మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుని కొరకు పరితపింపవలయును. కామినీ కాంచనములపై మనసు బెట్టుకొని భగవన్నామస్మరణ చేసినందువల్ల నేమి లాభము,. కేవల మంత్రము వలన తేలుకాటు మానదు. ఆవుపేడ యొక్క పొగను కూడా అచట వేయవలయును. ఒక్కసారి భగవన్నామము నుచ్చరించినందువలననే నరుని సమస్త పాపములను హరించును. సందియము లేదు. కాని వెనువెంటనే నరుడు పాపకార్యములను చేయుచున్నాడే. ఇక మరల పాపము చేయనని ఒట్టుపెట్టుకొనుటకు వానికి మనో బలము చాలదు. గంగాస్నానము సమస్త పాపహరము. ఐననేమి? పాపములు తొలిగి ఒడ్టున నున్న చెట్ల పై పొంచి యుండి నరుడు స్నానము చేసి ఈవలకు వచ్చినంతనే వాని బుజములపై దుముకునని చెబుదురు. కాబట్టి కొన్ని యడుగుల దూరము నడచుటకుముందే అవి వచ్చి వానిపై బడుచున్వి. మరల వాని నావేశించుచున్నవి. కావు భక్తి లానాముకలుగ చేయుమని పేరుప్రతిష్టలు, శరీర సుఖములు మొదలగు తుచ్ఛ క్షణిక విషయములందరి మోహము క్షీణింపచేయుమని భగవానుని వేడుకొనుచు సదావాని నామస్మరణ చేయుచుండుము.
357. కొండంత దూదియైనను నలుసంత నిప్పు దానిపై బడినంతనే తగులబడి బూడిదెయై పోవురీతిని పావన భగవన్నామమును భక్తితో కీర్తించిన మాత్రాన నీ పాపరాసులన్నియు పటాపంచలై పోగలవు.
358. లౌకిక బుద్ధిగలవారి భక్తిసాధనలు కేవలము అప్పటి కప్పుడుండునవి. వానివలన స్థిరమైన సంస్కారము గలుగదు, కాని భగవద్భక్తి పరాయణులగువారు ప్రతి శ్వాసముతోడను భగవన్నామము నుచ్చరింతురు. కొందఱు తమలోతాము ‘‘ఓం రామ ఓం’’అని నిరంతరము స్మరణ చేయుచుందురు. జ్ఞానయోగావలంబులు ‘‘సో 2 హం’’అని స్మరించుచుందురు. కొందఱి జిహ్వ సదా కదలుచునే యుండును. (అనగా ఏ స్తోత్రమునో, మంత్రమునో ఉచ్చరించుచునే యుండును.)
359. ప్రశాంతమైన యొకతావున గూర్చుండి, వౌనముగా భగవన్నామమును స్మరించుచుండుటయే జపమనబడును. ఏకాగ్రచిత్తము తోడను భక్తితోడను ఎడతెగకుండ నామస్మరణము చేయుచున్నయెడల తుదకు తప్పక దివ్యదర్శనములు గలుగును- ఈశ్వర సాక్షాత్కారము లభించును. పెద్ద దూలమొకటి గంగాజలములో మునిగియున్నదనుకొనుము. దాని చివరనొక గొలుసుకట్టి ఆ గొలుసు రెండవ కొనను ఒడ్డునదగిలించినారనుకొనుము. ఆ గొలుసు పట్టుకొని కొక్కెములను ఆనుకొనుచు పోతివేని నీవాదూలమును జేరగలుగుదువు గదా? అదే తీరున నీవు భగవానుని పావన నామస్మరణమున నిమగ్నుడవైన యెడల తుదకు వాని సాక్షాత్కారమును పొందగలుగుదువు.
360. శ్రీగురుదేవుడు తఱచుగా నిట్లు వచించువాడు. ‘‘చేతులను చఱచుచు ఉదయమును సాయంకాలమునను హరినామ సంకీర్తన చేయుడు. మీ పాపములును బాధలును- అన్నియు మిమ్ము విడిచి పలాయనమగును. చెట్టుక్రింద నిలువబడిన చప్పట్లు గొట్టినయెడల చెట్టు మీది పక్షులెగిరిపోవును గదా! చప్పట్లు గొట్టుచు హరినామ సంకీర్తన చేయుదురేని మీ శరీరము అను చెట్టునుండి పాపములను పక్షులు ఎగిరిపోవును.’’
పారమార్థిక జీవన మార్గములు
సాధనలో అవాంతరములు
361. పిఱికితనము, ద్వేషము, భయమును రాజ్యమేలుపట్ల భగవంతుడు గోచరింపడు.
362. తక్కెడలోని బరువైన సిబ్బి క్రిందికి బోవ, తేలికయైనది పైకి లేచును.
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి
ఇంకావుంది...