మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీగురుదేవు డొకశిష్యున కిట్లు బోధించెను: ‘‘్భక్తిమార్గమున సులభముగా ఇంద్రియ నిగ్రహము లభించును. మానసమున భగవద్భక్తి వృద్ధిపొందిన కొలదియు విషయ భోగములు రసహీనముగా గాన్పించుచుండును. తమ బిడ్డ చనిపోయిన దినమున ఇంద్రియ సుఖములు భార్యాభర్తల నాకర్షింపజాలునా?’’
శిష్యుడు: కాని భగవానునియందు నాకు భక్తి కుదురకున్నది.
గురుదేవుడు: నిరంతనము భగవన్నామమును స్మరింపుము. దానివలన సమస్త పాపములును కామక్రోధములును నిర్మూలమగును. భోగవాంఛలన్నియు అదృశ్యమైపోవును.
శిష్యుడు: కాని భగవన్నామమున నాకు రుచి కలుగకున్నది.
గురుదేవుడు.: కలుగనిచో, ‘నీ నామమున రుచి కలుగజేయు’మని పరితాపముతో భగవానుని వేడుకొనుము. నిస్సంశయముగా నీ ప్రార్థన నాలకించి సఫలముచేయును... ‘నీ నామమున నాకు రుచి కలుగలేదు!- సంధించిన రోగికి పూర్తిగా అన్నహితవు తప్పిన పక్షమున ఇక వాని జీవితాశ వదలుకొనవలసినదే. అటులకాక కొంచెమైనను అన్నహితవు ఉన్న యెడల వ్యాధి కుదురునని ఆశపడవచ్చును. కావున భగవన్నామమున రుచి గనుమని-ఆనందము గనుమని- చెప్పుచున్నాను. వాని నామమును స్మరింపుము- దుర్గానామము - కృష్ణనామము- శివనామము- ఏదియైనను సరియే. నామస్మరణమున నిత్యము ఆకర్షణయు ఆనందమును వృద్ధియగుచుండెనా, నీకిక భయములేదు. చిత్తభ్రమ- సంసార మోహము- నివారణ కావలయును, అపుడు తప్పక వాని యనుగ్రహము నీకు లభించును.
351 ఏల ? నామము సర్వ శక్తిమంతముగదా! భగవన్నామను భగవంతుడును వేరు కావు. బంగారముతోడను నవరత్న ఖచితమైన నగలతోడను సత్యభామ భగవానుని తూచలేకపోయినది. కాని త్రాసులో ఒక వైడున తులసీ దళమును మఱియొక వైపున కృష్ణ నామమును ఉంచి రుక్మిణీ దేవి కృష్ణ భగవానుని తూచగల్గెను.
352. నీవు నిజముగా భగవంతుని జూడగోరెదవేని హరి నామస్మరణమున దృఢ విశ్వాసము బూని, నిత్యమేది, అనిత్యమేది - అను వివేకము నలవర్చుకొనవలయును. అందులకై ప్రయత్నింపుము.
353. శ్రీ చైతన్యుడు ఇట్లు పలికి యున్నాడు. ‘‘్భగవన్నామము అఖండ శక్తిమంతము. నామస్మరణము వలన వెంటనే ఫలము గలుగక పోవచ్చును. కాని,మేడ పరంజా గోడ చివర నొక మూల ఎప్పుడో పడినగింజ తుదకు నేల నంటి మొలచి , చెట్టై బహుశః మేడ బీటలు వారి పడిపోయిన తర్వాత కానిమ్ము ఫలించును జుమీ.
354 . ఎఱిగికాని, ఎఱుగక కాని, స్ఫురణయుండి కాని లేక గాని, ఏ స్థితిలోనైనను భగవన్నామము నుచ్చరించిన యెడల దానివలన తప్పక సత్ఫలము కలుగును. బుద్ధి పూర్వకముగా ఏటికి పోయి స్నానము చేసిన వానికి స్నాన లాభము కలుగును. మరియొకనిచే నీటిలోనికి ద్రోయబడిన వానికిని స్నానఫలము గలుగును. మరియు గాఢ నిద్రబోవు చుండ నెవరైనను మీద నీళ్ళు పోసినను స్నానము ప్రాప్తించును.
355. ఎఱిగియో, ఎఱుగకయో ఎటులైనను అమృత సరోవరమున బడనేని నరుడు అమృతుడగును. ఐచ్ఛికముగా గాని, పరుల ప్రేరణచే గాని ఏవిధంగా నైనను భగవన్నామ స్మరణ చేయువాడు తుదకు అమృతత్వమును పొందును.
356. బ్రహ్మ సాక్షాత్కారమునకు భగవన్నామమే చాలునని యొక ధర్మబోధకుడు పలుక శ్రీ గురుదేవుడిట్లు వచించెను. నిజమే. భగవానుని దివ్యనామము అఖంఢ శక్తమంతము సందియము లేదు. కాని భక్తి లేనిదే అది చాలునా?

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
ఇంకావుంది...