మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవులు కడుపార మేసి నెమ్మదిగా ఒకచోట పరుండి నెమరు వేయును. అటులనే నీవొక పుణ్యక్షేత్రమును దర్శించిన పిమ్మట. అచట నీ మనస్సున నుదయించిన పవిత్ర భావములను గైకొని, యేకాంత స్థలమున గూర్చుండి వానిలో నీవునిమగ్నుడ వగువఱకును మననము చేయవలయును. ఆ క్షేత్రములనుండి మఱలగనే విషయ భోగములకు దాసుడవై ఆ యుత్తమ భావములనన్నిటిని బోగొట్టుకొనరాదు.
336. ప్రపంచమున నలుదిశలందును యాత్రలు చేయుదువుగాక, నీకెచ్చటను పరమార్థముచేచిక్కదు. ఉన్నదంతయు ఇచ్చటనే(అనగా హృదయముననే)కలదు.
337. శిష్యులనేకులు తీర్థయాత్రలు చేయుటకై శ్రీగురుదేవునికి తమ యిచ్ఛను నివేదించువారు, అందులకు గురుదేవుడిట్లువచించువాడు: ‘‘మంచిది. ఇచట (అనగా గురు సన్నిధిని, లేక స్వయముగా తనయందే) పరమార్థమును గన్నవానికి అచటను (అనగా పుణ్యతీర్థములందును) గలదు. ఇచటగాంచనివానికో, అచటనులేదు’’, లేదా, ‘‘హృదయముననే భగవద్భావనగలవానికి అయ్యది పుణ్యక్షేత్రములందు మఱింత వృద్ధియగును, దృఢమగును. కాని హృదయమున భక్తిలేనివానికి తీర్థయాత్రలవలననేమి ప్రయోజనము? ఫలానివారి కుమారుడు ఇల్లు విడిచి పాఱిపోయి కాశికో, మఱి యెచ్చటికో వెడలినాడని విందుము. కాని తరువాత చాల శ్రమపడి అక్కడ ఏదియో ఉద్యోగము సంపాదించి కొంత ధనమును బంపుచు తన యోగక్షేమములను కుటుంబమునకు తెలియబరిచెననియు వినుచుందుము. జనులు పుణ్యక్షేత్రములలో నివసించుటకై వెడలుచుందురు, కాని వారిలో ననేకులు అక్కడ ఏ దుకాణమో పెట్టుకొని వర్తకము చేయునారంభింతురు. మథున నాథునితో నేను పశ్చిమ ప్రాంతములకు వెడలినపుడు అచ్చటి పరిసరములు సరిగా ఇచ్చటివానివలెనే ఉండెవని పొడకట్టెను. ఆ మామిడి చెట్లు, ఆ చింతచెట్లు, ఆ వెదురుడొంకలు- అన్నియు సరిగా ఈ ప్రాంతమునందలి వానివలెనే ఉండెను. నాకేమియు భేదము కనబడలేదు. అందుచే హృదయునితో నిట్లంటిని; ‘‘మంచిది, నీవిచ్చటికి ఏమి చూచి యానందింపవచ్చినావు? సరిగా అక్కడనున్న వస్తువులే ఇక్కడను ఉన్నవి; కాకున్న, ఈ ప్రాంతమందలి జనులకు జీర్ణశక్తి కొంచెముహెచ్చు. ఇది యొక్కటకియే తేడా.’’ (చూ.739)
సత్సాంగత్యమువలని లాభములు
338. నీటికిని పాలకును చేరిక కల్గించినయెడల రెండును కలిసిపోవును. పాలను ఇక వేఱుచేయజాలము. అటులనే ఆత్మశ్రేయమునకై పాటుపడు సాధకుడు అడ్డమైన వారితోడను స్నేహముచేయుచున్న యెడల తన లక్ష్యమును గోల్పోవుటయేగాక, పూర్వపు శ్రద్ధ్భాక్తులను ఉత్సాహమును గూడ పోగొట్టుకొనును. తనకు తెలియకుండగనే అవి చల్లగా సమసిపోవును.
339. సత్సాంగత్యము ఆత్మవికాసమునకు ముఖ్యాంగము.
340. ఎండు కట్టెలను చిదుగులను ప్రోగుచేసి కష్టపడి యెవ్వడైనను మంట చేసిన యెడల దాని సెగను అనేకులు చలి దీర్చుకొందురు.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

ఇంకావుంది...