మెయన్ ఫీచర్

కశ్మీర్ కార్చిచ్చు ఆరేదెపుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 72 ఏళ్లు గడచినా జమ్మూ కశ్మీర్ సమస్య రావణకాష్టంలా రగులుతూనే ఉంది. అక్కడ శాంతి భద్రతల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయించవలసి వస్తున్నది. దీని మూలంగా దేశంలోని ఇతర రాష్ట్రాలలో అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రజోపయోగ పథకాలకు తగినన్ని నిధులు సరిపోవడం లేదు.
ఆంగ్లేయులు వారి ‘విభజించి పాలించు’ విధానానికి గుర్తుగా మత ప్రాతిపదికన మన దేశాన్ని భారత్, పాకిస్తాన్‌లుగా విభజించి తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మన దేశ భద్రతకు పాకిస్తాన్ నుంచి ముప్పువాటిల్లుతునే ఉన్నది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో మన దేశంలో ఉన్న దాదాపు 650 సంస్థానాలు అప్పటి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయి పటేల్ నాయకత్వ పటిమతో ఇండియన్ యూనియన్‌లో కలసిపోయాయి.
అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆలోచనల మేరకు జమ్మూ కశ్మీర్‌లో ఉన్న హిందూ సంస్థానాన్ని మాత్రం వారి ఇష్టానికి వదిలివేశారు. ఆనాటి అగ్రనాయకుల ఉదాసీనత మూలంగా కశ్మీర్ సమస్యకు సరైన పరిష్కారం లభించలేదు. ఇదే అదనుగా భావించి పాకిస్తాన్ పాలకులు మన కశ్మీర్‌లోని కొంత భాగాన్ని దుర్మార్గంగా ఆక్రమించుకొన్నారు. మన చేతకాని తనానికి గుర్తింపుగా ఆ ప్రాంతానికి ‘ఆక్రమిత కాశ్మీర్’ అని ముద్దుగా పిలుచుకొని మురిసిపోతున్నాము. ఈ విషయమై ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేసినా పట్టించుకొనే నాథుడే లేడు. ఇటీవల కశ్మీర్‌లోని పుల్వామా వద్ద జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఆత్మాహుతి దాడిలో 42 మంది సైనికులు దుర్మరణం పొందారు. అయితే, దానిని ఒక మానవ తప్పిదంగా, ప్రమాదంగా మతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్న ప్రతిపక్ష నేతల దౌర్భాగ్య రాజకీయాలను ఏమనాలి? ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో సర్జికల్ స్ట్రైక్స్ జరిపిన వాయుసేన విజయాలపై తమ ‘శకుని బుద్ధి’తో సాక్ష్యాధారాలు చూపించాలంటూ అడుగుతున్న రాజకీయ వృద్ధ జంబూకాలను ఏమని పిలవాలి? పాకిస్తాన్ పన్నుతున్న కుయుక్తులకు ఇంతవరకు ఏ ప్రధాని చెయ్యని రీతిలో ప్రపంచ దేశాల అండతో, ఆత్మవిశ్వాసంతో నిజమైన దేశభక్తితో శత్రువులకు చుక్కలు చూపిస్తున్న మోదీని చూసి తమ పునాదులు కదులుతున్నందున కొందరు విపక్ష నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారు. ఈ పరిణామాలను దేశ ప్రజలు గమనిస్తూ, ఈ రాజకీయ వంచకులకు తగిన సమయంలో బుద్ధిచెప్తారు. ఇది జరగబోయే పరిణామం అని చెప్పక తప్పదు.
జమ్మూ కశ్మీర్ నైసర్గిక పరిస్థితులను, అక్కడి ప్రజల జీవనాన్ని విశే్లషిస్తే మనకు అసలు విషయాలు అవగతమవుతాయి. ఈ రాష్ట్రం మొత్తం వైశాల్యం 101380 చదరపు కిలోమీటర్లు (పి.ఓ.కె. ప్రాంతం కలిపి). కశ్మీర్‌లో దాదాపు 70 లక్షల మంది నివసిస్తున్నారు. ముస్లిమ్‌లతోపాటు డొగ్రాస్, రాజ్‌పుట్స్, బ్రాహ్మణులు, కశ్మీర్ పండిట్స్, సిక్కులు, బుద్ధులు, పఠాన్‌లు, క్రైస్తవులు, గిరిజన వర్గాల కలసి జీవిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 22 జిల్లాలు ఉన్నాయి. వాటిలో 17 జిల్లాల నుంచి ఎటువంటి ఆందోళనలు గానీ, భారత ప్రభుత్వం పట్ల వ్యతిరేకత గానీ కనిపించవు. కేవలం శ్రీనగర్, అనంతనాగ్, బారాముల్లా, కుల్‌గామ్, పుల్వామా జిల్లాల నుంచే వేర్పాటువాదుల ఆందోళనలు, ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. జమ్మూ కశ్మీర్ మొత్తం భారత ప్రభుత్వం పట్ల వ్యతిరేకతగా ఉన్నదంటూ విదేశీ ప్రభుత్వాల ప్రభావంతో కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ఆ ప్రచారంలో రవ్వంతైనా నిజం లేదు. కశ్మీర్ జనాభాలోని 15% ప్రజలు మాత్రమే అదీ.. సున్నీ మతస్థులు ఎక్కువగా ఉన్న ఐదు జిల్లాలలో మాత్రమే ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఆశ్చర్యకర విషయమేమిటంటే ఈ ప్రాంతాలు పాకిస్తాన్‌కు, లైన్ ఆఫ్ కంట్రోల్‌కు చాలా దూరంలో ఉన్నాయి. ఎంత దూరంగా ఉన్నా మన శత్రుదేశం పాక్ నుంచి ఉగ్రవాదులు రహస్యంగా ఈ జిల్లాల్లోకి ప్రవేశించి అరాచకాలు సృష్టిస్తున్నారు. దీనికి కారణం ఏమిటన్నది పాలకులు ఆలోచించాలి.
ప్రతి 25 సంవత్సరాలకు ఒక కొత్త తరం ఉద్భవిస్తుంది. ఆ విధంగా ఇప్పటికి మూడు తరాల వారు కశ్మీర్ సమాజంలోకి వచ్చారు. వీరి ఆలోచనలు, ఆదర్శాలు, విధి విధానాలు, దేశం పట్ల గౌరవం, భారతీయ పౌరులుగా బాధ్యతలు వంటివి పూర్తిగా మారిపోయాయి. అక్కడి పాలకులు ఉర్దూను అధికార భాషగా బలవంతంగా పౌర సమాజంపై రుద్దుతున్నారు. మతాన్ని ఆసరాగా చేసుకొని దేశభక్తిని, మాతృభూమి పట్ల ప్రేమను నిర్వీర్యం చేస్తున్నారు. భారతదేశాన్ని ఒక దుష్టశక్తిగా చిత్రీకరిస్తూ,కశ్మీర్‌కు స్వాతంత్య్రం అనే ముసుగులో అరాచకాలు సృష్టిస్తున్నారు. భారత సైన్యాన్ని హేళన చెయ్యడం, సైనికులపై రాళ్ళు రువ్వడం లాంటి చర్యలకు కశ్మీర్‌లోని కొందరు యువకులు మద్దతు పలుకుతున్నారు. దీనికి కారణం వారి అమాయకత్వం. జమ్మూ కశ్మీర్‌లోని మొదటి తరంలోని దేశభక్తి గల పౌరులు ఇప్పుడు దాదాపు కనుమరుగయ్యారు. భగవంతుని పేరిట జరిగే జిహాదీ ఉగ్రకలాపాలకు మద్దతు ఇచ్చేవారే ఎక్కువ. కేవలం మిలటరీని ఉపయోగించి శాంతి సామరస్యాలు సాధించడం కష్టం. దీనికి తోడు అక్కడి సమాజంలో మార్పు రావాలి. వారి ఆలోచనా ధోరణి మారాలి. ఇందుకోసం దీర్ఘకాలికమైన చర్యలు చేపట్టాలి.
ముందుగా జమ్మూ కశ్మీర్‌లోని ఇతర మాతృభాషలను పునరుద్ధరించాలి. వివిధ మతాల, కులాల సంస్కృతీ సంప్రదాయాలను వారి మాతృభాషల్లో ప్రచారం చెయ్యాలి. అక్కడి దేశభక్తుల జీవిత గాథలను పాఠ్యాంశాల రూపంలో లేదా సాంస్కృతిక ప్రదర్శనల రూపంలో ఇప్పటి తరం వారికి తెలియచెయ్యాలి. ఏ వ్యక్తికైనా మాతృభాషలో బోధిస్తే త్వరగా అర్థం చేసుకొనే అవకాశం ఉంటుంది. దేశభక్తిని, దేశం పట్ల ప్రేమను, పరమత సహనాన్ని మాతృభాషలో చెబితే అలౌకిక ఆనందంతోపాటు త్వరగా గ్రహించే శక్తి వస్తుంది. తమ సనాతన సాంప్రదాయాల పట్ల గౌరవం, భక్త్భివం కలుగుతాయి. పురాణ గాథల్ని వారి మాతృభాషలలో జాతీయ భావానికి అనుగుణంగా అందించాలి. వారి మనస్సులో ఉన్న విషబీజాలు తొలగించి చైతన్యవంతం చెయ్యాలి. పరమత సహనం, సమాజ సమానత్వమే దేవునికి నిజమైన జిహాదీ అని తెలియచెయ్యాలి. సాంఘిక సమానత లేకపోతే సమాజంలో ప్రగతి ఉండదు, శాంతి ఉండదనే పరివర్తన వారిలో కలిగించాలి. అప్పుడే మనం కలలుకనే దేశం ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలిక చర్యే అయినా పాలకులు సహనం చూపాలి. సుస్థిరమైన శాంతి సౌభాగ్యాలతో కశ్మీర్ ప్రజలు విలసిల్లితే భారత్ సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందనడంలో సందేహం లేదు.

-జన్నాభట్ల నరసింహ ప్రసాద్ 79959 00497