మెయన్ ఫీచర్

నవతరం రాజకీయాలకు ప్రతీక పారికర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏడాది కాలంగా క్లోమగ్రంధి క్యాన్సర్‌తో బాధ పడుతూ గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ (63) మృతి చెందడంతో భారత రాజకీ యాలలో ఒక అరుదైన నేతను కోల్పోయినట్లయింది. సాధారణ జీవితం ప్రారంభించి అత్యున్నత విద్యను అభ్యసించినా, అత్యున్నత పదవులు వెంటాడుతూ వచ్చినా ఆ మోజులో పడిపోకుండా, తన సహజ స్వభాభావాన్ని విడనాడకుండా అత్యున్నత విలువలకు ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
చాలా సౌమ్యుడైన పారికర్ రక్షణ మంత్రిగా ఉన్నా గోవా బీచ్‌లలో బిర్యానీ కోసం వెడుతూ చాలా సరదాగా గడిపే వ్యక్తిగానే అందరికీ తెలుసు. కానీ, కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీలో అనూహ్యమైన మార్పులకు వీరోచితంగా ఆయన పోరాడారని, అందుకు వ్యక్తిగతంగా ఎంతో త్యాగానికి సైతం సిద్ధపడ్డారని చాలామందికి తెలియదు. పదవులు, అధికారం పట్ల ఏ మాత్రం వ్యామోహం ప్రదర్శించినా నేడు ఆయన దేశ ప్రధానిగా కొనసాగుతూ ఉండేవారు. కానీ, తన బాధ్యతలను నిష్కామకర్మ వలే నెరవేర్చే ప్రయత్నం చే శారు. అయితే ఈ ప్రక్రియలో అవకాశం వాదులు ఒకరికి బదులు మరొకరు ప్రయోజనం పొందటం వేరే విషయం. సుమారు సంవత్సరం కాలంగా మృత్యువుతో పోరా డుతున్నా ఏనాడూ ఆయన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. చివరి వరకు సమాజ శ్రేయస్సు కోసమే పరితపిస్తూ వచ్చారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ తాను నెరవేర్చవలసిన బాధ్యతలను గురించే ఆరాట పడుతూ వచ్చారు. చాలా అరుదైన వ్యక్తిత్వం. అటువంటి నికార్సయన దేశభక్తి, స్పృహ కలిగిన నేతలు నేడు రాజ కీయ రంగంలోనే కాదు, వివిధ సామాజిక రంగాలలో కూడా లేరని చెప్పవచ్చు.
దేశంలోనే ప్రతిష్టాకరమైన ముంబై ఐఐటీలో విద్య అభ్యసించి ముఖ్యమంత్రి పదవికి ఎదిగిన ఏకైక నేత ఆయన. అటువంటి ఉన్నత విద్య కలిగిన వారెవ్వరూ దేశంలో మరెక్కడా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కాలేదు. చాలామంది జాతీయ నాయకులు వాస్తవమైన తమ విద్యార్హతలు చెప్పుకోలేని పరిస్థితులలో ఉండగా, ఉన్నత సాంకేతిక విద్యను అభ్యసించి కూడా ఏమాత్రం గర్వం లేకుండా పారికర్ వ్యవహరించారు. అంతటి ఉన్నత పదవిలో ఉంటూ ప్రయాణికుల విమానాలలో సాధారణ ప్రయాణికుడి వలే ప్రయాణించేవారు. దేశ అభివృద్ధి, రాజకీయ వ్యవస్థ పట్ల ఆయనకు నిర్దిష్టమైన అభి ప్రాయాలు ఉన్నాయి. వాటికి అనువుగా బీజేపీలో మార్పు తేవడం కోసం ప్రయత్నం చేశారు. 2004లో కేవలం అగ్రనాయకుల అహంకార ధోరణుల కారణంగా బీజేపీ పరాజయం చెందిన సమయంలో ఆ పార్టీలో కీలక శస్త్ర చికిత్స అవసరం అని గ్రహించిన వారిలో ఆయన ముందున్నారు. అరుణ్ శౌరి వంటి నేతలతో కలసి ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక మోహన్ భగవత్ దృష్టికి పలు అంశాలను పారికర్ తీసుకు వెళ్లారు.
నాటి బీజేపీలోని జాతీయ నాయకులందరూ పార్టీకి భారంగా మారారని, వారిలో ఎవరూ ప్రజా విశ్వాసం పొందిన వారు లేరని, వారందరినీ పక్కన పెట్టి రా ష్టస్ధ్రాయిలలో గల నాయకుల బృందాన్ని తీసుకు వచ్చి జాతీయ నాయకత్వం అప్పచెప్పమని అరుణ్ శౌరికి సూచించారు. ఈ సందర్భంగా మనోహర్ పారికర్, నితిన్ గడ్కరీ వంటి నాయకుల పేర్లను కూడా సూచించారు. ఈ కసరత్తు కారణంగానే బిజెపి జాతీయ అధ్యక్షుడిని ముందుగా మార్పు చేయాలని నిర్ణయించారు. ఆ సందర్భంగా మనోహర్ పారికర్ పేరు పరిగణనలోకి వచ్చింది. అయితే, ఈ ప్రయ త్నాలను ఎల్‌కే అద్వానీ, అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్య నాయుడు వంటి నేతలు గ్రహించారు. పారికర్ వంటి నేత లు పార్టీ నాయకత్వం చేపడితే తామందరికీ గడ్డు కాలమనే భయంతో ఆయనను రాకుండా అడ్డుకోవడంలో ఒక్కటయ్యారు. పైగా ఆ సమయంలో పారికర్ అద్వానీని విమర్శిస్తూ చేసిన ఒక ప్రకటన వారికి ఆయుధంగా దొరికింది. దాంతో రాజీ అ భ్యర్థిగా నితిన్ గడ్కరీని రం గంలోకి వచ్చారు. వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో పనిచేసిన నాయకుల బృందానికి జాతీయ నాయకత్వం అప్పచెప్పమని సూ చిస్తే, కేవలం గడ్కరీని మాత్రమే తీసుకురావడంతో మూడేళలు పూర్తయిన తర్వాత ఆయన కంపెనీలతో నాటి యుపిఎ ప్రభుత్వంతో కుమ్మక్కై ఐటి దాడులు జరిపించడం ద్వారా ఆయన 2014 ఎన్నికల సమయంలో అధ్యక్ష పదవిలో కొనసాగకుండా చేయగలిగారు. బీజేపీలో జరిగిన ఈ అంతర్గత కుట్ర కారణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేసి నరేంద్ర మోదీ ప్రధాని కాగలిగారు. 2014 ఎన్నికలలో భాజపా ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎవరు ఉండాలనే ప్రశ్న తలెత్తిన సమయంలో పారికర్ పేరు కూడా ప్రముఖంగా వచ్చింది. అయితే ఆయన ప్రధాని పదవి కోసం ఆరాట పడకుండా తానే స్వయంగా చొరవ తీసుకొని, గోవాలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశాలలో మోదీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటింప చేయడంలో నిర్ణయాత్మక పాత్ర వహించారు. తానే ఆయన పేరును ప్రతిపాదించారు.
కేంద్రంలో రక్షణ మంత్రి వంటి కీలక పదవిని వదులుకొని గోవా వంటి చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరూ తిరిగి రారు. రక్షణ మంత్రిగా క్రియాశీలకంగా పనిచేసింది జార్జ్ ఫెర్నాండెజ్ తర్వాత పారికర్ మాత్రమే అని చెప్పవచ్చు. మన ఆయుధ సంపత్తిని అత్యాధునికం చేయడం కోసం, సైనికుల సామర్ధ్యాలను పెంపొందింప చేయడం కోసం, వారి సంక్షేమం కోసం పారికర్ ఎంతో చొరవ తీసుకున్నారు. కేంద్ర బడ్జెట్‌లో సుమారు మూడవ వంతు నిధులను రక్షణ శాఖకు కేటాయిస్తారు. రక్షణ ఉత్పత్తుల కోసం భారీ నిధులు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆయన ఆయుధ వ్యాపారుల ఏజెంట్లకు అసలు అందుబాటులో ఉండేవారు కాదు. భాజపా నేతలలో ఈ ఏజెంట్లకు సన్ని హితులైన వారిని సహితం తన మంత్రిత్వ శాఖ విషయాలలో జోక్యం చేసుకోనిచ్చే వారు కాదు. ఢిల్లీలో వారాంతరంలో ఉంటే ఏదో పార్టీలలో, సామా జిక ఉత్సవాలలో వారిని కల వాల్సి వస్తుందని గోవాకు వచ్చి వెళుతూ ఉండేవారు.
ఒకసారి హ్యాంగ్‌కాంగ్‌లో జ రిగే సెమినార్‌కు పారికర్ వెడుతున్నారని తెలుసుకొని, ఆయనను కలిసే అవకాశం ఉంటుందని పలువురు ఆయుధ వ్యాపార దళారులు కూడా సెమినార్‌లో పాల్గొనడానికి తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే పారికర్ చివరి క్షణంలో తన పర్యటనను రద్దు చేసు కోవడంతో వారంతా నిరుత్సాహ పడ్డారు. యూపీఏ హయాంలో రక్షణ మంత్రిగా పనిచేసిన ఏకై ఆంటోనీ నిజాయతీపరుడే కానీ ఎక్కడ చిక్కుల్లో పడతానో అనే భయంతో ఒక్క ఫైల్‌ను కూడా క్లియర్ చేస్తుండే వారు కాదు. ఎటువంటి నిర్ణయాలు తీసుకొనక పోవడంతో పదేళ్ళపాటు మన సైన్యం తుపాకీ గుండ్లు వంటి ఆయుధ పరికరాలు కూడా లేక ఎన్నో ఇబ్బందులకు గురైంది. రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంపై ఇటీవల ఎన్నో వివాదాలు చెలరేగుతున్నా, రక్షణ మంత్రిగా గతంలో పనిచేసిన పారికర్‌ను ఎవరూ తప్పుపట్టలేక పోతున్నారు.
రక్షణ మంత్రిత్వ శాఖతో సంబంధం లేకుండా ప్రధాన మంత్రి కార్యాలయం ప్రత్యామ్నాయంగా బేరసారాలు సాగించినట్లు, తద్వారా దేశానికి నష్టం కలిగినట్లు ఆరోపణలు రావడం గమనార్హం. రక్షణ మంత్రిగా ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించినా, నిర్ణయాత్మకమైన పాత్ర వహించినా అసహనంగా ఉండటం కారణంగానే గోవా ముఖ్యమంత్రి పదవి చేపట్టే అవకాశం రాగానే ఆ సాకుతో గోవాకు పారికర్ తిరిగి వచ్చిన్నట్లు పలువురు భా విస్తున్నారు. అయితే, తన కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఇబ్బంది కలిగించే విధంగా ఒక్క మాట కూడా మాట్లాడనే లేదు. ఒక్క అడుగు కూడా వేయలేదు.
26 ఏళ్లకే సంఘ చాలక్ బాధ్యతలు చేపట్టిన ఆయనను విలక్షణమైన ప్రజా నాయకుడు అని చెప్పవచ్చు. ఎంతటి ప్రజాదరణ గలవారైనా కొంతకాలం పదవులలో ఉంటె వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంటారు. కొన్ని విమర్శలకు గురవుతూ ఉంటారు. పదవులను ఒక బాధ్యతగా భావిస్తూ రావడంతో ఆయన ఏ పదవిలో ఉన్నా ఎటువంటి ప్రతికూలతను ప్రజల నుండి ఎదుర్కొననే లేదు. నిష్కామ కర్మ వలే తన బాధ్యతలను నిర్వహించారు.
ఆరెస్సెస్‌లో ఓ సాధారణ ప్రచారక్‌గా పనిచేసిన పారికర్ దేశ రక్షణమంత్రి స్థాయి వరకూ ఎదిగారు. అనిశ్చిత రాజకీయాలకు పేరొందిన గోవాలో- ‘పక్కింటి అబ్బాయి’ ఇమేజ్‌తో రాష్ట్రానికి నాలుగు సార్లు ముఖ్య మంత్రిగా ఎన్నికయ్యారు. బీజేపీలోనే కాకుండా ఇతర పార్టీల అభిమానాన్ని కూడా చూరగొన్న నాయకుడాయన. కాంగ్రెస్ పార్టీకి చాలాకాలం పాటు కంచుకోటగా ఉన్న గోవాలో బీజేపీని ఒక శక్తిగా నిర్మించింది పారికరే. దేశంలో మరెక్కడా లేని విధంగా క్రైస్తవ ప్రజలను బిజెపికి దగ్గరకు తీసుకు వచ్చారు.
రక్షణమంత్రిగా ఉన్నప్పుడు జమ్మూ కశ్మీర్‌లోని ఉరిలో ఉగ్రదాడి జరగగానే 2016లో భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో నిర్వహించిన లక్షిత దాడులకు ఆయనే సారథ్యం వహించారు. ఆయన పర్యవేక్షణ సైనికాధికారులకు కూడా స్ఫూర్తి కలిగించింది. ఈ సందర్భంగా అసాధారణ ప్రజ్ఞా పాటవాలను, ఒక బృందం నేతగా నాయకత్వ సామర్ధ్యాన్ని ప్రదర్శించారు. ఈ దాడులకు ప్రేరణ ఆరెస్సెస్‌లో తాను విన్న బోధనలేనని ఆయన అప్పట్లో తెలిపారు. పారికర్ ప్రోత్సాహంతోనే తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ను భారత వైమానిక దళంలో చేర్చారు. రక్షణరంగంలో దేశీరుూకరణను సులభతరం చేసేందుకు పారికర్ అనేక చర్యలు తీసు కున్నారు. నేటి రాజకీయాలలో చాలా అరుదైన, విల క్షణమైన నేత. మన ప్రజా జీవనంలో కనుమరుగవుతున్న అత్యున్నత విలువలకు ఆయన ప్రతీక. నూతన తరం రాజకీయాలు కోరుకొంటున్న దేశ ప్రజలకు నిత్యం స్ఫూర్తిదాతగా మిగులుతారు.

-చలసాని నరేంద్ర 98495 69050