మెయిన్ ఫీచర్

చురుకుదనం అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళలు క్షణం తీరిక లేకుండా చాలా పనులు చేస్తుంటారు. ఇంట్లో, బయట.. ఎన్నో పనులు.. వంటపని, బూజు దులిపే పని, ఇల్లు ఊడ్వటం, బట్టలు ఉతకడం, గిన్నెలు, పిల్లలను బడికి పంపడం.. వీటితో పాటు ఉద్యోగానికి కూడా వెళుతూ.. మేము చాలా చురుకుగా ఉన్నాం అనుకుంటే మాత్రం పొరపాటే.. చాలాసార్లు మహిళలు.. తాము శారీరక వ్యాయామం చేయకపోవడానికి ఇంటి పనులనో, ఉద్యోగాన్నో సాకుగా చూపిస్తుంటారు. పైగా మేము చురుకుగా ఉండేందుకు అవసరమైనంత పనిచేస్తున్నామని అనుకుంటారు. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని, ఎన్నో జబ్బులను ఆహ్వానించడమే అంటున్నారు డాక్టర్లు. పల్లెల్లోని మహిళలతో పోలిస్తే పట్టణాల్లోని మహిళలు తక్కువ చురుకుగా ఉంటారు. నగరాల్లో బరువైన పనులు చేయడానికి పనివాళ్లను నియమించుకుంటారు. అందువల్ల మహిళలు చేసే పనుల్లో అంతగా శరీర కదలికలు ఉండవు. మొత్తం శరీరావయవాలు కదిలితే కానీ హృదయ స్పందన పెరగదు అని చెబుతున్నారు డాక్టర్లు. ఇటీవల లానె్సట్ గ్లోబల్ హెల్త్ జర్నల్ ప్రచురించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. ఈ నివేదిక ప్రకారం..
ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు ఉండాల్సినంత చురుకుగా లేరు. ఈ నివేదిక ప్రకారం పురుషులకన్నా మహిళలు తక్కువ చురుకుగా ఉంటున్నారు. అంతేకాకుండా మధ్య, తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోని ప్రజలు, ధనిక దేశాల ప్రజల కన్నా చురుకుగా ఉంటున్నారు. తక్కువ చురుకుగా ఉండేవారికి గుండెజబ్బులు, మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. కొన్ని రకాల కేన్సర్‌లు కూడా రావచ్చు. ఈ పరిశోధనలో తక్కువ చురుకుదనం అనేది ఆలోచనా స్థాయిపై కూడా ప్రభావం చూపుతుందని వెల్లడైంది. భారతదేశంలో 43 శాతం మహిళలు చురుకుగా లేరు. అదే పురుషుల విషయానికి వస్తే అది 23.5 శాతమే.. మహిళలు పురుషుల కన్నా ఎక్కువ పనిచేస్తారు కాబట్టి ఇద్దరిలో మహిళలే ఎక్కువగా చురుకుగా ఉంటారనుకుంటాం. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం మహిళలే తక్కువ చురుకుగా ఉన్నారు. దీనికి అనేక కారణాలు.. ఈ నివేదిక ప్రకారం అతి తక్కువ చురుకుగా ఉండే దేశం కువైట్ కాగా, అత్యంత చురుకుగా ఉండే దేశం ఉగాండా..
చురుకుగా అంటే..
చురుకుగా అంటే శరీరంలోని ప్రతి భాగం కదలడం.. వేగంగా నడవడం, వాటర్ ఏరోబిక్స్, సైకిల్ తొక్కడం, టెన్నిస్ ఆడటంలాంటివి శారీరక కార్యకలాపాల కిందికి వస్తాయి. పెద్దవాళ్లైతే కనీసం వారానికి 150 నిముషాల పాటు తప్పకుండా శారీరక వ్యాయామం చేయాలి. అప్పుడే వారు చురుకుగా ఉన్నట్లు లెక్క. ఈ వ్యాయామాల వల్ల హృదయ స్పందన, ఉచ్ఛ్వాసనిశ్వాసాల వేగం పెరగడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం జరుగుతుంది. చురుకుగా ఉన్నామని చెప్పడానికి ఇదే ప్రాతిపదిక. షాపింగ్, వంట చేయడం, ఇంట్లో చిన్న చిన్న పనులను శారీర కార్యకలాపాలుగా పేర్కొనలేం. అయితే వీటివల్ల బొత్తిగా లాభం లేదని కాదు. వీటివల్ల కూడా కొద్దిగా శారీరక కదలికలు ఉంటాయి. కానీ పూర్తిగా కాదు. శరీరం చురుకుగా ఉండాలంటే పూర్తిస్థాయిలో శారీరక కదలికలు అవసరం.
వ్యాయామం
శారీరకంగా చురుకుగా లేకపోవడం అనేది జీవన విధానానికి సంబంధించిన పెద్ద సమస్య. సరైన వ్యాయామం చేస్తూ, జాగ్రత్తలు తీసుకోకపోతే అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. బాల్యం నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఆటలే శారీరక వ్యాయామం. 19 సంవత్సరాల నుంచి 64 సంవత్సరాలు వచ్చేంత వరకు వారానికి కనీసం 150 నిముషాల పాటు ఏరోబిక్స్‌కానీ, ఇతర వ్యాయామాలు కానీ చేయాలి. తరచూ వ్యాయామాలు చేయడం వల్ల గుండెపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 35 శాతం తగ్గుతాయి. టైప్ 2 మధుమేహం వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి. కొలోన్ లేదా రెక్టల్ కేన్సర్ వచ్చే అవకాశాలు 50 శాతం తగ్గుతాయి. ఆడవారికైతే రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది. తరచూ వ్యాయామం చేయడం వల్ల డిప్రెషన్ వంటివి కూడా తగ్గుతాయి.
కాబట్టి ఇక నుంచైనా భారతీయ సమాజంలోని మహిళలు తమకంటూ సమయం సంపాదించుకుని, జీవనశైలిలో మార్పు తీసుకువచ్చి కాస్త వ్యక్తిగత సమయం కేటాయించుకుంటే అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారు.