మెయన్ ఫీచర్

అసలు సమస్యకు మూలమేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుల్వామా (కాశ్మీరులో) సీఆర్‌పీఎఫ్ జవాన్లు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల చేతుల్లో హతులైతే ఇంకా పాకిస్తాన్‌ను బహిరంగంగా సమర్థించటం ఏమిటి? రోజూ ఎందరో ఆకలితో చనిపోతున్నారు. ఈ సైనికులు యుద్ధంలో చనిపోతే ఏమిటి? అని ఒకడు అన్నాడు. ఇతన్ని భారత పౌరుడు అనగలమా? సునిల్‌చోప్రా (సి.పి.యం), అరుంధతీరాయ్, వారిష్ పఠాన్, జాన్‌దయాల్, మేధాపాట్కర్, షబనాఆజ్మీ, మమతాబెనర్జీ, కవితాకృష్ణన్, కమలహాసన్, నవజోత్‌సింగ్ సిద్దూ వీరంతా బహిరంగంగా పాకిస్తాన్‌ను బలపరుస్తుంటే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? కల్హారాలు, కుంకుమ పూలు పూచే కాశ్మీరం రక్తకాసారంగా మారింది. నెహ్రూగారి ‘ఎర్ర’ గులాబీ చేసిన తప్పుకు మొత్తం భారతదేశం దశాబ్దాలుగా విలపిస్తున్నది. తమిళనాడులో కూర్చొని విలాస జీవితం గడిపే కమలహాసన్ ప్లెబిసైటు గురించి మాట్లాడుతున్నాడు. ఆయన భారత పౌరుడు ఎట్లా అవుతాడు?
సరిహద్దుకు అవతల ఎందరు శత్రువులున్నారో ఇవతల కూడా అందరున్నారు. ఈ అంతర్గత శత్రువులను అదుపుచేయవలసిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలది. ఐదు నిమిషాలు సైన్యాన్ని పక్కనపెట్టండి మా తడాఖా చూపిస్తాం అన్న ఎం.ఐ.ఎం. నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ‘మనం పాక్ మద్దతుతో పనిచేద్దాం’ అన్నాడు. కాశ్మీరు డిప్యూటీ మేయర్ (ఈ సీక్రెట్ టేప్ సంభాషణ ఫిబ్రవరి 17 నాడు వైరల్ అయింది). జైషే మహమ్మద్ ఉగ్రవాదుల దాడికి అనుగుణంగా బారికేడ్లను ముఫ్తీమహబూబా ముందే తొలగించటం ఎందరికి తెలుసు? జైషే దాడి బి.జె.పికి ముందే తెలుసును. మమతాబెనర్జీ కలకత్తాలో వ్యాఖ్యానిస్తే ఆ రాష్ట్రంలో ఎందుకు రాష్టప్రతి పాలన విధించలేదు? దాదాపు నూరేండ్లుగా ఈ ఉగ్రవాద సమస్యతో మానవాళి అల్లకల్లోలమయింది. అమెరికా తన ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ పతనం మరచిపోయిందా? యు.కె.లో, ఫ్రాన్సులో, రష్యాలో, ఇజ్రాయిల్‌లో జరిగిన దారుణాలు ఆయా దేశాలు అప్పుడే మరచిపోయాయా? వారంతా ఇప్పుడు భారత్‌కు బహిరంగంగా మద్దతును తెలుపవలసిన బాధ్యత లేదా? ఆఫ్ఘనిస్థాన్ ఇరాన్ ఇజ్రాయిల్ దేశాలు ప్రస్తుతం ముందుకు వచ్చాయి. చైనా ఉష్టప్రక్షిలా వ్యవహరిస్తున్నది.
‘‘కాశ్మీరును పాకిస్తాన్‌కు ఇస్తే ఈ సమస్య ముగుస్తుందా?’’ ఒక విలేఖరి లోగడ జనరల్ ముషారఫ్ (పాకిస్తాన్)ను అడిగాడు. అందుకు ముషారఫ్ నవ్వుతూ! ఇండియాను చిన్నచిన్న ముక్కలుగాచేసి మా జీహాదీ సామ్రాజ్యాన్ని స్థాపించటం జరగటం మా అంతిమ లక్ష్యం. ఈ కాశ్మీరు సమస్య అందులో అంతర్భాగం మాత్రమే’ అని నిర్మొహమాటంగా చెప్పాడు.
‘కాశ్మీరులోని రోడ్లను సిమెంటుతో కాదు బంగారంతో నిర్మించిన అభివృద్ధి మంత్రం నరేంద్రమోడీ చూపించినా విధ్వంసం ఆగదు’ అన్నాడు జిలానీ (కాశ్మీరు ఉగ్రవాది). భారత సైనికులు యాభై మంది కాశ్మీరులో ప్రాణాలు సమర్పిస్తే కొత్తగా వివాహమైన విభూతి శంకర్, చిత్రేశ్ బిస్తీలు ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోతే భారత్‌లో జాతీయ వ్యతిరేక పార్టీలు పాకిస్తాన్‌ను బలపరచటం తగునా? వీటిపై నిషేధం విధించే ధైర్యం నరేంద్రమోదీకి ఉందా?
దేశ రక్షణలో భారత సైన్యం పుల్వామాలో ముక్కలుగా నరకబడుతుంటే ‘నన్ను దోచుకుందువటే వనె్నల దొరసానీ’ అంటూ సంగీత విభావరులు నిర్వహించే ఈ ప్రబుద్ధులను హైదరాబాద్‌లో, విజయవాడలో, విజయనగరంలో కళాకారులు అని పిలువగలమా?
నరేంద్రమోడీ వల్ల కాశ్మీరు సమస్య ఐదేళ్లుగా పెరిగింది అని కాంగ్రెసు, కమ్యూనిస్టులు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఇరాన్‌లో 27 మంది సైనికులను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు హతమార్చురు. మరి ఇరాన్‌లో బి.జె..పి ఉందా? అక్కడ నరేంద్రమోడీ ఉన్నాడా? ఐనా ఎందుకిలా జరిగింది? పాకిస్తాన్ ఉగ్రవాదంతో తమ మనుగడ సాగిస్తున్నది గంజాయి, హషిష్, దొంగనోట్లు హవాలా వ్యాపారం, ఐసిస్ జైషేమహమ్మద్, లష్కరీతోయిబా వంటి నలభై ఉగ్రవాద సంస్థలను సృష్టించి విధ్వంసాన్ని సృష్టించడం ఇదంతా పాకిస్తాన్ ఐఎస్‌ఐ మిలటరీ ప్రభుత్వ లక్ష్యం. వారి అస్తిత్వం ఉగ్రవాదంమీదనే ఆధారపడి ఉంది. 1400 ఏళ్లనాటి- సెమెట్రిక్ ఎడారి మనస్తత్వం ఆధునిక సాంకేతిక యుగంలో కూడా మారలేదు. ‘కాశ్మీరు సమస్య’ అంటూ ఒక సమస్య లేనేలేదు. ఉన్నది అంతర్జాతీయ ఉగ్రవాద సమస్య మాత్రమే- భారత కమ్యూనిస్టులు లెనిన్‌ను పొగుడుతారు లెనిన్ గొప్ప రష్యా దేశభక్తుడు. మరి భారత్‌లో నరేంద్రమోడీ జాతీయవాదాన్ని ఎందుకు ద్వేషిస్తున్నారు?
భారతదేశానికి బహిరంగంగా ఇజ్రాయిల్, ఆఫ్‌గనిస్థాన్ వంటి కొన్ని దేశాలు సంఘీభావం ప్రకటించాయి. రష్యా, అమెరికాలు సానుభూతిని చూపాయి. చైనా సౌదీ అరేబియా మరికొన్ని ముస్లిం దేశాలు పాకిస్తాన్ వెంట ఉన్నాయి.
కష్టకాలంలో అక్కరకు వచ్చినవాడే మిత్రుడు. మామూలు సమయాల్లో ఇచ్చకాలు మాట్లాడే దేశాల్లో ఏవి ఇండియాకు నిజమైన మిత్రదేశాలో, ఏవి శతృదేశాలో ఇప్పుడు తేలిపోయింది. నిజానికి కాశ్మీరు అసలు సమస్య కాదు. ఇస్లామిక్ ఫండమెంటలిజం మూల సమస్య మానవాళి గత 1400 సంవత్సరాలుగా ఈ సమస్యతో సతమతమైపోయింది. భారత జాతి అల్లకల్లోలమయింది. వందలాది సంవత్సరాలు బానిసతనంతో మగ్గింది. తిరుమల, శ్రీరంగం, హాళిబీడు, మధుర, సోమనాథ్, కాశి, అయోధ్య వంటి పుణ్యస్థలాలను శ్మశానాలుగా మార్చారు. తెలంగాణాలో రజాకార్లు తెలుగు ఆడబిడ్డలను బట్టలు విప్పించి బతుకమ్మలు ఆడించారు. ‘హిందూ, కుర్దు, జూడా, క్రైస్తవ జాతులకు భూమిపై జీవించే అర్హత లేదు’ అని ఐసిస్ ప్రకటించింది. ఇదే అసలైన సమస్య. ఈ సమస్య కార్యాలయాలు కాశ్మీరులో, కేరళలో, హైదరాబాదులో (రిక్రూట్‌మెంట్ సెంటర్లు) ఉన్నాయి. వీరికి బహిరంగంగా చైనా, చైనా ప్రేరేపిత భారత మావోయిస్టులు మద్దతునిస్తున్నారు. ఇదే అసలు సమస్య.
కాశ్మీరు ఇండియాలో ఉండాలా? వద్దా? అనేది సమస్య కాదు. పాకిస్తాన్ ఇండియాలో కలవాలా? లేదా? అనేదే సమస్య. ఎందుకంటే 1947 వరకు పాకిస్తాన్ ఇండియాలో అంతర్భాగమే. మహాఘనత వహించిన మన నాయకులు బ్రిటీషువారి విభజించి పాలించు అనే సిద్ధాంతానికి వత్తాసు పలికారు. ఫలితంగా ఇండియా మూడు ముక్కలయింది.
ఆరు లక్షల మంది కాశ్మీరీ హిందూ పండిట్లను శ్రీనగర్ నుండి తరిమివేసి డెమోగ్రఫీ మార్చారు. జమ్మూలో, లఢక్‌లో సమస్య లేదు. ముస్లిం మెజారిటీ ప్రాంతమైన కాశ్మీరు లోయలోనే ఐసిస్ జెండాలు ఎగురుతున్నాయి. ఇదే అసలు సమస్య. అజంఖాన్ మహబూబా ముఫ్తీ, మణిశంకర్ అయ్యర్, నవజోత్‌సింగ్ సిద్దూ, కన్నయకుమార్, అరుంధతీరాయ్, ప్రశాంత్ భూషణ్, రొమిల్లా థాపర్, ఒవైసీ.. ఈ అంతర్గత శత్రువులే అసలు సమస్య.
పాకిస్తాన్‌లోని జియో టీవీ ఛానల్‌లో మొన్న ఒక ప్రదర్శన జరిగింది. అందులో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఒకామె ఇలా మాట్లాడింది. ‘‘నేను టీచర్‌ను. వారానికి నాలుగు రోజులు విద్యార్థులు క్లాసులో ఉంటారు. ఉన్నట్లుండి ఐదవ రోజు అదృశ్యమవుతారు. వారికి తీవ్రవాద శిక్షణ ఇప్పించడానికి ఎక్కడికో తీసుకుపోతున్నారు. మార్కెట్‌లో గోధుమపిండి (ఆటా) దొరకటం లేదు. మన చమురు నిలువలు వారం రోజులుకన్నా ఎక్కువ కాలం రావు. ఎంతసేపు మతం, తీవ్రవాదం అంటూ పాక్ ప్రజలను రెచ్చగొట్టి ఏం సాధించినట్లు?’ అని ప్రసంగాన్ని బట్టి పాక్ ఆర్థిక దుర్గతిని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడ గర్భ దరిద్రం ఉంది. విద్య, ఉద్యోగాలు లేవు. ఆహార పదార్థాల సరఫరా లేదు. ఎంతసేపు యాంటీ ఇండియా ప్రచారంలో మనీ లాండరింగ్‌లో ఉగ్రవాద స్థావరాలు జీవిస్తున్నాయి. వాటి శాఖలే కాశ్మీరులో సక్రియాత్మకంగా పనిచేస్తున్నాయి. భారత శత్రుత్వం పాక్ ప్రజలతో కాదు పాకిస్తాన్‌లోని మిలటరీ మత రాజకీయాలతో?
రాజస్థాన్‌లోని ఝంఝవాలో ఫిబ్రవరి 18నాడు జరిగిన వీరజవాన్ల శ్రద్ధాంజలి కార్యక్రమానికి మొత్తం రాజస్థాన్ కదిలి వచ్చింది. వీర సైనికులు శియారాం, హరిసింగ్, అబ్దుల్ వంటి వారి శవపేటికల ఊరేగింపులో ప్రజలు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడులో విజయ మహాలింగం శవాన్ని ఊరేగించినప్పుడు ఇలాంటి దృశ్యాలే కన్పడ్డాయి. అంటే మొత్తం భారతదేశం వీరజవాన్ల వెనుక నిలిచింది ఒక్క మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ తప్ప!
ప్రజలంతా వీరజవాన్లకోసం కన్నీరు కారుస్తుంటే కేరళలో మార్క్సిస్టులు కార్యకర్తలను చంపటంలో నిమగ్నమైనారు.
సినీ నటుడు అమితాబ్‌బచ్చన్, టి.ఆర్.ఎస్. నాయకుడు కె.టి.ఆర్, ఇన్ఫోసిస్ అధినేత సుధానారాయణమూర్తి వంటి వారు వీర జవాన్ల కుటుంబాలకు విరాళాలు ప్రకటించారు. ఈ ఔదార్యం దేశద్రోహుల్లో కన్పడలేదు!
ఆర్య సమాజ నాయకుడు స్వామి అగ్నివేశ్ మాట్లాడుతూ పుల్వామా దాడిని పాకిస్తాన్ చేసిందని ఎలా నిర్ధారిస్తారు? అని ప్రశ్నించారు. ఇతడు సన్యాసి- తెలుగువాడు ఇలాంటి వారిని దేశభక్తులు అనగలమా?

-ప్రొ.ముదిగొండ శివప్రసాద్ 9603612246