మెయిన్ ఫీచర్

వివాహవేళ ముస్తాబు ఇలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాఘమాసం.. పెళ్లిళ్ల సీజన్.. జీవితంలో ఒకే ఒక్కసారి వచ్చే పెద్ద పండుగ. అతిథులు, విందులు, వినోదాలు.. వంటివన్నీ ఒకత్తెయితే.. ఏఏ సందర్భానికి ఎలాంటి దుస్తులు వేసుకోవాలి? ఎలా ముస్తాబు చేసుకోవాలి? ఇలాంటివి నేటి పెళ్లి కూతుర్లకు పెద్ద సమస్యలుగా కనబడతాయి. పసుపు కొట్టడం దగ్గర నుంచి రిసెప్షన్ వరకు.. ప్రతి సందర్భంలో ఎలా మెరిసిపోవాలి? అని బుర్రలు బద్ధలు కొట్టుకుంటుంటారు వధువులు.. అప్పటికప్పుడు హడావుడి పడిపోకుండా ముందుగానే.. అంటే సందర్భానుసారంగా ప్రణాళిక చేసుకుంటే ఆయా సమయాల్లో కంగారు పడాల్సిన అవసరం ఉండదు. పెళ్లితంతు మొదలయ్యేది పసుపు కొట్టడంతోనే కాబట్టి.. ఇలాంటి సమయంలో మరీ ఆడంబరంగా కాకుండా కాంతివంతమైన రంగుల్లో కనిపించే చీర కానీ, పరికిణీ-ఓణీలను కానీ ఎంచుకుంటే బాగుంటుంది. జరీకోటా చీరలైతే మరింత అందంగా ఉంటాయి. లగ్నపత్రిక రాసుకున్నప్పుడైతే కంచిపట్టు చీర బాగుంటుంది. జరీ అంచుల్లో ముదురు రంగులు ఉంటే మరింత బాగుంటాయి. వీటికి పరికిణి-ఓణీ టైపు చీరలైనా మరింత బాగుంటాయి. వీటికి మీకు నచ్చిన రవికల్ని ఎంపిక చేసుకుంటే ఆడంబరంగా కనిపిస్తాయి. కాస్త భిన్నంగా, కొత్తగా కనిపించాలంటే చీరల ఎంపికలో, జాకెట్టు కుట్టించుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుదిరితే ఆధునిక డిజైన్ పరికిణీ-ఓణీని వేసుకోవచ్చు. పూర్తిగా సంప్రదాయబద్ధంగా కనిపించాలంటే బోట్‌నెక్ జాకెట్టు ఎంచుకుంటే చాలా బాగుంటుంది. ట్రెండీగా కనిపించాలంటే మాత్రం క్రాప్‌టాప్ తరహాలో బెనారస్ బ్రొకేడ్‌లను ఎంచుకోవాలి. కుదిరితే డిజైనర్ పరికిణి- ఓణీలు, రాసిల్క్‌పై ఎంబ్రాయిడరీ రకాలు బాగుంటాయి. మెహందీకి చాలామంది లాంగ్ ఫ్రాక్‌లను, గాగ్రాలను ఎంచుకుంటున్నారు. ఇదే ఇప్పటి ట్రెండ్. ఇంకాస్త భిన్నంగా కనిపించాలనుకుంటే అంబ్రెల్లా టైపు వాటిని కూడా ఎంచుకోవచ్చు. మంగళస్నానాలకు వెంకటగిరి, మంగళగిరి, ఖాదీ చీరల వంటివి బాగుంటాయి. ఈ వేడుక తెల్లవారుజామునే జరుగుతుంది కాబట్టి ప్రకాశవంతమైన రంగులు.. అంటే ఎరుపు, పసుపు, బంగారు వర్ణంలోని చీరల్ని కట్టుకోవాలి. స్నానం అయిపోయాక హాఫ్ అండ్ హాఫ్ తరహా చీరలను ఎంచుకుంటే బాగుంటుంది. ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు మాత్రం స్టైలిష్‌గా ఉండే చీరల్ని ఎంచుకోవాలి. అదీ ఇంగ్లీషు రంగులను ఎంచుకుంటే చాలా బాగుంటాయి. తలంబ్రాలకు మాత్రం పూర్తి సంప్రదాయంగా, ఇంటి ఆచారాన్ని అనుసరించి చీరలను ఎంపిక చేసుకోవాలి. ఇవి కంచిపట్టువైతే చాలా బాగుంటాయి. అయితే దీని జాకెట్టు మాత్రం ముదురు రంగుల్లో మీ దేహఛాయకు నప్పేలా ఎంచుకుంటే మెరిసిపోవచ్చు. రిసెప్షన్ సమయానికి మాత్రం లాంగ్ ఫ్రాక్‌లు లేదా అనార్కలీలను ఎంచుకోవచ్చు. క్రాప్‌టాప్ తరహాలో గాగ్రాను ఎంచుకుని ఒక భుజానికి దుపట్టాని వేసుకుంటే దివి నుంచి భుమికి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతారు. ఇలా ముందుగానే ప్రణాళిక వేసుకుంటే పెళ్లి వేళ చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు.