మెయిన్ ఫీచర్

తొలి పండుగవేళ.. తెలుగమ్మాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పండుగ వేళల్లో.. ముఖ్యంగా ఉగాది వంటి తెలుగు సంవత్సరాది రోజున పట్టు పరికిణీలు చాలా బాగుంటాయి. అలాగని ప్రతీసారి పట్టు కట్టాలన్నా, కొనాలన్నా ఇబ్బంది. అదీకాక ఇటీవల ఫ్యాషన్ వేగం పెరిగిపోయింది. ఈ రోజు కొత్తగా ఉన్నది రేపటికి అది బోరైపోతుంది. ఒక ఫంక్షన్‌కి వేసుకున్నది మరో వేడుకలో ధరించాలంటే నేటి తరం అమ్మాయిలకు తగని చిరాకు. అదే కుర్తీ, లెగ్గింగ్ వంటివైతే.. నాలుగు లెగ్గింగులకు, ఓ పది టాప్‌లు ఉంటే వాటినే అటు మార్చి, ఇటు మార్చి ఒకదానికొకటి విభిన్నంగా కనిపించేలా వేసుకోవచ్చు. ఎందుకంటే.. ఎప్పటికప్పుడు కొత్త లుక్‌లో కనిపించాలి అనేది నేటి యూత్ ట్రెండ్. హెయిర్‌స్టైల్, యాక్సెసరీలు, నగలతో కొంత తేడా తీసుకువచ్చినా లాభం లేదు. డ్రెస్సు ఒకసారి వేసుకున్నదే కదా.. అని నిట్టూరుస్తారు. అలాగని ఎన్ని డ్రెస్సులను కొనగలరు? ఆ సమస్యను కొంతైనా తగ్గించేందుకే అన్నట్లు డిజైనర్లు కొత్తరకం టూ ఇన్ వన్ గ్రాగాచోళీ, పరికిణీ-పైటల్ని, చీరల్ని తీసుకొచ్చేశారు. దాంతో అమ్మాయిలు ఒకే డ్రెస్సుతో రెండు రకాలుగా ముస్తాబైపోతున్నారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అన్నట్లు ఒక డ్రెస్సు ఖరీదుతోనే రెండు డ్రెస్సుల్ని సొంతం చేసుకుంటున్నారు. మళ్లీ మళ్లీ మార్చి మార్చి వేసుకుంటున్నారు. ఇలాంటివే చీరలు కూడా.. ఒక చీర కొంటే రెండు చీరలూ కట్టుకోవచ్చు అంటూ రివర్సబుల్ చీరలతో మగువల్ని ఊరిస్తున్నారు ఫ్యాషనిస్టులు. మార్కెట్లో ఈ చీరల జోరు తెగ పెరిగిపోయింది. ఒకసారి పట్టుబుటాలతో, మరోసారి కుందన్ మెరుపులతో, ఇంకోసారి దారపు పోగులతో, ఈసారి చకీ చమక్కులతో ఎన్ని చినె్నలను పోతుందో నేటి చీర. వయ్యారంగా వంటి పమిటలనీ, సాదాగా కావాలంటే స్టెప్ పెట్టిన పమిటలనీ వేసుకుంటున్నారు నేటితరం అమ్మాయిలు. కాస్త ట్రెండీగా కనిపించాలంటే పల్లూని వెనుక నుంచి ముందుకు వేసుకుని మార్వాడి పమిటలనీ వేసుకుంటున్నారు. పండుగవేళ.. చీరకు మరిన్ని సింగారాలుంటాయి. ఈ అందాలకు మరింత ఆకర్షణలను జోడిస్తూ కట్టు చెంగుకు పమిట చెంగులా, పమిట చెంగును కట్టుచెంగులా.. ఇలా ఒకే చీరను రెండు రకాలుగా కట్టుకునే వీలుకల్పించేలా రివర్సబుల్ చీరలు మార్కెట్లో కొలువుతీరాయి. వీటిని రెండురకాలుగా కట్టుకోవచ్చు. వీటిని టూ ఇన్ వన్ చీరలని, రెండు మోడళ్లలో కట్టుకుంటే జత చీరల్లా కనిపిస్తాయి కాబట్టి ట్విన్ శారీస్ అని పిలుస్తుంటారు. చీరలోని ఏ చివరినైనా పమిట చెరుగుగా వచ్చేలా కట్టుకునే వీలుండే ఇవి రెండు, మూడు రంగుల కలబోతగా వస్తున్నాయి. జాకెట్టును మాత్రం చీరను ఏవైపు నుండి కట్టుకున్నా దానికి మ్యాచయ్యేలా వేరువేరుగా.. అంటే రెండు, మూడు రకాలుగా కుట్టించుకోవాలి. అయితే ఏ రంగు ఎక్కువగా ఉంటే.. ఆ భాగాన్ని పమిటగా వేసుకుని, దానికి సరిపడా జాకెట్టు వేసుకునేలా వారే రెండు రకాల జాకెట్లను ఇస్తున్నారు. కాబట్టి ఒకే చీరను రెండుసార్లు మార్చి కట్టుకున్నా, చూసేవాళ్లను రెండు వేర్వేరు చీరల్లానే కనిపిస్తాయి. సిల్క్, జార్జెట్, షిఫన్, కాటన్ వంటి చీరలతో పాటు వర్కు చీరల్లోనే ఈ తరహా డిజైన్లు మెరుస్తున్నాయి. డ్రెస్సుల్లో అయితే జార్జెట్, పట్టు తరహావి ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి ఈ రకం చీరల వల్ల డబ్బు ఆదా అవుతుంది కదా.. ఇంకెందుకాలస్యం.. ఇలాంటి చీరలు, డ్రెస్సులను కొనేయండి మరి!