మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కాలపు జనులు ప్రతి విషయమందలి సారమును తెలియగోరుదురు. మత ధర్మములందును వారికి సారమేకావలయును గాని అముఖ్యమగునని (కర్మకలాపములు, వాదములు, మతములు) వారికక్కఱలేదు.
321. చేపలను దినువారు నిరుపయోగములగు తలను తోకను విడిచిపెట్టి నడుమనున్న మెత్తని భాగమును మాత్రమే తినగోరుదురు. అటులనే మన ధర్మశాస్తమ్రులందలి విధులలో కాలక్రమమున ప్రస్తుత కాలమునకు అక్కఱకువచ్చునట్లు ఒనరింపవలయును.
విగ్రహారాధన
322. మేడ కట్టుచుండు కాలమున పరంజా చాల ఆవశ్యకము, కాని కట్టడపుబని ముగిసిన వెనుక పరంజాతో ఎవ్వరికిని పనియుండదు. అటులనే విగ్రహారాధన ప్రారంభమున ఆవశ్యకమేకాని సాక్షాత్కారమైన వెనుక అనావశ్యకము.
323. చక్కని చిన్న అక్షరములను వ్రాయనేర్చుటకు పూర్వము వంకర టింకరగా పెద్దపెద్ద అక్షరములను వ్రాయుచు దస్తూరీ అలవరుచుకొనువాని చందమున మొట్టమొదట విగ్రహముమీద మనసు నిలిపి చితె్తైకాగ్రతను సంపాదించిన పిమ్మట నిరాకార బ్రహ్మముపైని సులభముగా మనసు నిలుపగలుగుదుము.
324. విలుకాడుగాని, సైనికుడు గాని మొట్టమొదట పెద్దవస్తువులను గుఱిచూసి కొట్టనేర్చును, అందు నేర్పఱితనము సంపాదించినకొలదియు చిన్నచిన్న వస్తువులను సులభముగా గొట్టగలుగును. అటులనే సాకారములగు విగ్రహములపైని మనసు లగ్నముచేయుట నేర్చినపిమ్మట నిరాకార బ్రహ్మముపై సులభముగా మనసు నిలుపగల్గుదుము.
325. లక్కపండును లక్కయేనుగును, నిజమైన పండును నిజమగు నేనుగును తలపునకు దెచ్చువిధమున విగ్రహములు వానినర్చించువానికి నిరాకారమై, నిత్యమై, వెలుంగు బ్రహ్మమును తలంపునకుదెచ్చును.
326. శ్రీ గురుదేవుడొకప్పుడు డొక శిష్యునకిట్లు తెల్పెను: ‘‘మట్టి విగ్రహములను గూర్చియూ, నీవు మాటలాడుచున్నావు? సాధకునకొక దశలో అవియు కావలసియున్నవి. ఆత్మవికాసమున ఆయా దశలలోనున్న వారికి అనుకూలించుటకై ఈ అర్చా రూపములన్నియు ఏర్పఱుపబడియున్నవి.’’
327. తల్లి తన బిడ్డలతో ఎవరికి తగిన ఆహారము వారికి లభించునట్లు వండి పెట్టును. ఆమెకు నలుగురైదుగురు బిడ్డలున్నారనుకొనుడు. ఒక పెద్ద చేప దొరికినయెడల దానిని వేర్వేఱు రీతులుగా పచనముచేసి ఎవరికేది సరిపడునో వారికది పెట్టును. ఒకనికి పులావుచేసి పెట్టును. జీర్ణశక్తి మందగించిన వానికి దానితో చారుగాచి పెట్టును; ఇటులనే మిగిలిన వారందఱకును వారివారి జీర్ణశక్తికి సరిపడునట్లు వండిపెట్టును. (సాధకులకు నియమింపబడిన ప్రతీకములయొక్కయు సాధనలయొక్కయు విషయముకూడ నిట్టిదే.)
328. ఒక శిష్యుడు: బ్రహ్మను సాకారమని నమ్మవచ్చును. కాని అయ్యది మనము పూజించు మృణ్మయవిగ్రహము (మట్టిబొమ్మ) మాత్రము కాజాలదుకదా?
శ్రీ గురుదేవుడు: మృణ్మయము అందువేల? దేవతావిగ్రహము చిన్మయముకాదా!

ఇంకావుంది...

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి