మెయిన్ ఫీచర్

చింతలు బాపే చింతామణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముల్లోకాలచేత తల్లిగా కీర్తింపబడే ఆదిపరాశక్తినే అనేక రూపాలలో, అనేక నామాలతో భక్తులు పూజిస్తారు. స్తుతిస్తారు. ఆ ఆది పరాశక్తే తపస్సులు చేసి ఆ తపఃప్రభావాన్ని దుర్వినియోగం చేస్తూ భగవంతుడు ఇచ్చిన వరప్రభావంతో విర్రవీగుతూ కన్ను మిన్ను కానక సజ్జనులను, దేవతలు భయభ్రాంతులను చేసే అజ్ఞానులైన రాక్షసులను నశింపచేస్తుంది. ఎక్కడ అధర్మం మొగ్గలు వేసినా అన్యాయం శాఖోప శాఖలుగా విస్తరించాలని చూస్తుందో అక్కడ అమ్మ తన భక్తులు కోరుకున్న రూపంలో వచ్చి ఆ దుష్టులను దునుమాడుతుంది. తన భక్తులను, శిష్టులను కాపాడుతుంది.
ఆ అమ్మనే మానవుడు తన్ను నిరంతరం కాపాడమని వేడుకుంటూ తన ఆరాధ్యదేవతగా కొలుస్తున్నాడు. ఆ అమ్మనే ప్రతి గ్రామంలో గ్రామదేవతగా కొలువుతీర్చి మొక్కులు మొక్కుకుంటు న్నాడు. అట్లాంటి అమ్మనే శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో చింతలు బాపే చింతామణిగా వెలసిందని అం టారు. శ్రీకాకుళం జిల్లా, వెలిసిన గ్రామదేవత చింతామణి తల్లి భక్తుల కోర్కెలు, చింతలు తీర్చే ఇలవేల్పుగా ఆదిపరాశక్తినే ఈ ప్రాంతంలో కొన్ని దశాబ్దాలుగా పూజలు అందుకుంటోంది. ఈఅమ్మ దర్శనార్థం శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాలైన ఒడిశా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
ప్రస్తుతం ఆలయం వెలిసి ఉన్న ప్రదేశానికి కూతవేటు దూరంలో ఒక మర్రిచెట్టు నీడనఅమ్మను అమ్మోరుగా కొలిచేవారు. ఈ మర్రి చెట్టు చెంతనే జిల్లా వాసులంతా వచ్చి అమ్మను కొలిచి వారు నైవేద్యంగా తెచ్చిన పదార్థాలను అమ్మకు నివేదించిన పిమ్మట ఆ పదార్థాలను అమ్మ ప్రసాదంగా అందరూ సేవించేవారు. ‘సాంత్య’ తెగకు చెందిన ‘జన్ని’లుగా పేరొందినవారు అమ్మకు నిత్యం పూజచేసే పూజారులుగా ఉండేవారు.
ఓ మంగళవారం రోజున భక్తులు తమ మొక్కుబడులను తీర్చేందుకు సంబరంగా వారి ఇంటి వద్ద నైవేద్యా లను తెచ్చి అమ్మను తనివితీరా పూజించి యథాప్రకారం ఇంటికి వెళ్లారట. కాని వారు వెళ్ళేటపుడు అమ్మ ప్రాంగణంలో ఓ చెంబును మరిచి పోయారు.
తెల్లవారి మామూలుగా అమ్మను పూజించడానికి వచ్చిన పూజారి అక్కడ- అమ్మవారు తన్ను ఎల్లవేళలా సేవిస్తూ తాను చెప్పిన పనులను చేసే తన భటులకు తానే స్వయంగా ప్రసాదం వడ్డిస్తుండడం చూశాడట. ఆ దృశ్యాన్ని చూచిన జన్ని (పూజారి) శరీరంఒక్క మాటుగా జలధరించింది. అమ్మను చూచిన చర్మచక్షువులు ఆనందం, భయం రెండు మిళతమై జలజలా కన్నీళ్లు కార్చాయట. అమ్మా అని అనాలోచితంగా అంటూ చేతులెత్తి మొక్కాడట.తన్ను చూచి ఆనందించే ఆ భక్తుడిని అమ్మ కరుణించింది. అప్పుడమ్మ క్రితం రాత్రి వారు మరిచి వెళ్లిన చెంబును తీసుకొని దూరంగా విసిరి‘‘ ఓ జన్నీ! నీవు ఇక మీదట ఆ చెంబు పడిన చోటునే నాకు ఓ దేవాలయాన్ని నిర్మించు ఇక ఇప్పటి నుంచి మిమ్ము ఆ దేవాలయంనుంచే కాపాడుతాను. నేను వచ్చి ఆ దేవాల యంలో కొలువు తీరుతాను’’ అని ఆదేశించిందట.
ఆ మాటలు విన్న జన్ని అమితా నందోత్సవాలతో అమ్మను కనులారా వీక్షించిన ఆనందంతో ఊరిలోకి వెళ్లి తానుచూచిన అద్భుతాన్ని వివరించాడు. ఊరివారందరూ కలసి అమ్మ ఆదేశం మేరకు ఇపుడున్న ఆలయ నిర్మాణం చేశారు. అంతేకాదు మహిమాన్విత మైన లీలను చూపే ఆ తల్లిని ఆనాడు అమ్మవారు విసిరిన పాత్రనే అమ్మ రూపంగాను, మూల విరాట్‌గాను భావించి కొలుస్తున్నారు.
ప్రతి మంగళవారం నాడు అమ్మకు మొక్కుకున్న భక్తులు తమ బాధలు తీరాక బెల్లం లేక పంచదారతో చేసిన పానకాన్ని అమ్మవారికి తెచ్చి నివేదన చేస్తారు. అమ్మ ఆశీర్వాదం లభిం చిందని, సంబరం జరుపుతారు.
తమ తమ శక్తి మేరకు మేళతాళాలతో అమ్మవారి ఉత్సవాలను నిర్వ హిస్తారు. ఆ ఉత్సవాల్లో వివిధ రకాలైన జానపద కళారూపాలు ప్రదర్శించి అమ్మను భక్తులను ఆనందింపచేస్తారు. ఈ కార్యక్రమాలతో భక్తులు తమ ఇంటి వద్ద నుంచి అమ్మవారి రూపాన్ని భక్తిశ్రద్ధలతో తలపై పెట్టుకుని గ్రామంలో ఊరేగిస్తూ కవిటిలోని కోవెలకు చేరుకుంటారు. ఆపై కోవెలలో కోరి నిలిచిన అమ్మను తనివి తీరా పూజించి ఆనందంతో ఇళ్లకు వెళ్లి అమ్మకు ప్రీతి నిచ్చే విధంగా వారు జీవనయానం సాగిస్తారట.

- జి.కల్యాణి