మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అట్లే తీవ్ర జపతపముల నొనర్చి ఈశ్వర సాక్షాత్కారముబడసిన మహనీయుల సాంగత్యము చేయుటచేతను వారి సదుపదేశముల ననుసరించుట చేతను అనేకులు తమ మనస్సును భగవంతునిపై లగ్నముచేసికొందురు.
341. వకీలు కాన్పింపగనే వ్యాజ్యెములును కోర్టులును తలపునకు వచ్చను. అటులనే సద్భక్తులు గాన్పించునపుడు భగవంతుడును ఆముష్మికమును తలపునకువచ్చును. (చూ.599)
342. జీవితమును ఎటుల గడపవలయును? కుంపటిలోని నిప్పు ఆఱిపోకుండ అపుడపుడు కదల్చి ప్రజ్వలింపజేయునటుల సాధుసాంగత్యముచే మనస్సును అపుడపుడు ఉజ్జీవింపజేయు చుండవలయును.
343. కమ్మరి తన కొలిమిలోని నిప్పును తిత్తులతో ఊది ప్రజ్వలింపజేయుచుండును. ఆ రీతిగనే సాధుసంగమువలన మనస్సును నిర్మలముగను ప్రకాశవంతముగను ఉంచవలయును.
344. సాధుసంగము బియ్యపు గడుగువంటిది. కల్లుత్రాగుటచే గలుగు మైకమును బోగొట్టుశక్తి బియ్యపు గడుగునకు గలదు. అలాగుననే విషయ లోలురగు పామరులకు ఆ లోలతను మత్తతను దొలగించుశక్తి సాధుసాంగత్యమునకు గలదు.
345. జమీందారుని యొక్క ప్రతినిధి శిస్తులను వసూలుచేయుటకై పల్లెలకు బోయినప్పుడు రైతులకు బహువిధములుగా పీడించును. ఆతడే తిరిగి వచ్చి యజమానుని సమక్షమున నున్నప్పుడో, తన ధోరణిని మార్చుకొని, అమిత యోగ్యుడై రైతులను దయతో జూచుచు, వారి కష్టనిష్ఠురములను బాగుగా విచారించి యందఱకును నిష్పక్షపాతముగా న్యాయమును జరుపయత్నించును. రైతులను పీడించు నీ గుమాస్తా యజమానుని భయమువలనను, వాని సమక్షమందుండుట వలనను యోగ్యుడై వర్తించుచున్నాడు. అటులనే సాధుజనుల సహవాసము దుర్మార్గులకు సహా భయభక్తులను గల్గించి వారిని సన్మార్గులనుగ జేయును.
346. తడిసిన కట్టెలైనను నిప్పుసెగను బెట్టిన యెడల త్వరలోనే యెండి బాగుగా మండును. అటులనే సాధుసంగములౌకికుల హృదయమందలి లోభమోహములను తేమన హరించును, అంతట వివేకాగ్ని వారియందు రగుల్కొని ప్రకాశింపగలదు.
347. జగజ్జననియగు ఉమ హిమవంతుని పుత్త్రికయై అవతరించినపుడు ఆ సర్వశక్తిమయి తన దివ్యరూపముల ననేకముచూసి యాతని ధన్యునొనర్చెనని పురాణములలో విందువు. కాని గిరిరాజు వేదవాచ్యమగు బ్రహ్మమును జూవుమని కోరగా ఆమె యిట్లు పల్కెను: ‘‘నాయదా! బ్రహ్మమును జూడదలతువేని సర్వసంగ పరిత్యాగము చేసిన సాధువుల సాంగత్యము చేయవలయును జుమీ!’’
348. ఏనుగు శరీరమును శుభ్రముగ తోమి కడిగి పిమ్మట దానిని యథేచ్ఛముగా విడిచిపెట్టిన యెడల వెంటనే శరీరము మలినము చేసికొనును; కాని దానిని చావడి లోనికి దీసికొనిపోయి కట్టివేసిన యెడల శుభ్రముగా నుండును. అటులనే సత్సాంగత్యము యొక్క ప్రభావమువలన నీవు చిత్తశుద్ధిని బడసి తదుపరి సామరజనులతో యథేచ్ఛముగా సంచరించితి వేని, ఆ చిత్తశుద్ధిని త్వరలోనే పోగొట్టుకొందువు. అటులగాక నీ మనస్సును భగవంతునిపై స్థిరముగా నిలిపితివా, ఇక నెన్నటికిని మనోమాలిన్యము పొందకుందువు.
నామస్మరణ
349. భోగములందు మోహముగలవారు ద్వైతభావము నవలంబించి నారద పాంచరాత్రమున జెప్పబడిన రీతిని బిగ్గఱగా భగవన్నామ సంకీర్తన చేయుటయే ఉత్తమమైన సాధన.

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

ఇంకావుంది...