మెయిన్ ఫీచర్

పర్యావరణహిత... ప(వి)త్ర పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎలాంటి విఘ్నాలు కలగకుండా సకల కార్యసిద్ధి కోసం ప్రతి పూజ, శుభకార్యం, వ్రతాలు అన్నీ వినాయకుడి పూజతో ప్రారంభిస్తాం. జ్ఞానం, విద్య, బలం, సమైక్యతలను ప్రసాదించే గణపతిని తనకు ఇష్టమైన ఆకులు, పూలు, పండ్లతో భక్తిశ్రద్ధలతో పూజిస్తాం. మట్టి వినాయకుణ్ణి 21 రకాల పత్రాలతో పూజించి, స్వచ్ఛమైన నీటిలో నిమజ్జనం చెయ్యటమే అసలు సిసలు పండుగ.
1630-1680 మధ్యకాలంలో ఛత్రపతి శివాజీ వినాయకుడి పూజల్ని ప్రారంభిస్తే, ప్రజలమధ్య సమైక్యతను పెంచేందుకు 1893 నుండి లోకమాన్య తిలక్, ఈ ఉత్సవాలను మరింత ప్రాచుర్యంలోకి తెచ్చారు. అనేక రాష్ట్రాలు, దేశాలు ఈ పండుగని జరుపుకొంటున్నాయి. సకల ఔషధ గుణాల్ని తెలియజెప్పే 21 రకాల పత్రాలు వినియోగం వినాయక చవితి పండగకే స్వంతం.

ఈ పత్రాల ఔషధ గుణాలు:

మాచీపత్రం: ఈ పత్రాలు సుగంధభరిత గాలినిచ్చి, గాలి కాలుష్యాన్ని నివారిస్తాయి. ఈ పత్రాలతో ఉబ్బసం, చర్మ, కంటి వ్యాధులు, తలనొప్పిని నివారించవచ్చును.
బృహదీపత్రం (వాకుడు): దీనిలోని చేదుగుణం నీటిలో వుండే క్రిముల్ని చంపేస్తుంది. ఇంకా దంతవ్యాధులు, అజీర్తి, జ్వరం, జలుబు, మూత్రవ్యాధుల్ని తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
బిల్వపత్రం (మారేడు): ఈ చెట్టు ప్రతి భాగమూ ఔషధమే! ఈ గాలిని పీల్చేవారికి దారిద్య్రం, ద్వేషం, ప్రతికూల భావనలు, అమంగళత్వాలు తొలగిపోతాయని యజుర్వేదం చెబుతోంది. కంటివ్యాధులు, జ్వరం, మధుమేహం, కామెర్లు, శరీర దుర్గంధం నివారణకిది దివ్యౌషధం.
దుర్వయుగ్మం (గరిక): అజీర్తి, చర్మవ్యాధులు, గాయాలు, నాసిక సంబంధ వ్యాధు లు, ఉదరకోశ వ్యాధుల నివారణలో వినియోగిస్తారు. గరికలో ఇనుము, విటమిన్లు పుష్కలంగా ఉన్నందున ఇది పశువులకు మంచి ఆహారం.
దత్తూరపత్రం (ఉమ్మెత్త): ఈ మొక్క ఏ భాగమైనా ఉన్మత్త (మత్తు)ను కలిగిస్తుంది. కీళ్ళవ్యాధులు, పేనుకొరుకుడు, శరీర నొప్పులు, తలనొప్పి, శ్వాసకోశవ్యాధుల నివారణకిది దివ్యౌషధం.
బదరీపత్రం (రేగు): చిన్నపిల్లల వ్యాధుల నివారణకు రేగు ఆకులు, పండ్లు దివ్యౌషధమని చెప్పటానికే భోగిపండుగ నాడు పిల్లల తలపై భోగిపళ్ళను పోస్తారు. రాముడికి శబరి కూడా రేగుపళ్ళనే ఇచ్చిందని రామాయణం చెబుతోంది.
అపామార్గపత్రం (ఉత్తరేణి): ఈ చెట్టు పుల్లల్ని హోమంలో వినియోగిస్తే మేఘాలేర్పడి వర్షాలు కురుస్తాయి. జ్వరం, దంతవ్యాధులు, మూత్రపిండాల్లో రాళ్లు అతి ఆకలి, ప్రేవుల్లోని పురుగులు తగ్గటానికి ఈ పత్రాలను వాడతారు.
తులసి పత్రం: అన్ని చెట్లు ఆక్సిజన్‌ని మాత్రమే ఇస్తుండగా తులసి ఓజోన్ వాయువును కూడా ఇచ్చి గాలిని శుభ్రపరుస్తుంది. తులసి మొక్కలు శ్రీమహావిష్ణువుకి చాలా ఇష్టం. ఈ మొక్క వెదజల్లే వాసనలకు పాములు దరిచేరవు. దేవాలయాల్లో ఇచ్చే తులసి తీర్థంలో ఆకులు, గింజల్ని కూడా కలుపుతారు. జలుబు, దగ్గు, కఫం, తుమ్ములు, జ్వరం, మొటిమలు, గొంతు సంబంధ, చర్మ సంబంధ వ్యాధులు, అతిసారం తగ్గటానికి, ముఖ సౌందర్యం, రోగ నిరోధక శక్తి పెరగటానికి కారణమైన తులసిని కలియుగ పారిజాతంగా వర్ణిస్తారు.
చూతపత్రం (మామిడి): ఈ పత్రాల కు ఆక్సిజన్‌ని అధికంగా వెలువరించే గుణం ఉన్నందున ఈ గాలి ని పీల్చిన వారికి మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అందుకే శుభకార్యాల్లో మామిడి తోరణాలను కడతారు. మామిడి ఆకుల పొడి ని, పసుపుతో కలిపి గాయాలను మాన్చవచ్చు. ఈ పత్రాలు రక్తవిరేచనాలు, చర్మవ్యాధులు, నోటిపూత, చిగుళ్ల బాధల్ని తొలగిస్తాయి.
కరవీర పత్రం (ఎర్రగనే్నరు): దీని ఆకులు, కాయలు విషపూరి తం. ఈ ఆకులతో శిరోజాల సంరక్షణ పెంచవచ్చు. ఇవి తేలు, విషపురుగు కాట్లు, కణితలు, దురదలను నిర్మూలిస్తాయి.
విష్ణుక్రాంత పత్రం: ఈ మొక్క నీలిరంగు పుష్పాల బ్రాహ్మివలె జ్ఞాపకశక్తిని వృద్ధి చేస్తాయి. పత్రాలు జ్వరం, జలుబు, ఉబ్బసం నివారిస్తాయి.
దామిడీ పత్రం (దానిమ్మ): ఆకులు, పండ్లు రక్తవృద్ధి, శరీర సౌష్టవం, దంత సౌందర్యాలను పెంచుతాయి. ముక్కునుంచి రక్తస్రావం, గొంతునొప్పి, చర్మవ్యాధులు, కండ్లకలకలు నయమవుతాయి. దానిమ్మ పండు తొక్కల్ని తింటే విరేచనాలు, కడుపునొప్పి మాయమైపోతాయి.
దేవదారుపత్రం: దీని గాలి వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. దీని ఆకుల్ని కాల్చితే అగరువత్తుల ధూపం సువాసన వస్తుంది. ఈ పత్రాలు జ్ఞాపకశక్తి పెరగటానికి, అజీర్తి, ఉదర సంబంధ వ్యాధులు తగ్గటానికి దోహదపడతాయి.
వరువక పత్రం (మరువము): ఈ పత్రాలతో కలిపి మల్లెమాలను కడితే గుభాళింపు రెట్టింపు అవుతుంది. జుట్టు రాలటాన్ని తగ్గించటం, శ్వాసకోశ, చర్మవ్యాధుల్ని తగ్గించటం, ఆకలిని పెంచే ఈ పత్రాలను మరువకండి.
సింధువార పత్రం (వావిలి): ఈ పత్రాలు జలుబు, జ్వరం, తలనొప్పి, పంటినొప్పి, కీళ్ళనొప్పులు, మూర్ఛలు, ప్రసవానంతర బాధల్ని నివారిస్తాయి.
జాజిపత్రం: దీని పూల వాసన దంపతులు ఇద్దరిమధ్య అనురాగాన్ని పెంచుతాయి. జాజికాయ, జాపత్రి తాంబూలం ఆరోగ్యదాయకం. ఈ పత్రా లు కామెర్లు, నోటిపూత, నోటిదుర్వాసన, తలనొప్పిని మటుమాయం చేస్తాయి.
గండకీపత్రం (శీతాఫలం): దీని పండ్లు కాల్షియం, వీర్యం, రక్తం వృద్ధికి దోహదపడతాయి. గింజల పొడి పేలను నివారిస్తుంది. పత్రాలు కఫం, మూర్ఛలు, నులిపురుగుల నివారణకు తోడ్పడతాయి.
శమీపత్రం (జమ్మి): అజ్ఞాతవాసంలో అర్జునుడు గాండీవాన్ని ఈ చెట్టులోనే దాచాడు. దంతవ్యాధులు, అతిసారం, కుష్టునివారణకు ఈ పత్రాలు ఉపయోగకరం.
అశ్వత్థపత్రం (రావి): కంటివ్యాధులు, అతిసారం, కామెర్లు, వాంతులు, మూత్ర సంబం ధ వ్యాధులు నివారిస్తాయి. జీర్ణశక్తి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. రావి, వేప మొక్కలు పక్క పక్కనే వుంటే చాలా పవిత్రంగా భావిస్తారు. వీటి చుట్టూ ప్రదక్షిణాలు చేసినవారికి పిల్లలు పుడతారని నమ్మకం. ఈ ఆకుల్లో పత్రహరితాన్ని తొలగించి అందమైన గ్రీటింగ్స్ తయారుచేస్తున్నారు. రావి పుల్లల్ని హోమాల్లో వాడతారు.
అర్జునపత్రం (తెల్లమద్ది): వీర్యవృద్ధి, థాతుగుణం వృద్ధి, గుండె జబ్బుల నివారణకు దివ్యౌషధం.
అర్కపత్రం (జిల్లేడు): సూర్యభగవానుడికి చాలా ఇష్టం కనుకనే రథ సప్తమినాడు ఈ పత్రాలను తలపై ఉంచి స్నానమాచరిస్తాము. పక్షవాతం, కుష్ఠు, తిమ్మిర్లు, బోద, చర్మవ్యాధుల్ని నివారిస్తాయి జిల్లేడు పత్రాలు.
గణేష్ ఉత్సవాలకులక్ష లు ఖర్చుపెట్టి 21 రకాల మొక్కల్ని పెంచటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. పూజలో చెప్పిన పత్రాలు మినహా మిగతా ఏ పత్రాలనూ వినియోగించవద్దు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో, హానికర రంగుల్ని వాడిన ప్రతిమల్ని పూ జలో ఉంచవద్దు. గణేష్ నిమజ్జనాన్ని కలుషిత, అపరిశుభ్ర నీటిలో చెయ్యవద్దు. బుల్లి మట్టి విగ్రహాలను పూజించి ఇంటివద్దే శుభ్రమైన బక్కెట్ నీళ్ళలో నిమజ్జనం చేద్దాం. ఆయుర్వేద, వృక్షశాస్త్ర విద్యార్థులంతా ఈ 21 పత్రాల తో హెర్బేరియం తయారుచేసుకోవటం, ప్రతిఒక్కరూ వీటిలోవుండే ఔషధ గుణాల్ని తెలుసుకొని, వాటిని వినియోగించుకోవటమే పండగ పరమార్థం.

- ఎ.ఎన్.ఎస్.శంకరరావు