మెయిన్ ఫీచర్

బరువు తగ్గండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొద్దునే్న నిద్రలేచి వ్యాయామం చేస్తానంటారు.. కానీ చేయరు! కొవ్వు పదార్థాలు మానేస్తాననీ చెబుతారు.. కానీ నాన్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు లాగించేస్తారు. వేళకు నిద్రపొమ్మంటే.. కంప్యూటర్లు ముందునుంచీ కదలరు. కూరల్లో కాస్త ఉప్పు తగ్గిస్తే.. ఏంటీ చప్పిడి తిండి అనుకుంటూ.. మిమ్మల్ని మీరే కోప్పడతారు. కానీ బరువు తగ్గడానికి ఎన్ని చిట్కాలు ఉన్నాయో అన్నీ చెప్పేస్తారు.. కానీ మీరు వాటిని పాటించరు. ఇలా ఊరికే మాట్లాడేబదులు.. బరువు తగ్గే ప్రయత్నం నేను ఎందుకు చేయను? అని మీకు మీరు ఆలోచించుకుంటే.. బరువు తగ్గచ్చు. అందంగా మారచ్చు.. దానికి ఏం చేయాలంటే..
పెళ్లికి ముందు ఫిట్‌గా ఉండాలి, అందంగా కనిపించాలి, పిడికెడు నడుము కూడా ఉండకూడదు.. అని అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఆలోచిస్తారు. దానికి సంబంధించి తీసుకునే జాగ్రత్తలు, పాటించే నియమాలు చాలా ఉంటాయి. తీరా పెళ్లయ్యాక ఉద్యోగం, కుటుంబం, పిల్లలు, ఆలస్యంగా పడుకోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం.. అన్నీ కలిపి బరువును పెంచేస్తాయి. అవే క్రమంగా అనారోగ్యాలు, వైవాహిక జీవితంలో సమస్యలు తెచ్చి.. మానసిక కుంగుబాటుకు దారితీస్తాయి. కాబట్టి ఇప్పటినుంచైనా బరువు తగ్గడానికి ప్రణాళికలు వేసుకుంటే మంచిది.
* ఇప్పటివరకూ మీ జీవనశైలిలో చేసిన పొరపాట్లన్నీ ఓ జాబితాగా రాసుకోవాలి. ఇకపై చేయాల్సిన నియమాలను కాగితంపై రాయాలి. చేయకూడనివి రెడ్ మార్కర్‌తో కొట్టేసి, చేయాల్సినవి గ్రీన్ మార్కర్‌తో టిక్ చేయాలి. ఈ జాబితాను ప్రతిరోజూ చూసేలా ఒకచోట అంటించుకోవాలి. ఇలా చూడటం వల్ల మెదడులో వ్యాయామం చేయాలన్న స్ఫూర్తి పెరుగుతుంది.
* ముందుగా వ్యాయామం, బరువు తగ్గడం, డైటింగ్ వంటి మాటలను మనసులోంచి తీసేయాలి. ప్రతిరోజూ చిన్నారుల్లా మారి ఈత, సైక్లింగ్, టెన్నిస్, బాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ వంటివి ఆడొచ్చు.
* రోజూ ఎంత హడావుడి ఉన్నా ఎంతో కొంత సమయం ఇలా గడపడం వల్ల ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుంది. మానసికంగా కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది.
* యోగా, ఏరోబిక్స్, వాకింగ్.. ఇలా రకరకాలుగా ప్రయత్నించొచ్చు. ఇంటి దగ్గరలోని పార్కుకో, మైదానానికో నడకకు వెళ్లొచ్చు. తాడాట ఆడొచ్చు. గోడకుర్చీలు వేయొచ్చు. స్క్వాట్స్ ప్రయత్నించొచ్చు.
* నిపుణుల్ని సంప్రదించి బరువు తగ్గడానికి ఎలాంటి నియమాలు పాటించాలన్నది ఓ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఆహార నియమాలు, చేయాల్సిన వ్యాయామ ప్రక్రియ గురించి రాసుకోవాలి. అలా పాటించాలి.
* ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. ఉదయం తప్పనిసరిగా అల్పాహారం తీసుకోవడం మొదలుపెట్టాలి.
* రోజూ ఒకే రకమైన వ్యాయామ సాధనలు కాకుండా ఒకరోజు నడక, మరోరోజు జాగింగ్.. ఇలా రోజూ వ్యాయామ సాధనలో కొత్తదనం ఉండేలా ప్రణాళిక వేసుకోవాలి. ఆ ప్రకారమే వ్యాయామం చేయాలి.
* బరువు తగ్గడానికి పూర్తిగా కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. మాంసకృత్తులూ, పిండిపదార్థాలను శరీరానికి అందించాలి. పిండిపదార్థాలు అంటే అన్నం, బ్రెడ్ నుంచి అందేవి కాకుండా సంక్లిష్ట పిండిపదార్థాలు ఎంచుకునేలా చూసుకోవాలి. అంటే బ్రౌన్‌రైస్, తృణధాన్యాలు, ఓట్స్ వంటి వాటితో చేసిన పదార్థాలు అన్నమాట. వీటని మితంగా తీసుకోవాలి. వీటిల్లో పీచు ఉండటమే కాదు.. అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.
* మాంసాహారం దూరంగా పెట్టాల్సిన పనిలేదు కానీ పరిమాణం తగ్గించాలి. బదులుగా మీల్‌మేకర్, స్కిన్‌లెస్ చికెన్‌ను ఎంచుకోవచ్చు.
* తీపి పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతాయి. అందుకే మిఠాయిలను ఎంత తగ్గిస్తే అంత మంచిది. బదులుగా తేనె, తాజా పండ్లు, ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష వంటివాటిని తీసుకోవచ్చు. వీటితో చేసిన స్వీట్లు కూడా ఆరోగ్యానికి మంచిదే..
* హోటళ్లు, రోడ్డుపై ఉండే ఆహారాన్ని పూర్తిగా దూరం పెట్టేయాలి. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. పండ్ల రసాలకు బదులు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి. కీరదోస, క్యారెట్, బీట్రూట్, టోఫూతో సలాడ్లు చేసుకుని తినడం మంచిది. నూనె, ఉప్పు ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.
* ప్రతిరోజూ అల్పాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి. రాజ్మా, పెసలు, బఠాణి, సెనగలు, గుడ్లు, సోయా, పల్లీలు.. ఇవన్నీ మనం తీసుకునే భోజనంలో తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. వీటిలోని మాంసకృత్తులు శరీరానికి శక్తిని అందిస్తాయి.
* కాఫీ, టీలు తాగినా పంచదారకు దూరంగా ఉండాలి. వాటితోపాటు ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడంలోనే కాదు.. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో కీలకపాత్ర పోషిస్తాయి.