మెయన్ ఫీచర్

‘ఒప్పందం’ లేదని ఒప్పుకున్న కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టత్రో ఒప్పందాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 24న బేగంపేట విమానాశ్రయం వద్ద చేసిన సవాలు, అందుకు టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అదేరోజు మీడియా సమావేశంలో చెప్పిన మాటలు, మరునాటి ఉదయం టివి చానళ్లలో జరిగిన చర్చల తర్వాత ఒక విషయం సందేహాలకు అతీతంగా స్పష్టమైంది. లోగడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు తమ్మిడిహట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తున నిర్మించేందుకు మహారాష్టత్రో ‘ఒప్పందం’ జరిగిందనే మాట నిజం కాదు. ‘ఒప్పందం’ జరిగిందంటూ ఇంతకాలం వాదించిన కాంగ్రెస్ నే తలు ఇపుడు కెసిఆర్ సవాలు తర్వాత వెనక్కు తగ్గి అది ‘‘సూత్రప్రాయ అంగీకారం’’ మాత్రమేనని ఒప్పుకుంటున్నారు. ఈ మాటనే మొదటినుంచి అని ఉంటే కెసిఆర్ సవాలు గాని, తక్కినవన్నీగాని జరిగే ఆస్కారమే ఉండేది కాదు. తమ తీరు గురించి ఇటువంటి స్పష్టత వచ్చే పరిస్థితిని సృష్టించినందుకు మాత్రం కాంగ్రెస్‌ను అభినందించాలి.
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయివాడు, ఈ పద్ధతిలో సవాళ్లు విసరడం, అవినీతి ఆరోపణలను రుజువు చేయనట్లయితే కేసులు పెట్టి జైళ్లకు పంపుతామనడం సరికాదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి మరొకమాట అన్నారు. ఇది సాధారణ పరిస్థితులలో కాదనలేనిదే. కాని అట్లా అనే అసాధారణ పరిస్థితులేమేనా ఏర్పడ్డా యా అన్నది విచారించవలసిన విషయం. స వాలు విసరిన సమయంలో బేగంపేట వద్ద ముఖ్యమంత్రి అన్నదాన్ని బట్టి, ‘‘రెండు సంవత్సరాలనుంచి నేను వౌనం పాటించిన. మర్యాదగ ఉందాం. పెద్దమనిషి రకంగా అనుకున్నా. కాని ఉత్తమ్ కుమార్ రెడ్డి అండ్ కంపెనీ..’’ చేసినవి ఏవో ఉన్నాయి. అవేమిటో అందరూ గమనిస్తూ ఉన్నవే. ఎమిటవి?
తిరిగి ఈ 152 మీటర్ల విషయమే మొదట చూద్దాం. మహారాష్టల్రో తమది ‘‘సూత్రప్రా య అంగీకారం’’ మాత్రమేనని ఇప్పుడు చల్ల గా ఒప్పుకుంటున్నవారు అటువంటి నిజాయ తీ మొదటినుంచి లేకుండా ‘‘ఒప్పందం’’ అం టూ పదేపదే ఎందుకు మాట్లాడారు? తాము 152కు ‘‘ఒప్పందం’’ చేసుకోగా కెసిఆర్ 148కి తగ్గించి ‘‘తెలంగాణకు ద్రోహం’’ చేసారంటూ నిర్విరామ ప్రచారాలు, నిందలు సాగించడంలోని నీతి ఏమిటి? ఇదంతా రైతులు, ప్రజల దృష్టిలో ముఖ్యమంత్రిని కేవలం అసత్యాల ఆధారంగా అప్రతిష్టపాలు చేసే రాజకీయం కాదా? అనగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి అయినవాడు ‘‘అందుకు తగినట్లు’’ వ్యవహరించాలి. కాని ప్రధాన ప్రతిపక్షానికి రాష్టస్థ్రా యి అధ్యక్షుడు, సీనియర్ రాజకీయనేత అ యిన తను మాత్రం ‘‘అందుకు జరిగినట్లు’’ వ్యవహరించనక్కరలేదన్నది ఉత్తమ్‌కుమర్ రెడ్డి ఉద్దేశమనుకోవాలా? తెలంగాణ కొత్త రాష్టమ్రై, అటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ‘‘అందుకు తగిన’’ బాధ్యత, పరిణతి చూపడం అవసరమైనట్లే, అటువంటి కొత్త రాష్టప్రు ప్రధాన ప్రతిపక్షానికి అధ్యక్షుడైన వ్యక్తి ‘‘అందుకు తగిన’’ బాధ్యత, పరిణతి చూపడం కూడ అవసరమని ఆయన భావించడంలేదా? భావించి ఉంటే ‘‘ఒప్పం దం’’ అబద్ధాన్ని గోబెల్స్‌వలె చలామణి చేసేందుకు ఎందుకంత శ్రమపడ్డారు? ‘‘ఇందుకు ముఖ్యమంత్రి ప్రజల ఎదుట జవాబు చెప్పా లి’’ అం టూ బోనెక్కించేందుకు నానా ప్రచారాలు చేశారు. ఎందుకు?
ఈ ప్రశ్నలకు సమాధానాలు ప్రజలు ఇప్పుడు బేగంపేట సవాల్ ఉదంతం దరిమి లా పూర్తిగా అర్థమై ఉంటాయి. మహారాష్టత్రో తాము చేసుకున్నది ‘‘సూత్రప్రాయ అంగీకార’’మే తప్ప ‘‘ఒప్పందం’’ కాదని కాంగ్రెస్ వారికి కెసిఆర్ సవాలు తర్వాత అప్పటికప్పుడు క్షణాల్లో కొత్తగా తెలిసిరాలేదు. అది వారికి మొదటినుంచీ తెలుసు. కాని రాజకీయ ఉద్దేశాలతో అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రజ ల దృష్టిలో సిఎంను ‘‘తెలంగాణ ద్రోహి’’గా నిలబెట్టదలచుకున్నారు. 2014లో ఓడిన తమకు 2019లో అధికారం కావాలి. అందుకోసం నిజమా కాదా అనే దానితో నిమిత్తం లేకుండా ఏవైనా మాట్లాడతారు. ఎటువంటి ఆరోపణలైనాచేసేందుకు వెనుకాడరు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి ఇది హానికరమని, 130 సంవత్సరాల చరిత్ర కలిగి దశాబ్దాల పాటు పాలించిన ఒక పార్టీకి అధ్యక్షుడైన ‘‘తన స్థాయికి’’ ఇది ఉచితం కాదని గాని ఉత్తమ్‌కుమార్ రెడ్డికి ఎంతమాత్రం తట్టదు.
‘‘ఒప్పందం’’ ప్రశ్నపై తమ వ్యవహరణవల్ల తమకు కలుగుతున్న నష్టం ఎంతటిదో కాంగ్రెస్ నాయకులు సావధానంగా ఆలోచించుకోవడం మంచిది. వారికి ప్రజల దృష్టిలో అసలే విశ్వసనీయత తక్కువ. అది ఈ ఉదంతంతో మరింత అడుగంటుతుంది. ఇక ముందు ఒకవేళ నిజాలు చెప్పినా ప్రజలు అపనమ్మకంతోనే చూస్తారు. అవినీతి ఆరోపణల మాట కూడా అంతే. తాము రాజకీయస్థాయిలో ఎటువంటి అవినీతి లేకుండా రెండేళ్ల నుంచి పాలిస్తున్నామని తరచు ప్రకటించే కెసిఆర్, అదేమాటను బేగంపేటవద్ద మరొకమారు అన్నారు. కాని కాంగ్రెస్‌వారు ఇంతవరకు అవినీతి అన్నారే తప్ప, చూపించిన దృష్టాంతం ఒక్కటి అయినా లేదు. అధికారుల అవినీతి సంగతి వేరు. అది లేదని ముఖ్యమంత్రి అనలేదు. ఆ విషయమై చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. యం త్రాంగం అవినీతిని అరికట్టడం ఎవరికీ తేలికకాదు. కనుక దానినట్లుంచితే, ఆరోపణలను రాజకీయ నాయకత్వంపై చేస్తూ వస్తున్న కాంగ్రెస్ వాదులు ఇంతవరకు ఏదీ వెల్లడి చేయలేకపోవడం, ప్రజలకు వీరిపట్ల విశ్వా సం కలగకపోవడానికి మరొక కారణం.
ఇటువంటి అవిశ్వసనీయత బేగంపేట్ పరిణామం తర్వాత మరింత పెరగనుండడం కాంగ్రెస్‌కు జరగగల ఇంకొక నష్టం. ఆరోపణలు చేసేవారు రుజువు పరచినట్లయితే కేసులు పెడతామని ముఖ్యమంత్రి సీరియస్‌గా అన్నారో లేక ప్రతిపక్షాలు నిర్హేతుక వ్యవహరణ వల్ల కలిగిన ఆవేదనతోనో మనకు తెలియదు. నిజానికి కేసులు పెడతామని ఆయన అనడం ఇది మొదటిసారి కాదు. లోగడ కూడా అన్నా ఆపని చేయలేదు. అయితే తన ప్రస్తుతపు మాటలకు స్పందనగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి తాను లోగడ సైన్యంలో పనిచేశా ను కనుక భయపడబోనని అనగా, కొందరు అదేరోజున (24వ తేదీన) జయలలిత కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను పేర్కొన్నారు. ఇదంతా బాగానే ఉంది. కాని సైన్యంలో (వైమానిక దళం) పనిచేసిన కాంగ్రెస్ అధ్యక్షుడికి శత్రువుపై తప్పు బాంబింగ్ చేయడం ధైర్యం కిందకు, సమర్థత కిందకు లెక్కరాదని తెలిసి ఉండాలి. పదేపదే తప్పు బాంబింగ్ చేసే వారిని అసమర్థులుగా పరిగణించి ఆ బాధ్యతలనుంచి తప్పిస్తారు. అదేవిధంగా, ఆరోపణలను రాజకీయంగా, పరిపాలనాపరంగా ఎదుర్కొనాలని సుప్రీంకోర్టు చెప్పడమంటే బాధ్యతారహితమైన యదేచ్ఛారోపణలకు లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుందేమో పిసిసి అధ్యక్షుడు చెప్పగలగాలి. అవెట్లున్నా అంతిమంగా ప్రజల దృష్టిలో విశ్వసనీయత కోల్పోవడం కాంగ్రెస్ వారికి తమకు తాము విధించుకునే శిక్ష అవుతుంది. అప్పుడు ప్రజల వద్దకు వెళ్లి సుప్రీంకోర్టు వ్యాఖ్యలను చూపి విశ్వసనీయతను సంపాదించకోగలరా? ఓట్లు తెచ్చుకోగలరా?
‘‘ఒప్పందం’’ గురించి రాజకీయ ధోరణిలోమొదట ఏదో మాట్లాడి ఉండవచ్చు. అది అందరూ చేసేదే. కాని కనీసం మార్చి 31న అసెంబ్లీలో ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాతనైనా ఆపని మానవలసింది. ఒప్పందం లేకుండా పనులు చేవద్దని, అందువల్ల అనవసరపు ఖర్చు తప్ప ఉపయోగం ఉండదని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్, ఇక్కడి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లేఖను తన ప్రజంటేషన్ సమయంలో కెసిఆర్ చదివి వినిపించారు. దాని ప్రతులను కూడా సభ్యులకు ఇచ్చినట్టు గుర్తు. వాస్తవానికి ఈ లేఖ ప్రతులు తనకుముందు నుంచే సర్క్యులేషన్‌లో ఉన్నాయి. పరిమితంగా. కనుక తమ ‘‘ఒప్పందం’’ వాదన నిలిచేది కాదని ఉత్తమ్‌కుమార్ రెడ్డి వంటి సైనిక యోధునికి అర్థమై ఉండవలసింది. తనకు కాలేదు. పార్టీలోని ఇతర సీనియర్ రాజకీయ యోధులకూ అర్థమైనట్లు లేదు. అందువల్ల అటువంటి నిరాధార ప్రచారాన్ని అంతటితో ఆపివేయడానికి బదులు, ప్రజలముందు కెసిఆర్‌ను దోషిగా నిలబెట్టచూసి ఇప్పుడు తామే నిస్సందేహకరమైన దోషులుగా నిలబడ్డారు. ఇది పూర్తిగా వారి స్వయంకృతం.
పిసిసి అధ్యక్షుడు తన మీడియా సమావేశంలో మరికొన్ని అర్ధంలేని మాటలు మట్లాడారు. తమ్మిడి హట్టి ఎత్తును ‘‘152 మీటర్ల నుంచి 148 మీటర్లకు తగ్గించి’’ అనడం వా టిలో ఒకటి. ఇందులో అర్థం కానిది ఏమంటే, ‘‘152 మీటర్లు’’ అనేది అసలెక్కడున్నది? మన ఆలోచనల్లో, ప్రతిపాదన్లో, మన ఇంజినీర్ల లెక్కల్లో ఉన్నంత మాత్రాన దానికి నిబంధనల ప్రకారం ‘‘ఒక ఉనికి’’ లేదా స్టాండింగ్ అంటూ ఏర్పడదు. మహారాష్టత్రో ‘‘ఒప్పం దం’’ జరిగితేనే అది ఏర్పడుతుంది. మరి ఆ ఉనికి అన్నదే లేక మన అంచనాల్లో మాత్రమే ఉండినప్పుడు ‘‘తగ్గించడ’’మనే మాటకు ప్రాతిపదిక ఏమిటి? మన అంచనాలు ఏవి అయినప్పటికీ దానికి నిబంధనల ప్రకారం ఒక ‘‘ఉనికి’’ ఏర్పడితేనే, తగ్గించడం లేదా పెంచడమన్నది దాని ప్రాతిపదికగా జరుగుతుంది. ‘‘ఉనికి’’ అన్నది నిబంధనల మేరకు ఏర్పడనంతవరకు అది కాళ్లులేని కుర్చీ వంటిదే. 148 వల్ల మహారాష్టల్రో ముంపు లేనప్పుడు వారికి అభ్యంతరాలు ఉండవు గనుక అసలు ఒప్పందం ఎందుకన్నది ఆయన మరొక ప్రశ్న. మనం 148 అని చెప్పినంతమాత్రాన వారు నమ్ముతారన్న నమ్మకం ఏమిటి? వారి అనుమానాలు వారికుండి కేంద్రానికో, కోర్టుకో ఫిర్యాదు చేయవచ్చు. ఆ విచారణ వల్ల జరిగేది కాలహరణం. పైగా తమ్మిడి హట్టి గాక ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ వివాదాలు లేని సహకారం మహారాష్టత్రో అవసరమైనప్పుడు, అన్నీ లిఖితపూర్వకంగా ఉండటం శ్రేయస్కరం కాదా? ఇంతే విలువలేని మాటలు ఇంకా ఉన్నాయి. వాటన్నింటి గురించి చర్చించడం వృథా.
తెలంగాణ ముఖ్యమంత్రి సవాలులో ప్రస్తావనకు వచ్చింది కాంగ్రెస్ అధ్యక్షుని పేరుగాని, వాస్తవానికి అది తక్కిన ప్రతిపక్షాలకు కూడా అవుతున్నది. ముంబాయిలో 23వ తేదీన ఒప్పందాలపై సంతకాలు జరిగిన రోజున అది ‘‘చరిత్రాత్మక’’మైనదని సిఎం అన్నారు. దానిపై కాంగ్రెస్, బిజెపి, టిడిపి, సిపిఐ, సిపిఎం చేసిన వ్యాఖ్యలేమిటి? ఇది ‘‘చారిత్రాత్మక తప్పిదం, మేము 152 మీటర్లకు ఒప్పం దం చేసుకున్నాం’’ అని కాంగ్రెస్ అనగా, ‘‘పా త ఒప్పందమే’’ అని భాజపా, ‘‘152కు ఒ ప్పించాల్సింది’’ అని టిడిపి, ‘‘ఒప్పందం గతంలోనే జరిగింది’’ అని సిపిఐ, ‘‘కొత్త ఏమీలేద’’ని సిపి ఎం వ్యాఖ్యానించాయి. అధికార కాంక్షవల్ల తోచిందల్లా మాట్లాడటంతో ఇతర పార్టీలు కాంగ్రెస్‌కు తీసిపోవు గనుక ఇం దులో ఆశ్చర్యం లేదు. అయితే మరునాటి బే గంపేట సవాలుతో కాంగ్రెస్ గురించి ప్రజల కు స్పష్టత వచ్చినందున, అదే స్పష్టత తమ గురించి కూడా వచ్చి ఉంటుందని ఈ పార్టీలు గ్రహించుకోవాలి.

- టంకశాల అశోక్ (సెల్ : 9848191767)