మెయిన్ ఫీచర్

అల్పాహారంతో పిల్లల్లో మేధోవికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే శారీరక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, క్రమం తప్పకుండా నిత్యం ఉదయం వేళ అల్పాహారం తీసుకునే చిన్నారుల్లో మేధో వికాసం ఆశాజనకంగా ఉంటుందని పరిశోధకులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. తొమ్మిది నుంచి పదకొండేళ్ల వయ సు కలిగిన సుమారు అయిదువేల మంది విద్యార్థుల ఆహారపు అలవాట్లపై సర్వే చేసిన అనంతరం పరిశోధకులు ఈ మాట చెబుతున్నారు. పోషకాలున్న అల్పాహారాన్ని తీసుకుంటున్న పిల్ల లు ఆరోగ్యవంతంగానే కాదు, చదువులోనూ ముందంజలో ఉంటూ మంచి మార్కులు సాధిస్తున్నట్లు కార్డ్ఫి విశ్వవిద్యాలయానికి (యుకె) చెందిన పరిశోధకులు విశే్లషిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారానికి, పిల్లల్లో మేధో వికాసానికి కచ్చితమైన సం బంధం ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడైనట్లు అధ్యయనానికి నేతృత్వం వహించిన హన్నా లిటిల్‌కాట్ చెబుతున్నారు. మంచి అల్పాహారం తీసుకుంటున్న పిల్లలు మిగతా వారికంటే చదువులో రెండు రెట్లు ప్రతిభ చూపుతున్నట్లు ఆయన తెలిపారు. అల్పాహారం తీసుకునే చిన్నారులు అనారోగ్యాలకు దూరంగా ఉంటున్నందున వారు పాఠాలపై ఎక్కువ సేపు దృష్టి సారిస్తున్నారు. చురుకుదనం, ఏకాగ్రత, మేధో నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం వంటివి వీరిలో అధికంగా ఉంటున్నాయి. ఈ కారణంగానే యుకెలో ఇపుడు అనేక విద్యాసంస్థలు చిన్నారులకు ఉచితంగా అల్పాహారాన్ని అందజేస్తున్నాయని లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ క్రిష్ బొనెల్ గుర్తు చేస్తున్నారు. విద్యాసంస్థల్లో అల్పాహారాన్ని ఇవ్వడం వల్ల విద్యార్థులకు మేలు జరుగుతోందని ఆయన వివరిస్తున్నారు. ఎదిగే వయసులో పిల్లలకు తగిన పోషకాలు అందకపోతే శారీరకంగా, మేధోపరంగా మేలు జరగదని అంటున్నారు. అల్పాహారం తీసుకునే పిల్లలు బడుల్లో ఎంతో ఉత్సాహంగా ఉంటూ పాఠాలపై దృష్టి సారించగలుగుతున్నారు. పిల్లలు శారీరకంగా శక్తిని పుంజుకున్నపుడు- తరగతులకు గైర్హాజరు కావడం, చదువులో వెనుకబడి పోవడం వంటి సమస్యలు ఉండవని పరిశోధకులు బలంగా వాదిస్తున్నారు. అల్పాహారం తినే పిల్లల్లో మంచి ఆహారపు అలవాట్లు కూడా అలవడతాయి. కూరగాయలు, పం డ్లు, స్వీట్లు, చిప్స్ వంటివి ఏ సమయంలో, ఏ మోతాదులో తీసుకోవాలో అనే విషయంపై వీరికి తగిన అవగాహన ఉంటుంది. మధ్యాహ్నం, రాత్రి వేళ తీసుకోవాల్సిన ఆహారంపైనా ఆసక్తి పెరుగుతుంది. అల్పాహారం అలవాటైతే పిల్లల ఆహార పద్ధతుల్లోనూ ఆరోగ్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి.
భారత్‌లో అవగాహన తక్కువే..
అల్పాహారం వల్ల కలిగే ప్రయోజనాలపై మన దేశానికి చెందిన పిల్లల్లో అవగాహన తక్కువేనని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ముంబయిలోని నిర్మలా నికేతన్‌కు చెందిన హోమ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో 3,600 మంది పిల్లలను వారి ఆహారపు అలవాట్లపై ప్రశ్నించగా పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూశాయి. అల్పాహారం అతి ముఖ్యమైనదని తమకు తెలియదని సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది పిల్లలు అంగీకరించారు. పనె్నండేళ్ల లోపు వయసు పిల్లల్లో దాదాపు 24 శాతం మంది తమకు అల్పాహారం తీసుకునే అలవాటు లేదని స్పష్టం చేశారు. టీనేజీ పిల్లల్లో 32 శాతం మంది అల్పాహారానికి దూరంగా ఉంటున్నట్లు, వీరిలో బాలికలే ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో కనుగొన్నారు. చాలా ఇళ్లలో పిల్లలకు పెడుతున్న అల్పాహారంలో 72 శాతం వరకూ అంతగా పోషకాలు ఉండడం లేదని తేలింది. మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో కూడా పిల్లలకు తగినంతగా పోషకాలు అందడం లేదు. పిల్లలకు అల్పాహారంలో కాల్షియం తప్ప మిగతా పోషకాలు అంతగా అందడం లేదు. పోషకాహార నిపుణులు నిర్దేశించిన దానికి భిన్నంగా దాదాపు 30 శాతం కాల్షియం మాత్రమే చిన్నారులకు అందుతోంది. ఉదయం వేళ పాలు తాగడం అలవాటు కారణంగా కాల్షియం ఓ మోస్తరుగా పిల్లలకు లభిస్తోంది. అన్ని వయసుల పిల్లలూ ఐరన్, పీచు పదార్థాలు, విటమిన్-బి, ప్రోటీన్లు, ఖనిజాలు వంటి పోషకాలకు అంతగా నోచుకోవడం లేదు. చాలామంది చిన్నారులకు 25 శాతానికి మించి ప్రోటీన్లు అందడం లేదు. మన దేశంలో ముంబయి, దిల్లీ, కోల్‌కత వంటి నగరాల్లో పిల్లలు అల్పాహారానికి చాలావరకూ దూరం అవుతున్నట్లు, చెన్నైలో మాత్రం పరిస్థితి కొంత మెరుగ్గా ఉందని సర్వేలో తేలింది. పోషక విలువల సంగతి పక్కన పెడితే, ఆకలి తగ్గడానికి ఏదో ఒకటి అల్పాహారంగా తినాలన్న ధోరణి మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది.

-రమ