మెయిన్ ఫీచర్

మొదలైంది.. హీట్ రేస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుప్పట్లో ముసుగుతన్నిన చలి పక్కమీదనుంచి దిగిపోవడంతో -ఎండ తీవ్రత రోజుకో డిగ్రీచొప్పున పెంచుకుంటూ వస్తోంది. మార్చికి ముందే కనె్నర్ర చేసిన భానుడు -చెమటలు పట్టించేందుకు రెడీ అయ్యాడు. సో, సమ్మర్ సినిమాకు సీజన్ మొదలైంది. కొత్త ఏడాది ఆరంభంలో మురిపించిన సంక్రాంతి సినిమాలు తీవ్ర నిరాశకు గురిచేయడంతో -సమ్మర్ సీజన్‌పైనే ఆడియన్స్ ఆశలు పెట్టుకున్నారు. పెద్ద పండక్కి పెద్ద సినిమాలొచ్చినా -ఎఫ్2 ఒక్కటే బంపర్ హిట్ అనిపించుకుంది. పండుగ వినోదాన్ని ఒక్క ఈ సినిమాతోనే సరిపెట్టుకున్నాం. తరువాత ఫిబ్రవరిలో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడటంతో -సినిమా అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్ కరవైంది. దీంతో సమ్మర్ సీజన్‌లో వచ్చే సినిమాలపై ఇప్పటినుంచే లెక్కలు మొదలయ్యాయి. దర్శక నిర్మాతలు సైతం ఈ సీజన్‌ను క్యాష్ చేసుకుని -ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు వేసుకునేందుకు చిత్రాలను చెక్కుతున్నారు. సో, మిడ్ సమ్మర్ అంటే మార్చి చివరి వారం నుంచి వచ్చే మే మధ్యవారం వరకూ సమ్మర్ సినిమాలతో థియేటర్ల వద్ద మోత మోగనుంది. ‘హీట్ రేస్’ను క్రాస్‌చేసి ఆడియన్స్‌ని కూల్ చేయడానికి ఎవరెవరు సిద్ధమవుతున్నారో చూద్దాం.
***
మార్చి ఎండింగ్ నుంచి దాదాపు మే నెల చివరి వరకు డజను సినిమాలైనా బయటికొస్తాయని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ప్రతి వేసవికీ ఇది సినిమా అభిమానులకు అనుభవైకమే. మరి ఈసారి ఎవరెవరు సిద్ధం అవుతున్నారంటే..
మార్చి మొదలైందో లేదో -ఒకటో తారీఖునే నందమూరి కళ్యాణ్‌రామ్ కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. సినిమాటోగ్రాఫర్ దర్శకుడే తెరకెక్కించిన ఆ చిత్రమే -118. థ్రిల్లర్ కానె్సప్ట్‌తో వచ్చిన సినిమా థియేటర్ల వద్ద హడావుడి చేస్తోంది. సినిమా టైటిల్ నుంచి ట్రైలర్ దాకా ఆసక్తిని పెంచిన ఈ చిత్రం -్ఫలితం పరంగా ఇంకెన్ని మార్కులు సంపాదిస్తుందో చూడాలి. అయితే రెండోరోజు టాక్‌లో -ప్రేక్షకులను సరైన థ్రిల్ ఇవ్వలేకపోయిందన్న మాట అయితే వినిపిస్తోంది. అయితే స్కూళ్లు, కాలేజీలకు పరీక్షల సీజన్ మొదలైన సమయంలో సినిమా రావడం కూడా ఈ ఇంపాక్ట్‌కు కారణమన్న వాదనా వినిపిస్తోంది. మార్చి- ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల సీజన్ కాబట్టి సినిమాల రాక తక్కువే ఉంది. మార్చిలో రెండోవారం నుంచి ముగిసే వరకూ దాదాపుగా సినిమాల విడుదల అంతంతమాత్రమే. పరీక్షల ప్రిపరేషన్ పరిస్థితిని అధిగమించి మార్చిలోనే టాలీవుడ్ ప్రేమజంట నాగచైతన్య, సమంతలు కలిసి నటించిన ‘మజిలీ’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. దాంతోపాటుగా మెగా హీరో అల్లు శిరీష్ కూడా మార్చి మూడోవారంలో థియేటర్లకు వచ్చేందుకు తహతహలాడుతున్నట్టు సమాచారం. కెరీర్‌లో శిరీష్ చేసిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో హిట్టందుకోకపోవడంతో, ఎబిసిడిపై చాలా ఆశలే పెట్టుకున్నాడు. మార్చి 29న మెగా ఫ్యామిలీ హీరోయిన్ నిహారిక ‘సూర్యకాంతం’గా సందడి చేయనుంది.
ఏప్రిల్‌లోనూ కొంత కష్టమే అయినా.. ఈసారి మాత్రం అరడజను చిత్రాలు వరకూ క్రేజీగానే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏప్రిల్ 12న సాయిధరమ్‌తేజ్- కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘చిత్రలహరి’ స్క్రీన్స్‌కు రానుంది. అదేరోజున తమిళ హీరో సూర్య ఎన్‌జికె, ఏప్రిల్ 18న లారెన్స్ కాంచన-3, ఏప్రిల్ 19న నాచురల్ స్టార్ నాని జెర్సీ, 25న సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ థియేటర్లను టచ్ చేస్తాయి. అంటే ఈసారి ఏప్రిల్‌లోనూ ప్రేక్షకులకు ఊపిరాడనివ్వకుండా సినిమాలు వచ్చేస్తున్నాయన్న మాట. అయితే, ఏప్రిల్ చివరి వరకూ వరుస సినిమాలు వస్తున్నా -పెద్ద చిత్రాలుగా పరిగణించేవి తక్కువనే చెప్పాలి. పెద్ద సినిమాల విషయం చూసుకుంటే ఏప్రిల్ 25వరకు ఏ సినిమా లేనట్టే. ‘మహర్షి’తో పెద్ద సినిమాల మోత మొదలవుతుంది. సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ‘మహర్షి’ ఈ సమ్మర్‌లో భారీ అంచనాల నడుమ విడుదలకానుంది. ఇప్పటికే షూటింగ్ ముగింపుదశకు చేరుకుంది. సినిమాపై అంచనాలు పతాకస్థాయిలో ఉన్నాయి. ‘భరత్ అనే నేను’ బ్లాక్‌బస్టర్ తర్వత మహేష్ నటిస్తున్న సినిమా కాబట్టి, భారీ ఎత్తున చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. మహర్షి కోసం ఇప్పటికే దాదాపుగా 80 శాతం థియేటర్లను బ్లాక్ చేశారని సమాచారం. బాహుబలిలాంటి సంచలన చిత్రం కోసం ఏకంగా ఐదేళ్లు కేటాయించిన ప్రభాస్ ఆ నెక్స్ట్ సినిమా ‘సాహూ’ విషయంలో దాదాపు రెండేళ్లు తీసుకున్నాడు. అయితే సాహూతోపాటు ఆయన జిల్ ఫేమ్ రాధాకృష్ణతో మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగులోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘సాహూ’ సినిమా ఇప్పటికే సంచలనం రేపుతోంది. ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు టాక్. అలాగే మే నెలలోనే మెగాస్టార్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రం సైరా థియేటర్లకు రానుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథతో సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సైరా’పైనా పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. ఈ రెండే కాదు అర్జున్‌రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ కూడా మేలోనే విడుదల కానుంది. మొత్తానికి భారీ సినిమాలతోపాటు చాలా సినిమాలు బరిలో దించేందుకు రంగం సిద్ధమవుతోంది. వీటితోపాటే మరిన్ని చిన్న సినిమాలూ సమయానుకూలంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈ సమ్మర్‌లో అల్లు అర్జున్, రామ్‌చరణ్, ఎన్టీఆర్, గోపీచంద్‌లాంటి హీరోల ఎంట్రీ లేనట్టే. ఇప్పటికే రాజవౌళి నెక్స్ట్ సినిమా ట్రిపుల్ ఆర్ కోసం రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు ఆరు నెలలు టైమ్ ఇచ్చేశారు. అల్లు అర్జున్- త్రివిక్రమ్ సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. గోపీచంద్ కూడా షూటింగ్‌లోనే వున్నాడు. థియేటర్లకు వస్తున్న చిత్రాల్లో ఎన్ని సినిమాలు ఆడియన్స్‌కి ఆనందాన్ని పంచుతాయి, ఎన్ని చిత్రాలు ప్రేక్షకులను విసిగిస్తాయనేది వెండితెరపైనే చూడాలి.

-శ్రీనివాస్ ఆర్ రావ్