మెయిన్ ఫీచర్

ఆరోగ్యవంతులే విజ్ఞానవంతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవ్వరి జీవితమైనా సంతోషంగా గడిచిపోవాలి. కానీ ఎన్నో ఆలోచనలతో మెకానికల్‌గా గడిచిపోతున్నాయి అనేకంటే గడిపేస్తున్నారంటే బాగుంటుందేమో! టెక్నికల్‌గా ఒక ప్లాన్ ప్రకారం సాఫీగా సాగిపోవడం, మెకానికల్‌గా అంటే స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలిగినట్లు అయిపోతున్నాయి జీవితాలు. ఏదో మూసధోరణిలో సాగిపోతున్న పరిస్థితులు. ఇపుడు చదువంటే కేవలం పుస్తకాల్లోని విషయ పరిజ్ఞానమే అయిపోయింది. మరి అవే పుస్తకాల్లోని జ్ఞాన సముపార్జనలో ఎన్నో నూతన ప్రయోగాలు చేస్తున్నారు. అది నిజమే అయినప్పటికీ, ఒక్క పుస్తక పరిజ్ఞానమే కాదు, ఆటలు, పాటలు, సంగీతం, సాహిత్యంలాంటివి ఎన్నో ఉన్నాయి.
ఒక్కొక్క కళలో ఒక్కొక్కరు నిష్ణాతులుగా మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించవచ్చు. చరిత్రలో నిలిచిపోవచ్చు. పుస్తకాలు చదవడంవల్ల వివేకవంతులు అవుతారు. మంచి ఉద్యోగాలు సంపాదించి జీవితంలో స్థిరపడవచ్చు. చదువువల్ల మెదడు పదునుగా తయారవుతుంది. మెదడుకు, నరాల వ్యవస్థకు మంచి వ్యాయమం జరుగుతుంది. చురుకుగా ఉంటారు పిల్లలు. కానీ పిల్లల శరీరానికికూడా వ్యాయామం కావాలి కదా! అంటే ఎక్స్‌ర్‌సైజ్‌లు, కరాటే, స్పోర్ట్స్, గేమ్స్‌తో పరిచయం, ప్రావీణ్యం ఉండాలి. చెస్, కారెమ్స్‌లాంటి ఆటలవల్ల మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆటగాళ్ళున్నారు వీటిలో.. ఇంకా రన్నింగ్, లాంగ్‌జంప్, హైజంప్ మిగతావాటివల్ల శారీరకంగా, కాళ్లు, చేతులు, నడుము, వివిధ
భాగాలు- వాటిల్లోని కండరాల వ్యవస్థ పటిష్టంగా ఏర్పడుతుంది. ఇక సంపాదన విషయానికి వచ్చినట్లయితే ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరుతోపాటు ఆర్థిక వెసులుబాట్లు లేకపోలేదు.
ఒక మేధావిగా విద్యార్థి చదువుకని శాస్తవ్రేత్త అయితే, కొత్తగా ఏదైనా ప్రయోగం చేసి దేశానికి సేవ చేసినవాడవుతాడు. ఒక ఆటగాడు దేశం తరఫున ప్రపంచ దేశాలతో పోటీపడి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయగలడు. వీరిద్దరూ దేశానికి సేవ చేసినవారే. కాబట్టి చదువు విజ్ఞానమే కాదు ముఖ్యం. దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చూసే పొరుగుదేశాలు భారతీయులను కాపాడ్డానికి సైన్యం, పోలీసులు శారీరకంగా బలంగానే ఉంటేనే కదా! కాబట్టి పిల్లలకు జ్ఞానంతోపాటు వ్యాయామం, ఆటలు పాటలు, కళలలో తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ఇపుడు మనల్ని మనం శత్రువులనుండి కాపాడుకోవడానికి శారీరక దృఢత్వం అవసరం. ఈరోజుల్లో అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలు అరికట్టడానికి పాఠశాలలోనే కరాటే, వ్యాయామాలు నేర్పిస్తున్నారు. కొన్నికొన్ని సందర్భాలలో స్వీయ రక్షణకు ఇవి పనికివస్తాయి. భారతదేశ చరిత్రలో వేదాలతోపాటు సంగీతం, సాహిత్యం, యుద్ధవిద్యలు అన్నీ నేర్పించబడినట్లు తెలుస్తుంది. కర్రసాము, కత్తిసాము అనాదిగా వస్తున్న సంప్రదాయాలు. ఆచార సంప్రదాయాలకు వీటిని అన్వయించుకోకుండా చరిత్రను గుర్తుచేసుకోకుండా మనం మాట్లాడుకోలేం. కాబట్టి విజ్ఞానంతోపాటు శారీరక దృఢత్వం తప్పనిసరి. వీటిల్లో దేని విలువ దానిదే. పరిపూర్ణ ఆరోగ్యవంతుడు తాను అనుకున్నదేన్నైనా సాధించగలడు. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఏనాడో చెప్పారు. పూర్తి ఆరోగ్యం వున్న పిల్లలే గొప్ప విజ్ఞానవంతులు, మేధావులు కాగలరు!

-శ్రీనివాస్ పర్వతాల 9490625431