మెయన్ ఫీచర్

నవతరం కోసం వృద్ధనేతలకు విశ్రాంతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయాలలో ప్రజల తిరస్కారానికి గురైనా, పార్టీ అండ ఉన్నంతవరకు విశ్రాంతి తీసు కోవడం నేతలకు దుర్లభం కాగలదు. ఆరోగ్యం సహకరించినంతవరకు క్రియాశీలకంగా ఉం డాలని దాదాపు ప్రతివారు కోరుకొంటారు. దేశచరిత్రలో మొదటి సారిగా 1970వ దశాబ్దం చివరిలో జనతా పార్టీలో పదవుల కోసం కొట్లాటలు శ్రుతిమించిన తరుణంలో 60 ఏళ్లు పైబడిన వారు కొత్తతరానికి అవాకాశం కల్పిస్తూ, తాము తప్పుకోవాలని నానాజీ దేశముఖ్ పిలుపునిచ్చారు. అప్పట్లో బీజేపీ అగ్రనాయకులంతా దాదాపు 50 ఏళ్లకు అటు, ఇటుగా ఉండడంతో వారికి అవకాశాలు మెరుగు పరచడానికి మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్ వంటి వృద్ధ నేతలను తప్పుకోమని సూచిస్తూ నానాజీ ఇలా పిలుపు ఇచ్చారని చాలామంది భావించారు. కానీ, ఆయన 1980లో తనకు 60 ఏళ్లు నిండాయని చెబుతూ రాజకీయాల నుండి నిష్క్రమించి అందరికీ విస్మయం కలిగించారు. అప్పటి నుండి గ్రామీణాభివృద్ధి కార్యక్ర మాలలో నిమగ్నమయ్యారు. నానాజీ ఆనాడు నిజా యతీతో, దూర దృష్టితో అటువంటి పిలుపు ఇచ్చారని అనడంలో ఎవరికీ సందేహం లేదు. 1977లో మొరార్జీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంత్రి పదవులు వద్దని, పార్టీ పని చేస్తామని జార్జి ఫెర్నాండెజ్, రాజ్ నారాయణ్ అంటే ప్రభుత్వం బయట ఉండి, అలజడి సృష్టించడానికి ఎత్తుగడలు వేస్తున్నారని అంటూ వారి మద్దతుదారులే వారి ఇళ్లకు పెద్ద సంఖ్యలో వచ్చి మంత్రివర్గంలో చేరమని వత్తిడి తెచ్చారు. కానీ నానాజీ తనకు మంత్రి పదవి వద్దు, పార్టీ పని చేస్తానని అంటే పదవిని త్యాగం చేస్తున్నారని ప్రజలు కొనియాడారు.
మన నేతలు ఎంత నిజాయతీతో వ్యవహరిస్తున్నారో ప్రజలకు బాగా తెలుసు. ప్రజలకన్నా తాము తెలివి గల వారిని, వారిని మాయమాటలతో మోసం చేయవచ్చని నేతలు అనుకొంటే పొరపాటే. ఇప్పుడు బీజేపీలో 75 ఏళ్లు నిండిన సీనియర్ నేతలను ఎన్నికలలో పోటీ చేయవద్దని స్పష్టం చేస్తూ, వారిని పోటీకి దూరంగా ఉంచాలని సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దేశ రాజకీయాలలో ఇది నూతన ఒరవడిని ఏర్పర్చినట్లు కాగలదు.
ఇందిరా గాంధీ ప్రధాని పదవి చేపట్టిన కొత్తలో ప్రభుత్వంలో ఆమె పట్టును స్థిర పరచడం కోసం కామరాజ్ ప్లాన్ పేరుతో సీనియర్ నేతలను మంత్రివర్గం నుండి తప్పించారు. ఆ ప్లాన్ నిజాయతీతో జరిగిందని చె ప్పలేము. అందుకనే ఇప్పుడు బీజేపీలో వృద్ధ తరాన్ని తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నూతన విలువల కోసం చేస్తున్నారా? సంకుచిత రాజకీయ కారణాలు ఉన్నాయా? అన్నది ప్రాధాన్యత సంతరింప చేసుకొంటోంది. భాజపా ఏర్పడిన కొత్తలో అందులో ఉద్దండులైన నేతలు ఉన్నారు. వారంతా తమ తమ రంగాలలో కీర్తి ప్రతిష్టలు పొందిన వారే. వాజపేయి, విజయరాజే సింధియా, భైరాంగ్ సింగ్ షెకావత్, ఎల్‌కే అద్వానీ, శాంత కుమార్, మదన్ లాల్ ఖురానా, శంకర్ సింగ్ వాఘేలా వంటి వారున్నారు. పార్టీని, పార్టీ ద్వారా ఏర్పడే ప్రభుత్వాలను తమ చెప్పు చేతలలో ఉంచుకోవడానికి ప్రజాబలం గల నేతలను దారి తప్పించి, భజన పరులను వాజపేయి, అద్వానీ ప్రోత్సహించారు. ఆ విధంగానే ప్రమోద్ మహాజన్, అరుణ్ జైట్లీ, సుష్మ స్వరాజ్, వెంకయ్య నాయుడు, అనంత్ కుంకుమార్ తదితరులను జాతీయ నేతలుగా చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా అద్వానీ అండతో ముఖ్యమంత్రి పదవి చేపట్టి, పార్టీలో కీలక నేతగా ఎదిగారు. సొంత నియోజకవర్గాలు కూడా లేని నేతలతో పార్టీ బలాన్ని పెంచుకోలేదని గ్రహించి, ప్రజా బలం గల నేతలను ప్రోత్స హించాలని మొదటగా గుర్తిం చింది గోవిందాచార్య. ఆయన వ్యూహంలో భాగంగానే కళ్యాణ్ సింగ్, ఉమాభారతి. య డ్డ్యూరప్ప వంటి నేతలు ఎది గారు.
ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్ సింగ్, మధ్యప్రదేశ్‌లో ఉమా భా రతి, ఢిల్లీలో ఖురానా, గుజరాత్ లో వాఘేలా ప్రజలలోకి చొ చ్చుకు పోవడం ద్వారా భా జపాను అధికారానికి దగ్గ రగా తీసుకు వచ్చారు. అయితే నిజంగా బీజేపీకి కేంద్రంలో అధికారం వచ్చే సరికి వారె క్కువకాలం కొనసాగలేక పో యారు. ఢిల్లీ పెద్దల చెప్పు చేతలలో ఉండేవారికి పట్టం గట్టారు. మోదీ ప్రధాన మంత్రి పదవి చేపట్టగానే 75 ఏళ్లకు పైబడిన వారికి మంత్రి పదవులు, పార్టీలో పదవులు లేవంటూ అద్వానీ, మురళి మనోహర్ జోషి, శాంత కుమార్ వంటి వారిని దూరంగా పెట్టడం సంచలనం కలిగించింది. ఇప్పుడు వారెవ్వరికీ లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వడం లేదు. వారిని పక్కన పెడుతున్న పద్ధతి ఏ విధంగా ఉంది? పార్టీలో అంతర్గతంగా సమాలోచనలు జరిపి ఏకా భిప్రాయంతో జరిపారా? అన్న విషయాలను పక్కన బెడితే- ఒక తరం నుండి మరో తరానికి పార్టీలో, ప్రభు త్వంలో బదలాయింపు జరపడం అత్యవసరం అని గుర్తించాలి. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడంతో నిజాయతీని శంకించ వలసి వస్తుంది. కర్ణాటకలో 70 ఏళ్ల యడ్డ్యూరప్పను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా చేయడం ఎటువంటి సందేశం ఇస్తుంది? కళ్యాణ్ సింగ్ వంటి వారు గవర్నర్ పదవులలో కొనసాగటం గమనార్హం.
పార్టీలో సీట్లు కేటాయింపులో స్థిరమైన విధానం లేకపోవడం, ప్రజాస్వామికంగా అంతర్గత చర్చలు లేక పోవడం అభిలషణీయం కాబోదు. ఉదాహరణకు కాంగ్రెస్‌లో జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నవారు, అంతకు ముందు జరిగిన ఎన్నికలలో ఓటమి చెందిన వారు సీట్లకు దూరంగా ఉండవలసిందే. కానీ బీజేపీలో ప్రత్యక్ష ఎన్నికలలో ఓటమి చెందిన పలువురికి కీలక పదవులు కట్టబెడుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు.
వాజపేయి ప్రధాని పదవి చేపట్టిన సమయంలో ఆర్థిక శాఖను చేపట్టగల నేత లేరు. అద్వానీని తీసుకోమంటే ఆయన భయపడ్డారు.జస్వంత్ సింగ్‌కు ఆ శాఖ అప్పచెప్పాలని ప్రధాని భావిం చారు. ప్రత్యక్ష ఎన్నికలలో ఓటమి చెందిన ఆయనను మంత్రి వర్గంలోకి తీసు కోవడానైకి వీల్లేద ని సంఘ్ పరివార్ హుకుం జారీ చేసింది. కానీ ఎన్నికలలో ఓటమి చెందిన అరుణ్ జైట్లీని ఆర్థిక మంత్రిగా తీసుకొంటే ఎవరూ అభ్యంతరం చెప్ప లేదు. కర్ణాట కలో బిజెపిని అధికార పార్టీగా చేయడంలో యడ్డ్యూ రప్పతో పాటు విశేషంగా పాటు పడిన అనంత కుమార్ వరుసగా ఆరు ఎన్నికలలో గెలుపొందిన సీటును ఆయన మరణంతో సా మాజిక కార్యకర్తగా పేరున్న ఆయన భార్య తేజస్వినికి ఇవ్వా లని రాష్ట్ర బీజేపీ ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే, ఆమెను కాదని నియోజకవర్గం సరిహద్దులు కూడా తెలియని 28 ఏళ్ల యువకుడిని దొడ్డిదారిన తీసుకువచ్చారు.
గత ఎన్నికలలో కేవలం ఒక్క సీటు గెల్చుకున్న ఒడిశాలో ఇప్పుడు బిజెపి గాలి వీస్తోంది. కానీ సీట్లు ఇచ్చిన విధానం చూస్తుంటే చేతులారా అవకాశాలను వమ్ము చేసుకొంటున్నారా? అనే అభిప్రాయం కలుగుతున్నది. పశ్చిమ బెంగాల్ లోనూ అభ్యర్థుల ఎంపిక వివా దాస్పదంగా మారింది.
ఒక వంక దేశంలో మోదీ పట్ల విశేష ఆకర్షణ ఉన్నదని, తిరిగి ఆయననే ప్రధాని కావాలని కోరుకొంటున్నారని చెబుతూ, మరోవంక ప్రజా వ్యతిరేకతను ఎదు ర్కొంటున్నారని అంటూ అనేకమంది సిటింగ్ ఎంపీలను సహేతుకత లేకుండా మార్చుతున్నారు. ఓట్లు వస్తే అంతా మోదీ ప్రభంజనం, ఓటమి ఎదురైతే స్థానిక ముఖ్యమంత్రి, ఎంపీలు కారణంగా చెప్పే పరిస్థితి కనిపిస్తున్నది. ప్రజా తీర్పుకు బాధ్యత వహించగల సమర్ధ నాయకత్వం నేడు కనబడటం లేదు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో తిరిగి అధికారంలోకి రాలేక పోయినా కాంగ్రెస్ తో సమానంగా, కేవలం ఒకటి కన్నా తక్కువ శాతం మేరకు ఓట్లు బిజెపికి వచ్చాయి. అందుకు ఆ రెండు రాష్ట్రాలలోని బీజేపీ ముఖ్యమంత్రుల పనితీరు కారణమని భాజపా అధిష్టానంలో ఎవరూ గుర్తించే ప్రయత్నం చేయడం లేదు. నాడు వాజపేయి, అద్వానీ ఏ విధంగా అయితే సొంత నియోజకవర్గం, ప్రజాబలం లేని నేతలకు జాతీయ స్థాయిలో కీలక పదవులిచ్చి ప్రోత్సహించారో, ఇప్పుడు కూడా అటువంటి ప్రయత్నమే జరుగుతున్నది. తమ రాష్ట్రాలలో ప్రజలతో సంబంధం లేని వారే జాతీయ నాయకులుగా ఎదు గుతున్నారు. ఉదాహరణకు ఎన్నికల సందర్భంగా పార్టీ రాష్ట్రాల ఇన్‌ఛార్జ్‌లుగా నియమించిన వారంతా దాదాపుగా రాజ్యసభ సభ్యులో, ఏనాడూ ప్రత్యక్ష ఎన్నికలలో నెగ్గనివారు మాత్రమే. ప్రత్యక్ష ఎన్నికలలో అనుభవం లేనివారిని ఎన్నికల ఇన్ ఛార్జ్ లుగా నియమించడం ఎటువంటి సందేశం ఇస్తుంది?మోదీ మంత్రివర్గంలో కీలక శాఖలను నిర్వహిస్తున్న వారంతా ఇద్దరు, ముగ్గురు మినహా రాజ్యసభ సభ్యులే.
ప్రత్యక్ష ఎన్నికలతో సంబంధం లేని నేతల ప్రాధా న్యతను తగ్గించనిదే, ప్రజల నుండి వచ్చిన నేతలను ప్రోత్సహించనిదే పార్టీకి ప్రజాబలాన్ని పొందడం అసాధ్యం. మధ్యప్రదేశ్‌లో గత 30 ఏళ్లలో ఒక్కసారి కూడా తాము గెలుపొందని భోపాల్, ఇండోర్ వంటి సీట్లను భాజపా నుండి కైవసం చేసుకొనేందుకు ది గ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా వంటి సీనియర్ నేతలను నిలబెట్టాలని కాంగ్రెస్ ఆలోచిస్తున్నది. బీజేపీ సీనియర్ నేతలు ఎవరైనా ఇలాంటి సాహసం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? గతంలో విజయరాజే సింధియా ఇందిరా గాంధీపై, సుష్మ స్వరాజ్ సోనియా గాంధీపై, బంగారు లక్ష్మణ్ పివి నరసింహారావుపై పోటీ చేశారు. బీజేపీలో ప్రత్యక్ష ఎన్నికలు దూరంగా ఉంటేనే మంచి గుర్తింపు వస్తుందనే నానుడి ఉంది. అద్వానీ, సుష్మ స్వరాజ్ వంటి వారు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేస్తున్నా వారికంటూ సొంత నియోజకవర్గం లేదు. పార్టీకి బలంగా ఉన్న నియోజకవర్గం చూసుకొని పోటీ చేసి గెలు స్తున్నారు.
ఈ సందర్భంగా ఓ సీనియర్ బీజేపీ నాయకుడి మాటను ప్రస్తావించాలి. తాను ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేసినంత కాలం రాష్ట్ర స్థాయి నాయకుడిగా పరిమి తమయ్యానని, ఎన్నికలకు దూరమయ్యాక జాతీయ స్థాయి నేతనై కీలక పదవులు పొందగలిగానని చెప్పారు. ప్రజాబలం కన్నా ఢిల్లీ నేతలు అనుగ్రహం నేడు బీజేపీలో అవసరంగా కనిపిస్తుంది. సీట్ల కేటాయింపు తీరు ఆ విషయం స్పష్టం చేస్తుంది. సొంత నియోజకవర్గాల వైపు నేతలను ప్రోత్సహించడం ద్వారా బిజెపి మరింత బలోపేతం కాగలదు. అప్పుడే ప్రజాబలం ఉన్న నూతన తరం పార్టీకి నాయకత్వం వహించగలదు.

-చలసాని నరేంద్ర 98495 69050