మెయిన్ ఫీచర్

తేనెలొలికే తల్లి పలుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్యసమితి ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించటం వలన ప్రపంచ వ్యాప్తంగా మాతృభాషా వికాస ప్రాధాన్యతకు గుర్తింపు లభిస్తోంది. యునెస్కో ఈ తేదీని ఎంపిక చేసుకోవటంతో భారతీయ భాషగా బెంగాలీ, అంతర్జాతీయ స్థాయిలో చరిత్రాత్మక స్థానం పొందింది. అఖండ భారతావని బ్రిటీష్ పాలనాకాలంలో స్వాతంత్య్ర పోరాట చైతన్య స్ఫూర్తికి బెంగాలీ భాషలో బంకించంద్ర చటర్జీ, రబీంద్రనాథ్ టాగోర్ వంటి సాహితీవేత్తలు, ఎందరో విప్లవోత్తేజంతో సమరయోధులకు బెంగాల్ పుట్టిల్లు అయింది. నాటి బ్రిటిష్ ప్రభుత్వం సృష్టించిన బెంగాల్ విభజన, రగిలించిన స్వాతంత్య్ర సమరోత్తేజానికి మాతృభాష, మాతృదేశ స్వేచ్ఛా స్వాతంత్య్ర సాధన కీలకమైంది. స్వాతంత్య్రానంతరం అఖండ భారతం ఇండియా, పాకిస్థాన్‌లుగా విభజింపబడిన చారిత్రక నేపథ్యంలో, 1971లో బెంగాలీ మాతృభాష అయిన తూర్పు పాకిస్థాన్ బంగ్లాదేశ్‌గా ఆవిర్భవించటానికి తల్లి భాష కారణమైంది. ప్రాంతీయత కంటే ఒకే భాష మాట్లాడే ఐక్యతా బలీయ మాధుర్యం, ఎంత పటిష్టమైనదో బంగ్లాదేశ్, బెంగాలీ భాష ప్రపంచానికి చాటిచెప్పింది.
1948 మార్చి 24న పాకిస్థాన్ ఏర్పాటు తదనంతరం, తూర్పు పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ ఐక్యతకు భాషా ప్రాతిపదికన బీజం పోయటానికి మహమ్మదాలీ జిన్నా ఢాకా యూనివర్సిటీ కర్జన్ హాల్‌లో పాకిస్థాన్ దేశానికి అధికార భాషగా ఉర్దూ ప్రకటించాడు. తరువాత జిన్నా ఆరు నెలల్లోనే మరణించాడు. తూర్పు పాకిస్థాన్ బెంగాలీలు తమ మాతృభాష బెంగాలీని పణంగాపెట్టడానికి అంగీకరించని ఆగ్రహోద్యమాలు క్రమేపీ పుంజుకొన్నాయి. పాకిస్థాన్ దేశ ఐక్యతా, సమగ్రతకు ఉర్దూ భాష అత్యవసరమని నాటి పాలకులు చర్యలు ఆరంభించారు. మొహమ్మద్ షాహీదుల్లా వంటి సాహితీవేత్తలు, తమద్దున్ మజ్లిస్, రాష్ట్ర భాషా సంగ్రామ పరిషత్ వంటి సంస్థలు తీవ్ర అణచివేతకు గురికావటం, క్రమేపీ పాక్ ప్రభుత్వం ఉర్దూ రాజభాషగా పాలనా విధానాల అమలు ప్రారంభించింది. నిరసనోద్యమాలు, బహిరంగ సభలు నిషేధింపబడడంతో ఆజ్యం పోసినట్టయింది. అప్పుడు ‘ఏకుషి’ ప్రభవించింది. బెంగాలీ భాషలో ‘ఏకుషి’ అంటే 21వ తేదీ. 1952 ఏకుషిన ఫిబ్రవరి 21, ఢాకా యూనివర్సిటీ, యితర రాజకీయ ఆందోళనకారులతో భాషామహోద్యమం తల ఎత్తింది. యూనివర్సిటీ ప్రాంగణం అగ్నిగుండమైంది.
పాకిస్థాన్ పోలీసులు అణచివేత చర్యలలో భాగంగా మారణ హోమంలో యువ రక్తం ఏరై పారింది. అబ్దుస్ సలామ్, అబ్దుల్ జబ్బార్, రఫీక్ ఉద్దీన్ అహ్మద్, అబ్దుల్ బర్కత్ ఎందరో బెంగాలీ ప్రేమికులు ఢాకా నగరంలోని అగ్నిజ్వాలలు తూర్పు పాకిస్థాన్‌ను చుట్టుముట్టాయి. మర్నాడు ఫిబ్రవరి 22న సోఫిర్ రహ్మాన్ వంటి యువ నేతలెందరో ఆహుతి అయ్యారు. అసంతృప్తి, ఆవేదన, ఆగ్రహం, నిరసన జ్వాలలోంచి ‘అమర్ భయర్ రోక్తే రంగ్‌నొ, ‘ఏ కుషే ఫిబ్రవరి’ (్ఫబ్రవరి 21, నా సహోదరుని రక్తంతో తడిసింది) అదీ ‘ఏకుషి’ విషాద కథనంగా ప్రపంచం గుర్తించింది.
1999లో యునెస్కో, ‘ఏకుషి’ నిరసన పోరాట స్మృతి చిహ్నంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఫిబ్రవరి 21గా, ప్రపంచంలోని దేశీయ భాషా సమానత, గుర్తింపు, హక్కుల పోరాట స్ఫూర్తిగా ప్రకటించింది. 2008 అంతర్జాతీయ మాతృ భాషా సంవత్సరంగా ప్రపంచ వ్యాప్తంగా తల్లి పలుకుబడిని ఆరాధించటం విశేషాంశం. యునెస్కో నివేదిక ప్రకారం 30 శాతం బాలబాలికలు మాతృభాష నేర్చుకోకపోతే ఆ భాష బతుకు ప్రమాదంలో పడినట్టే. మన దేశ స్వాతంత్య్రానంతరం మాతృభాషాభిమానం పెల్లుబికి, భాషాసంయుక్త రాష్ట్రాల ఆవిర్భావం దేశానికి మార్గదర్శకమైంది. ఆంగ్ల భాషాధిపత్యం కారణంగా ప్రస్తుత ప్రపంచంలో 6900 భాషల్లో సగానికి సగం పూర్తిగా అంతరించి కనుమరుగయ్యే ప్రమాదం పొంచి వుంది. తల్లి భాష తలపులు అంతగా లేని కాలంలో ఉజ్వలంగా వికసించిన మన తల్లిభాష, ఆంగ్లాధిపత్యం కారణంగా విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోంది. తెలుగు పిల్లలు ఇంటా బయటా కూడా తెలుగుకు దూరంగా అవుతున్నారు. తేనెలొలికే తెలుగు భాష తీవ్ర నిరాదరణకు గురిఅవుతున్నమాట వాస్తవం. ఒకప్పుడు జీవద్భాషగా జన సామాన్యపు నాల్కలపై నాట్యంచేసిన తీయని తెలుగు పలుకులు శాపగ్రస్తమై తెలుగుతల్లి, నిర్లక్ష్య నిరాదరణకు గురిఅవుతోంది. జాతీయస్థాయి ప్రాచీన భాషగా గుర్తింపు పొందటానికి ఎంతో ప్రయాస పడవలసి వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల తల్లి భాషగా, జాతీయస్థాయిలో అత్యధిక జనావళి మాతృభాషగా మన మాతృభాషను మరింత సజీవ చైతన్యంతో రక్షించుకోవలసిన అగత్యం తల ఎత్తింది.

-జయసూర్య 94406 64610