మెయిన్ ఫీచర్

రోజ్ గోల్డ్ మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్ నుంచి జకార్తా వరకు.. ఎక్కడైనా.. ఎలాంటి ఫ్యాషన్ స్ట్రీట్‌లలో నైనా ఈ రంగుదే హవా.. బట్టలైనా, బ్యాగైనా, చెప్పులైనా, ఫోన్ అయినా.. ఇలా.. ఏదైనా.. అంతా రోజ్‌గోల్డ్‌మయమే.. ఇప్పుడు రోజ్‌గోల్డ్ ట్రెండ్‌గా మారిపోయింది. అయితే.. ఫ్యాషన్ మొదలుకానప్పటి నుండీ ఈ రంగు వాడకంలో ఉంది అనే విషయం చాలామందికి తెలియదు. ఇప్పుడు ఈ రంగు ఫర్నిచర్‌లకు కూడా అద్దుతున్నారు. పెళ్లివేడుకలు, కేకులు, కార్లు.. ఇలా అన్నీ రోజ్ గోల్డ్ రంగును పులుముకుంటున్నాయి. ఇంతకీ ఎందుకు ఈ రంగుకు అంత ప్రాధాన్యం అంటే.. అంతా ఆపిల్ ఐఫోన్ వల్లే అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఆపిల్ ఐఫోన్‌ను విడుదల చేసిన సమయంలోనే ఎక్కువ మంది రోజ్ గోల్డ్ గురించి విన్నారు. అప్పటినుంచి ఈ రంగు అందరి నోటా వినిపిస్తోంది.
సెలబ్రెటీలు, సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారు ఏం చేసినా సామాన్యులు వారిని అనుసరిస్తుంటారు. ఫ్యాషన్ విషయంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఐ ఫోన్ రోజ్ గోల్డ్ రంగు పులుముకోకముందే ఆ కలర్ ఫ్యాషన్ రంగంలో ట్రెండ్‌గా మారిందని డబ్లూజీఎస్‌ఎన్ ఫ్యాషన్ ఏజెన్సీ అంటోంది. 2012లోనే ఆభరణాలకు ఈ రంగు వినియోగించడం మొదలైందని, అప్పటి నుంచి రోజ్ గోల్డ్ ఫ్యాషన్ ట్రెండ్‌గా మారిందని పేర్కొంది. ఫ్యాషన్ డిజైనర్లు జిమీచో, క్యావలీలు రోజ్‌గోల్డ్ స్ఫూర్తితో ఫ్యాషన్ దుస్తులను మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇంటీరియల్ డిజైనర్లు దీన్ని అందిపుచ్చుకున్నారు. ఈ కలర్ ట్రెండ్ అవుతుండటంతో దీని ప్రభావం రాగి రంగుపై పడింది. ఎందుకంటే రాగి రంగు రోజ్ గోల్డ్ రంగు దాదాపుగా ఒకేవిధంగా ఉంటాయి. అంతేకాకుండా రాగి రంగును ప్రజలు ఒక లోహంగానే భావిస్తారు. రోజ్ గోల్డ్ రంగు ప్రజలను బాగా ఆకర్షించింది. అందువల్ల 2016లో ఈ రంగును ప్రపంచ ప్రసిద్ధ రంగుల కంపెనీ పాంటోన్ కలర్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది.
పాంటోన్ కంపెనీ ఇచ్చే సలహాలు ఫ్యాషన్, ఫర్నిషింగ్, వెడ్డింగ్ డిజైనర్లను బాగా ప్రభావితం చేస్తుంటాయి. యేటా పాంటోన్ ఒక కొత్త రంగును హైలెట్ చేస్తుంది. ఫ్యాషన్ డిజైనర్లు, ఫర్నిషింగ్ నిపుణులు, వెడ్డింగ్ ఇండస్ట్రీ ఆ రంగును అనుసరిస్తుంటారు. కొన్ని కారణాల వల్ల రోజ్ గోల్డ్ ఎప్పటికీ ప్రసిద్ధ రంగుగానే ఉంటుంది అని గోల్డ్‌స్టోన్ డిజిటల్ ఫ్యాషన్ ఎడిటర్ మారీ క్లేరీ తెలిపారు. ప్రముఖ షూ కంపెనీ మిల్లెనియల్స్ కూడా తన సోషల్ మీడియా సైట్లలో ఎక్కువగా పింక్ రంగుతో కూడిన ఫొటోలనే పోస్టు చేస్తుంది. సోషల్ మీడియాలో ఆ ఫొటోలు నెటిజన్లను బాగా ఆకర్షించాయి. ఇన్‌స్టాగ్రామ్ ట్రెండ్ ప్రభావం తమ ఉత్పత్తుల అమ్మకాలపై బాగానే కనిపిస్తుందని చాలామంది వ్యాపారులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో రోజ్ గోల్డ్ రంగు ఉత్పత్తుల ట్రెండ్ కనిపిస్తుండటంతో వాటినే వినియోగదారులు అడుగుతున్నారని చెప్పారు. గులాబీ రంగు దుస్తులు ధరించడాన్ని ఇప్పుడు ఆమోదిస్తున్నారు. ఒకప్పుడు ఈ రంగు కేవలం మహిళా రంగుగానే పరిమితమైంది. షాపుల్లో ఒక్క పింక్ సూట్ అయినా ఇప్పుడు కనిపిస్తోంది.
రోజ్ గోల్డ్ ట్రెండ్ అనేది ప్రస్తుతం శిఖరస్థాయికి డబ్ల్యూజీఎన్ సంస్థ పేర్కొంది. వివిధ వస్తువుల అమ్మకాలపై ఈ రంగు ప్రభావం కచ్చితంగా ఉంటుందని పలు కంపెనీలు చెబుతున్నాయి. రోజ్ గోల్డ్ కేవలం ఫ్యాషన్ మాత్రమే కాదు.. ఇది ఎప్పటికీ తరగని ట్రెండ్. అలా ఈ రంగు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతోంది. తల క్లిప్పుల నుండి కాలి చెప్పుల వరకు రోజ్ గోల్డ్ రంగు ఫ్యాషన్ ప్రపంచాన్ని ఏలుతోంది.