మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని యిట్టి దివ్యానుభవము కలుగకుండునంతవఱకు ఇతరులందలి యెక్కువ తక్కువలను లక్షింపకుండుటెవ్వరికిని సాధ్యముకాదు. అట్టివారెల్లరును జాతి భేదాదులను పాటింపవలయును. అజ్ఞాన స్థితిలోనే కులాచారములను జాతి భేదములను అన్నిటిని త్రోసిరాజని విచ్చలవిడిగా సంచరించుచు సిద్ధత్వమును పొందినటుల నటించునేని, అట్టివాడు కృత్రిమముగా పండవేసిన లేత కాయవలె చెడును.
314. బ్రహ్మజ్ఞానమును బొందినవాడింకను జందెము నుంచుకొనుట యుక్తమా? బ్రహ్మజ్ఞానమును బొందినంతనే సమస్త బంధములును తమంతతామే తెగిపోవును. అపుడు వీడు శూద్రుడనియు, వీడు బ్రాహ్మణుడనియు, వీడు అగ్రజాతి వాడనియు, వీడు కడజాతి వాడనియు తారతమ్యములుండజాలవు. అపుడు జందెము తనంతటఅదే రాలిపోవును. కాని భేదములును తారతమ్యములును స్ఫురించుచున్నంతవఱకు బలాత్కారముగా వానిని పరిత్యజింపదగదు.
315. తుపాను చెలరేగునప్పుడు మఱ్ఱిచెట్టేదియో, రావి చెట్టేదియో గుర్తింపజాలము. అట్లే బ్రహ్మజ్ఞాన ఝంఝామారుతము వీచునప్పుడు జాతి భేదములుండజాలవు.
316. భగవద్భక్తిరసామృతమును తనివితీర గ్రోలిన యుత్తమభక్తుడు మధుపానమత్తునివంటివాడు. ఆ స్థితిలో ఆతడు ఉచితానుచితములను పాటింపజాలడు.
317. కృష్ణకిశోరుడు ఒకప్పుడు, ‘‘జందెమును మీరు ఎందుకు తీసివేసితిరి?’’అని నన్నడిగెను. నాలో ఈ మార్పుకలుగగనే అశ్వినీ ఝంఝామారుతము వీచుట చేతనో యనునట్లు సర్వము ఎగిరిపోయినది. పూర్వపు పొలిమేరలన్నియు తుడిచిపెట్టుకొనిపోయినవి. నాకపుడు బాహ్యస్ఫుణయేలేదయ్యె. ఇక యజ్ఞోపవీతముగాని, ఒడలిమీది బట్టను గాని సంరక్షించుకొనుమాట చెప్పెడిదేమి? తీవ్రమగు బ్రహ్మభావనయందు మునిగి బాహ్యస్మృతి లేక దినమున చాల భాగము దిగంబరుడవై యుంటినన్న సంగతియే నాకపుడు తెలియకుండెడిది. జందెము తీసివేసితివేమని కృష్ణకిశోరుడు నన్నాక్షేపించినప్పుడు నేనిటులని యూరకుంటిని: ‘‘్భగవదున్మాదము నిన్నావేశించినప్పుడు నీకీ విషయము తెలియగలదు లెమ్ము.’’
318. భగవన్నామ ముచ్చరించువారే పావనులు, కృష్ణకిశోరుడు అరియాధగ్రామమందలి పుణ్యాత్ముడు. ఆయన యొకప్పుడు బృందావనమునకు తీర్థయాత్రకు వెడలెను. యాత్రలో ఒకనాడు దాహపీడితుడై ఆయనయొక నూతిదాపున నిలుచుండిన యొకనిగాంచి, తనకు గొంచెము నీళ్లు తోడిపెట్టుమని యడిగెను. అందులకాతడు తాను కడజాతి వాడవనియు, బ్రాహ్మణునకు నీరు తోడిపెట్టుటకు తగననియు జెప్పెను. అది విని కృష్ణకిశోరుడు ఇట్లుపలికెను: ‘‘ఒకసారి భగవన్నామోచ్చారణచేసి పావనుడవుకమ్ము.’’ ఆతడంత భగవన్నామము నుచ్చరించి నీరుతోడిపెట్టెను. ఆయన ఎంతయో సదాచార సంపన్నుడగు బ్రాహ్మణుడయ్యును ఆ నీరు త్రాగెను. ఆయన విశ్వాసమెంత గొప్పదో!
319. త్రాగినవాడు తన చొక్కానుదీసి యొకప్పుడు తన నెత్తిమీద బెట్టుకొనును, మఱియొకప్పుడు కాళ్లకు దొడుగుకొనును. భగవన్నామ సుధను గ్రోలుటచే మత్తిలినవాడును బాహ్యస్పృహలేని వానివలెనే వర్తించును.

ఇంకావుంది...

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి