటీవలికాలంలో నిర్మలగారి గేయ నృత్యరూపకాలు జంట నగరాలలోనే గాకుండా యావద్దేశంలో ముఖ్యంగా మహానగరాలలో ప్రదర్శితం కావడం చూస్తున్నాను. ఒక మంచి క్రమశిక్షణ గలిగిన నాట్య గురువులు, విద్యార్థినులు ఆ బృందాలలో ఉండడం పెద్ద అదృష్టం. అలాగే ‘్భమినీ భువనవిజయం’ నిర్మలగారి మరో గొప్ప రచన. గొప్ప విషయమేమిటంటే, నిర్మలగారు అలుపనేది లేకుండా ఏదో ఒక రచనా వ్యాసంగంలో మునిగితేలుతుండడమే! ఈ భామినీ భువనవిజయ ప్రదర్శనలను కూడా నేను వీక్షించాను. ఈ బృందంలో కర్ణాటక సంగీత శాస్త్రంలో మంచి ప్రావీణ్యం ఉన్న స్ర్తిమూర్తులను ఒకరిద్దరిని ఎంపిక చేసుకున్నారు నిర్మలగారు. అందువల్ల ఈ ప్రదర్శనకు మరింత రాణింపు వచ్చింది.
నిర్మలగారి బుఱ్ఱకథలలో ‘వీరనారి దుర్గ’, ‘విశ్వమానవ విధాత వివేకానంద’ రెండూ ఆణిముత్యాలే! వీరనారి దుర్గలో ఆమె సాధించిన విజయాలు, ఆమె సాంస్కృతిక సేవ మొదలైన విషయాలతోపాటు, 24 సం.ల ప్రాయంలో ఇంగ్లీషు చదువు ప్రారంభించి, చాలా తక్కువ వ్యవధిలో బెనారస్ మెట్రిక్కు ప్యాసై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బి.ఏ ఆనర్సు పూర్తిచేసి, మద్రాసులో లా చదివి న్యాయవృత్తిని చేపట్టింది. మొట్టమొదటి లేడీ క్రిమినల్ లాయర్‌గా వాసికెక్కిన మహిళామణి దుర్గాబాయమ్మగారు.. ఇటువంటి విషయాలు, అలాగే ఆమె జైలుపాలయినపుడు జైల్లో ఆమె కొనసాగించిన పనులూ కళ్లకు కట్టినట్లు ఈ బుఱ్ఱకధలో వివరించారు నిర్మలగారు. ఆవిడగారు ‘రాయవెల్లూరు’ జైల్లో వున్న సమయంలో జైలుని ఒక సాంస్కృతిక నిలయంగా మార్చివేసిందట. సాధన కేంద్రగా రూపొందించింది. తోటి ఖైదీలకు హిందీ పాఠాలు చెప్పేది. పాటలు పాడేది, పాడించేది. దేశభక్తుల చరిత్రలను నాటకాలు వేయించేది. దుర్గాబాయమ్మగారి సాహసనృత్యాలు అనేకం ‘వంత’ల నోళ్ళమీదుగావచ్చే వాక్యాలు వింటున్నపుడు మనకు చాలా ఆనందాశ్చర్యాలు కలుగుతాయి. ‘మధుర జైలు’ సంఘటన పాఠకులను ముగ్ధుల్ని చేస్తుంది. ఒక స్ర్తి తన తోటి ఖైదీమీద కసితో కన్న మమకారానే్న మరచి తన బిడ్డను తానే చంపుకుంటూంటే చూసిన దుర్గాబాయమ్మ తన ప్రాణాలొడ్డి ఆ పసిబిడ్డను రక్షించిందట. ఆ సాహసకృత్యానికి ఉపకృతిగా జైలు సూపరింటెండెంట్‌నుండి ‘వీణ’ బహుమతిగా పుచ్చుకుంది దుర్గమ్మ. దుర్గాబాయమ్మ సంపూర్ణ మూర్తిమత్వం ఈ బుర్రకథలో చూస్తాం.
అలాగే ‘విశ్వమానవ విధాత వివేకానంద’ బుర్రకథలో స్వామి వారి జీవిత విశేషాలు, ముఖ్యంగా సనాతన ధర్మ ప్రతిష్ఠకై స్వామివారి దివ్య వచనాలు, విశ్వసౌభ్రాతృత్వం కోసం స్వామివారు చేసిన ప్రయత్నాలు, చికాగో మహాసభలో స్వామివారు చేసిన ప్రసంగ పాఠాంశం మొదలైన వాక్యాలు శ్రోతలను పులకితగాత్రుల్ని చేస్తాయి. ‘‘మేలుకొనుడీ భరతపుత్రులు, మేలుకొనుడీ సచ్చరిత్రులు, మేలుకొనుడీ నవయువకులు, మేలుకొనుడీ భావినేతలు, ఆలకించుడీనాడు బోధలు’’- మొదలైన వాక్యాలు చదువురులను కూడా అప్రయత్నంగా పాడేలా చేస్తాయి. అటు ప్రాచీన సాహిత్యాన్ని, యిటు బుర్రకథల వంటి జానపద సాహిత్యాన్నీ, మరోవైపు పౌరాణిక నాటక రంగాన్ని కూడా సుసంపన్నం చేస్తున్న శ్రీమతి నిర్మలగారి సాహితీ జీవనం సర్వవిధాలా ప్రశంసనీయం.

- డా॥ అక్కిరాజు సుందర రామకృష్ణ 98850 20205