మెయిన్ ఫీచర్

భారతీయ యువతి కథకు ‘ఆస్కార్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది దిల్లీకి 115 కిలోమీటర్ల దూరంలో ఉండే హపూర్ జిల్లా కతికెరా గ్రామం..
ధగధగమంటూ వెలిగిపోయే ఎలాంటి షాపింగ్‌మాల్సూ లేని గ్రామం..
దేశంలోని ఇతర ప్రాంతాల్లాగే ఇక్కడ కూడా మహిళల నెలసరి గురించి మాట్లాడటం తప్పుగా భావిస్తారు..
అలాంటి గ్రామంలో శానిటరీ ప్యాడ్లు తయారుచేసే ఒక యువతిపై చిత్రీకరించిన డాక్యుమెంటరీ ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మకమైన 91వ ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.. వివరాల్లోకి వెళితే..
అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక 91 ఆస్కార్ అవార్డుల వేడుకలో మన భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి అవార్డు దక్కింది. సినిమాల విషయంలో కాకుండా డాక్యుమెంటరీ, షార్ట్ఫిల్మ్ కేటగిరీలో ‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ కు ఆస్కార్ అవార్డు దక్కింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న రుతుక్రమ సమస్యల గురించి ఈ డాక్యుమెంటరీలో చూపించారు. 25 నిముషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాలోని కతికెరా గ్రామంలో తెరకెక్కించారు. ఈ ప్రాంతానికి చెందిన మహిళలు బయోడిగ్రేడబుల్ న్యాప్‌కిన్లు ఎలా తయారుచేయాలో నేర్చుకుంటారు. వాటిని ఇతర మహిళలకు తక్కువ ధరకు అమ్ముతూ ఎలా సాయపడ్డారనేది ఈ డాక్యుమెంటరీ కథ. దీనికి రేకా జెహతాబ్చి దర్శకత్వం వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని కతికెరా గ్రామనివాసి అయిన స్నేహ్ ఈ డాక్యుమెంటరీలో కథానాయకి. ఈ అవార్డును మెలిస్సా బెర్టన్, రేకా జెహతాబ్జీలు అందుకున్నారు.
ఇది నిజంగా జరిగిన కథ. దీనే్న వీరు డాక్యుమెంటరీగా తీశారు. అన్ని గ్రామాల్లోగానే ఆ గ్రామంలో కూడా నెలసరికి సంబంధించిన సామాజిక కట్టుబాట్లు చాలా ఉన్నాయి. ఈ డాక్యుమెంటరీలో నటించిన స్నేహ్ స్వయంగా చాలా నెలసరికి సంబంధించి చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారట. అసలు స్నేహ్ పుష్పవతి అయినప్పుడు ఆ విషయం తల్లికి చెప్పడానికి కూడా భయపడిందట. కారణం అక్కడ నెలసరి గురించి మాట్లాడుకోవడం తప్పు.. అని భావించిందట. రక్తస్రావాన్ని చూసి.. భయపడి, ఏడ్చుకుంటూ తనకేదో జబ్బు చేసిందని విషయాన్ని నెమ్మదిగా ఆమె అంటీతో చెప్పిందట స్నేహ్. విషయం తెలుసుకున్న ఆంటీ.. ‘్భయపడకు. ఇదంతా మామూలే.. ఇప్పుడు నువ్వు పెద్దమనిషివి అయ్యావు.. ఏమీకాదులే..’ అని ధైర్యం చెప్పి విషయాన్ని స్నేహ్ వాళ్లమ్మకు చెప్పిందట. ఇప్పుడు స్నేహ్ వయసు 22 సంవత్సరాలు. ఆమె ఆ గ్రామంలో శానిటరీ ప్యాడ్స్ తయారుచేసే ఫ్యాక్టరీలో ఆమె పనిచేస్తోంది. అంతేకాదు.. 3‘పీరియడ్.. ఎండ్ ఆఫ్ సెంటన్స్’ అనే డాక్యుమెంటరీలో కథానాయిక కూడా స్నేహే.. నెలసరి సమయాల్లో మహిళలు అపవిత్రులని భావించి వారిని గుళ్లుగోపురాలకు, సామాజిక కార్యక్రమాలకు దూరంగా ఉంచుతారు. ఇలాంటి అపోహల మధ్య పెరిగిన స్నేహ్.. తను పుష్పవతి అయ్యేవరకూ మహిళల నెలసరి గురించి వినకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ పునరుత్పత్తికి చెందిన ఆరోగ్య సమస్యల గురించి పనిచేస్తున్న 3యాక్షన్ ఇండియా2 అనే స్వచ్ఛంద సంస్థ.. ఆ గ్రామంలో శానిటరీ ప్యాడ్ల తయారీ కేంద్రాన్ని స్థాపించాక పరిస్థితులు మారాయి. ఆ యాక్షన్ ఇండియాలో పనిచేసే సుమన్ అనే ఆమె స్నేహను కూడా ఆ ఫ్యాక్టరీలో పనిచేయమని కోరింది. స్నేహ్ సంతోషంగా ఒప్పుకుంది. డిగ్రీ పూర్తిచేసి, దిల్లీలో పోలీసుగా పనిచేయాలని కలలుగనే స్నేహ్ ఫాక్టరీలో పనిచేయడానికి తల్లిని అనుమతి కోరింది. స్నేహ్ తల్లి, తండ్రిని అడగమంది. శానిటరీ ప్యాడ్స్ తయారీకి అని తండ్రికి చెప్పడానికి మొహమాటపడిన స్నేహ్.. చిన్నపిల్లల డైపర్లు తయారుచేసే ఫాక్టరీకి అని తండ్రికి అబద్ధం చెప్పింది. ఆమె తండ్రి ఏదైనా పనేగా! వెళ్లు అంటూ అనుమతినిచ్చాడు. పనిలో చేరిన రెండు నెలల తర్వాత వారికి విషయం తెలిసినా వారు ఎటువంటి ఆంక్షలు కూతురిపై విధించలేదు. ఇంటిపనుల్లో తల్లికి సాయం చేస్తూ, చదువుకుంటూ, ఫ్యాక్టరీలో పనిచేసేది స్నేహ్. పరీక్షలప్పుడు మాత్రం చాలా ఒత్తిడికి గురయ్యేదట. అప్పుడు స్నేహ్ బదులుగా స్నేహ్ తల్లి పనికి వెళ్లేదట.
మొదట్లో ఆ ఫ్యాక్టరీలో ఏదో జరుగుతోందని అనుమానించే కొందరు గ్రామస్తుల నుంచి ఈ సంస్థ వారు ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీలో పనిచేసే ఆడవారు పనిలోకి రావాలంటే ఇంట్లో కూడా ఎన్నో గొడవలు. ఇంటి పని, పిల్లలు, భర్త, పశువుల పనులు చేసి ఇక్కడకు వచ్చే మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ కొద్దిగా ఆలస్యమయినా ఇంటికి వెళుతూనే తిట్లు, తన్నులు తింటూ కూడా పనిని కొనసాగిస్తున్నారు కొందరు మహిళలు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో 18 నుంచి 31 సంవత్సరాల మధ్య వయసున్న ఆడవాళ్లు ఎనిమిదిమంది పనిచేస్తున్నారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పని.. వారానికి ఆరు రోజులు పనిదినాలు. వీరు నెలకు 2,500 సంపాదిస్తున్నారు. ఈ ఫాక్టరీలో రోజు 600 శానిటరీ ప్యాడ్లు తయారవుతాయి. వీటిని ‘ఫ్లై’ అనే పేరుతో మార్కెట్లో అమ్ముతారు. ఆ గ్రామంలో కరెంటు కోతలు ఎక్కువ. ఈ సమస్య అధికంగా ఉన్నప్పుడు లక్ష్యాలను చేరుకోవడానికి కొన్నిసార్లు వారు రాత్రిళ్లు కూడా వచ్చి పనిచేయాల్సి వస్తుందట.
కేవలం రెండు గదుల్లో నిర్వహిస్తున్న ఈ ఫాక్టరీ వల్ల ఇప్పుడు ఆ గ్రామ మహిళలకు నెలసరి వంటి అంశాల పట్ల అవగాహన పెరిగింది. ఒకప్పుడు నెలసరి సమయంలో పాతగుడ్డలు, పాత చీరల గుడ్డముక్కలు వాడేవారు. కానీ ఇప్పుడు ఆ గ్రామంలో డెబ్భై శాతం మహిళలు శానిటరీ ప్యాడ్లు వాడుతున్నారు. అంతేకాదు కొనే్నళ్ల క్రితం వరకూ మహిళల నెలసరి గురించి ఉన్న గ్రామస్తుల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. నెలసరి గురించి గ్రామ మహిళలు ఇప్పుడు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నార్త్ హాలీవుడ్‌లోని కొందరు విద్యార్థులు చందాలు పోగుచేసి, ఒక శానిటరీ ప్యాడ్ తయారుచేసే యంత్రాన్ని, ఒక ఇరానియన్-అమెరికన్ దర్శకుడిని స్నేహ్ గ్రామానికి పంపారు. దిల్లీ నుంచి ఆ గ్రామానికి చేరాలంటే రెండున్నర గంటలు ప్రయాణం చేయాలి. కానీ హైవే మరమ్మతు పనుల వల్ల వారికి ప్రయాణం చేయడానికి నాలుగు గంటలు పట్టింది. కతికెరా గ్రామ పంటపొలాల్లో, గ్రామ పాఠశాలలోని తరగతి గదుల్లో ఈ డాక్యుమెంటరీని తీశారు. ఇప్పుడు స్నేహ్.. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇతర మహిళలు ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌కు నామినేట్ అవ్వడం వారిలో మరింత ఉత్సాహాన్ని నింపింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ డాక్యుమెంటరీ.. ‘బెస్ట్ షార్ట్ ఫిల్మ్ డాక్యుమెంటరీ’ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యింది. ఆస్కార్ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లిన స్నేహ్‌ను చూసి ఇరుగుపొరుగువారు గర్వపడుతున్నారు.
‘ఇంతవరకూ మా ఊరి నుంచి ఎవ్వరూ విదేశాలకు వెళ్లలేదు. నేనే మొదటి వ్యక్తిని. ఊర్లో అందరూ నన్ను గౌరవిస్తున్నారు. నన్ను చూసే చాలా గర్వంగా ఉందని చెబుతున్నారు. ఆస్కార్ అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన సినిమా అవార్డ్స్‌ని నాకు తెలుసు. కానీ నేనెప్పుడూ ఆస్కార్ వేడుకలను చూడను కూడా చూడలేదు. అలాంటిది ఆస్కార్ వేడుకల్లో భాగంగా రెడ్ కార్పెట్‌పై నడుస్తానని కల కూడా కనలేదు. అమెరికా వెళతానని నేనెప్పుడూ అనుకోలేదు. అసలు ఏం జరుగుతోందో నాకింకా పూర్తిగా అర్థం కావడంలేదు. ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌కు నామినేట్ అవడమే నాకు పెద్ద అవార్డు. కళ్లు తెరచుకునే కల కంటున్నట్లు ఉంది నాకు’ అని స్నేహ్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. స్నేహ్ తండ్రి మాట్లాడుతూ ‘నా కూతుర్ని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. తను చేస్తున్నది సమాజానికి, ముఖ్యంగా మహిళలకు మేలు చేస్తుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పాడు.