మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కాలమున విగ్రహారాధనను తీవ్రముగా ఖండించుచుండెడి కేశవ చంద్ర సేనునితో శ్రీ గురుదేవుడొకప్పుడిట్లు పలికెను: ‘‘ఈ విగ్రహములు నీ మనస్సులో ఎందుచేఱాయి, గడ్డి, కఱ్ఱ అనుభావములను గల్గంపవలెను? నిత్యానంద ప్రజ్ఞానమయియగు అల జగన్మాతయే ఈ రూపములన్నిటను వెల్గొందుచున్నదని నీవేల గ్రహింపరాదు?’’
330. తా నర్చించు దేవతావిగ్రహములు నిజముగా దివ్యరూపములను దృఢ విశ్వాసముగలవాడు తన్మూలమున దేవుని సాక్షాత్కారము నొందును. కాని వానిని మట్టి, ఱాయి, గడ్డి అని మాత్రమే తలచెనా, అట్టి విగ్రహారాధన వలన వానికేమియు శ్రేయముకలుగబోదు.
331. విగ్రహారాధనలో ఏమేని దోషమున్నయెడల సమస్తమైన ఆరాధనలను తనకై ఉద్దేశింపబడియున్నవని భగవంతునికి దెలియదా? ఏ యారాధనయందైనను తానే ఉద్దిష్టుడనని తెలిసికొని ఆనందముతో భగవానుడు ఆయారాధనను స్వీకరించునే! భగవంతుని ప్రేమింపుము. ఇదియే నీకు అత్యంతము విహితమై, సన్నిహితమైన కర్మము.
332. భగవత్సాక్షాత్కారముపొందినవాడు ప్రతి వస్తువును- విగ్రహమును-సమస్తము- భగవత్స్వరూపములుగనే కాంచును. అట్టి వాని దృష్టిలో విగ్రహము మృణ్మయముకాదు, చిన్మయము.

తీర్థయాత్రలవలన ప్రయోజనము

333. ఆవుపాలు నిజముగా రక్తమూలమున ఆవుశరీరమునందంతటను వ్యాపించియున్నను చెవులను కొమ్ములను పిండుటచే పాలు రావు కదా? పొదుగునుండి మాత్రమే పాలు లభించును. అటులనే భగవంతుడు సర్వాంతర్యామియైయున్నను ఎల్లెడలను నీవు వానిని గనజాలవు. పూర్వపు భక్తవరులు తమ పవిత్ర జీవితముచేతను పారమార్థిక సాధనల చేతను భక్తిమయమొనర్చిన పావన దేవాలయములందు భగవానుడు సులభముగా ప్రత్యక్షము కాగలడు.
334. బ్రహ్మసాక్షాత్కారమునుగోరి అసంఖ్యాకులైన జనులు చిరకాలము జపతపములను, ధ్యానమును, ప్రార్థనలను, పూజలను సలిపిన పుణ్యస్థలములందు భగవానుడు నిశ్చయముగా వెలసియుండునని గ్రహింపుడు. వారి శ్రద్ధ్భాక్తులచే పారమార్థికభావము లచ్చట ఘనీభూతమైయుండునని చెప్పవచ్చును. ఇట్టి పుణ్యతీర్థములందు మానవుడు సులభముగా ఆత్మప్రబోధమునొంది భగవంతుని గనజాలును. అనాదిగా అసంఖ్యాకులగు సాధువులు, భక్తులు, జ్ఞానులును ఇట్టి పుణ్య క్షేత్రములను దర్శించి సకలవాంఛలను విడనాడి, భక్తిపూరిత హృదయముతో ఈశ్వర సాక్షాత్కారముకొఱకై నిష్ఠలుసలిపి యుందురు. కావున భగవంతుడు సర్వత్ర నిండియున్నను ఈ క్షేత్రములందు ముఖ్యముగా వెలసియుండునని గ్రహింపుడు. ఎక్కడ త్రవ్వినను నీరు దొరకును, కాని బావియో, కోనేఱో, సరస్సో ఉన్న తావున త్రవ్వవలసిన పనిలేకయే, కావలయునన్నప్పుడెల్ల సిద్ధముగా జలము లభించునుగదా!

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

ఇంకావుంది...