మెయిన్ ఫీచర్

జీవించడంలోనే ఆనందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరు పదుల వరకు కూడబెట్టడంలో ఉన్న తృప్తిని ఆరుపదులు దాటిన తర్వాత స్వంతానికి ఖర్చుపెట్టడం ద్వారా అందుకోవాలి. అవును, కాళ్లలో సత్తువ ఉన్నంతవరకు, కళ్లలో వెలుగు ఉన్నంతవరకు, మనసు త్రుళ్ళిపడుతున్నంతవరకు ప్రకృతిలో పరవశిస్తూ, ఆనంద జీవనం గడుపుతుండాలి. పుట్టిన నాటినుండి చివరిదాకా నాతో ఉండే నేస్తం నేనే!
అందుకే బ్రతికుండగానే బ్రతుకును పండించుకోవాలి!

ఒక నేపథ్యం..
ఈమధ్య నా వాట్సప్‌లో చిన్ననాటి స్నేహితుల గ్రూప్ అంతా ఒక్కసారి సీనియర్ సిటిజన్స్ గ్రూప్ అయిపోయినట్లనిపిస్తోంది.. కారణం మొన్న మొన్నటిదాకా ఎంతో ఎడ్యుకేటివ్‌గా సాగిన చాటింగ్ ఈమధ్య పెద్ద పెద్ద కబుర్లతో, రాజకీయ వార్తలతో, విశే్లషణలతో, భక్తిప్రపత్తులతో, పనికిమాలిన విషయాలతో టైంపాస్ అయిపోతోంది. ప్రొద్దున నాలుగింటికో అయిదింటికో మెసేజ్‌లు ట్రింగ్ ట్రింగ్‌మంటుంటాయి. ఆ సౌండ్స్ మధ్యరాత్రుళ్లదాకా గోల చేస్తుంటాయి. నా ప్రశాంతతకు భంగం కలుగుతుండటంతో నా ఫోన్ సైలెంట్ మోడ్‌ను ఆశ్రయించక తప్పటంలేదు. ఈ మెసేజ్ చూస్తుంటే అనిపిస్తుంటుంది-సీనియర్ సిటిజన్స్ ఆలోచనలు ఇక్కడికే పరిమితమా? అని. ఇంకాస్త బెటర్‌గా బ్రతకటం సాధ్యం కాదా? అన్నది ప్రశ్న.
ఒక నిర్వచనం
ఏడు పదులు దాటేటప్పటికి ఎనె్నన్నో అనుభవాలను మూటగట్టుకుని వంగిపోతుండటం. ఎంతో అనుభవ సంపద.. అంతా గతం తాలూకు గ్రంథాలయమే! దుమ్ము దులపని గ్రంథాలయం తలుపులు కిర్రుమని సౌండ్స్ చేస్తుంటయి.. పుస్తకం చేతికొచ్చినా మోయలేని వయసు.. పైగా, కాలం కలసిరాదు బ్రతుకు బాటలో అడుగు వేయటానికి. ఇంతేనా ‘సీనియర్ సిటిజన్స్’కి నిర్వచనం.
కాదు!.. కాకూడదు!!
బ్రతుకు నిజం!
పసిప్రాయంలో అంటే పదేళ్లు ప్రాయం వరకు పండు ముసలితనంపై మోజు. అందుకే కాబోలు మనవళ్లకి, మనవరాండ్రకి తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అంటే అంత ఆకర్షణ. అలాగే ముడతలు పడుతున్న దేహులు లేలేత దేహుల్ని ఇష్టపడటాలు. రెండు తరాలమధ్య తెలియని అమాయకత్వం.. అందని అనుబంధం, ఆప్యాయత. మైమరచిన ప్రపంచం రెండు తరాలకి. అది వయసు స్నేహం కాదు.. ఆత్మల మైత్రి. దేహుల కౌగిలింత కాదు.. ఆత్మల ఆలింగనం. పసితరాలకి పండుతరమే పరమం.. పండుతరాలకి పసితరాలే పసిడి కెరటాలు.
తినటానికే బ్రతుకు కాదు!
ఆటలాడే వయసులోను, ఆటలుడిగిన వయసులోను జిహ్వచాపల్యం అధికమే! చిన్నతనంలోనే కాదు ముసలితనంలోను కనిపించిందల్లా తినాలనిపిస్తుంటుంది. మారాం చేసో, అలిగో సాధించి తింటే తప్ప తృప్తిగా ఉండదు.. ఆనందంగా ఉండదు. తినటం తప్పనిసరి.. అయితే ఎంత తినాలి? అన్నదే ప్రశ్న. ఎంత ఇష్టమైనదాన్నైనా మోతాదు మించి తినకూడదు. ఇష్టం లేదు కదా అని అసలు ముట్టనైనా ముట్టకుండా ఉండకూడదు. చిన్నతనంలోనైనా, వయసు మీరిన తర్వాతనైనా పోషకాహారాల అవసరం ఎంతో వుంది కాబట్టి ఇష్టంలేని ఆహార పదార్థాలను సైతం ఎంతో కొంత తీసుకోక తప్పదు. అలాగే ఇష్టమైన వంటకాలను తరచూ తింటుండాలి. అయితే ‘పరిమిత’ మోతాదులో తినాలి. ఆహార సేవనమే జీవితం కాదు కానీ జీవితానికి ఆహారం అవసరమే! దేహాన్ని ధరించిన నాటినుండీ దేహాన్ని త్యజించేవరకు తింటూ బ్రతకాల్సిందే తప్ప తినటానికే బ్రతకకూడదు.
నవ్వగలగటం అద్వితీయ వరం
వయసు పైబడటం అంటే వయోభారం అని కాదు. ఏడు పదులు దాటినంత మాత్రాన చీకటింట ఆవాసం అని కాదు. ఆకాశం చీకటిని గుమ్మరిస్తూనే వుంటుంది.. అయినా కోట్ల నక్షత్రాలు పాలపుంతలవుతుంటాయి. నిత్యం మన మనసులలో నవ్వులు పూస్తుండాలి.. పెదాలపై చిరునవ్వు వికసిస్తుండాలి. మనసున పూసిన నవ్వు, పెదాల వికసించిన చిరునవ్వు హృదయాన్ని నందనవనం చేయాలి.. అంతటా ఆనంద సౌరభమే. అవును, బోసినవ్వులు పసిప్రాయానికే కాదు పసిమిప్రాయానికీ అద్వితీయ వరాలే!
డబ్బు కాదు.. జీవితం పవర్‌ఫుల్ కావాలి
ఆరుపదుల దాకా డబ్బును కూడబెట్టడమే జీవితం అనిపిస్తుంది. ఆపైన అయినా సంపాదిస్తున్నది, సేవింగ్స్‌లో వున్నది ఖర్చుపెట్టుకోడం తెలీకపోతే జీవితం దుర్భరమే అవుతుంటుంది. ఎంతోకొంత సంపాదన.. బాంక్ వడ్డీల రూపంలోనో, పెన్షన్ రూపంలోనో, పార్ట్ జాబ్‌ల రూపంలోనో ఉంటున్నపుడు ఇంకా ఖర్చు విషయంలో కక్కుర్తిపడుతుంటే జీవితం అశాంతిగాను, నీరసంగాను సాగుతుంటుంది.
రిటైర్మెంట్ వరకు కుటుంబ బాధ్యతల నడుమ ఆనందాన్ని వెతుక్కున్నట్లే, రిటైర్మెంట్‌తో సమాజం నుండి ప్రకృతినుండి ఆనందాన్ని అందుకోవాలి.. పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను దర్శించటాలు, సందర్శించటాలు చేస్తుండాలి. యాత్రల పరమార్థాన్ని తోడుకోవాలి. అంతేకానీ ఉన్న డబ్బును మరింత పెంచుకునే ప్రయత్నంలో ప్రైవేట్‌గా అధిక వడ్డీలకు తిప్పటాలు, షేర్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేయటాలు అనవసరం.

***
భూమికకు రచనలు
పంపాలనుకునే వారు రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- డా వాసిలి వసంతకుమార్