మెయన్ ఫీచర్

కాంగ్రెస్ భవిత ప్రశ్నార్థకం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి కుంతియా మాకు శనిలా దాపురించాడు’- అని కోమటిరెడ్డి సోదరులు అన్నప్పుడే రాహుల్ గాంధీ జాగ్రత్తపడవలసింది. కాని అలా జరుగలేదు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వృక్షం కుప్పకూలిపోతున్న దృశ్యం కనిపిస్తోంది. డి.కె.అరుణ సహా కొందరు కాంగ్రెస్ నేతలు భాజపాలో చేరారు. గద్వాల ప్రాంతంలో తిరుగులేని ఆదరణ ఉన్న అరుణ చాలాకాలం పాటు వేచి చూసి ఇపుడు కాంగ్రెస్ నుంచి బయటపడి, భాజపా అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. తెరాస హవా ప్రారంభమయ్యాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలహీనం కావటం మొదలయింది. ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు తెరాసలోనో, భాజపాలోనో చేరుతున్నందున ‘వందేళ్ల పార్టీ’ మనుగడ ప్రశ్నార్థకమైంది. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నవారు. ఇప్పుడు ఎందుకు ఆ పార్టీని వీడారు? ఇదంతా టీఆర్‌ఎస్ చేస్తున్న మోసం అని సర్దిచెప్పుకోవడానికి వీలులేదు. సోనియా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన పొంగులేటి సుధాకర్‌రెడ్డి బిజెపిలో చేరడం కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ. సీమాంధ్రలో ఒకనాటి కాంగ్రెస్ నాయకురాలు పురంధ్రేశ్వరి చాలాకాలం క్రితమే భాజపాలో చేరారు. ఇదంతా యాదృచ్ఛికం కాదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనే ఒకనాటి వటవృక్షం కూలిపోతున్నది. భాజపా మాత్రమే ఏకైక జాతీయ పార్టీగా మిగిలింది. మిగతాపార్టీలన్నీ ఆయా రాష్ట్రాలకు పరిమితమైన ప్రాంతీయ పార్టీలే.
***
కేరళలోని వాయనాడ్ ఇటు తమిళనాడును, అటు కర్నాటకను ఆనుకొని ఉన్న ప్రాంతం. ఇక్కడి అడవులలో నక్సలైటు స్థావరాలున్నాయి. ఇంతకాలం ఈ ప్రాంతంలోని ముస్లిం, ఉగ్రవాదుల మద్దతుతో సీపీఎం అధికారంలో కొనసాగుతున్నది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ వేయడంతో ఈ నియోజకవర్గానికి జాతీయ ప్రాధాన్యం లభించింది. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాలు ఇందిరాగాంధీ కాలం నుండి కాంగ్రెస్ పార్టీకి సురక్షితమైన నియోజకవర్గాలు. ప్రస్తుతం యూపీలో పరిస్థితులు మారాయి. అక్కడి సమీకరణలు కాంగ్రెస్‌కు అనుకూలంగా లేవు. ఒకవంక యాదవులు, ముస్లిములు ఏకమైనారు. మరొకవైపు దళితులు, క్రైస్తవులు మాయావతి నాయకత్వంలో బలమైన శక్తిగా మారారు. ఇక బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, బీసీ వర్గాలు భాజపాను నమ్ముకున్నాయి. జవహర్‌లాల్ నెహ్రూ కాలం నుండి కాంగ్రెస్‌ను నమ్ముకున్న సామాజిక వర్గాలన్నీ ఆ పార్టీని వీడటం జరిగింది.
రాహుల్ గాంధీ అమేథీ నుండి లోక్‌సభకు పోటీచేస్తుంటే అక్కడ భాజపా తరఫున కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని మళ్లీ రంగంలోకి దింపారు. అమేథీలో తన గెలుపు పట్ల అనుమానాలు రావడంతో రాహుల్ గాంధీ వాయనాడ్ నుండి కూడా పోటీ చేస్తున్నారు. దీనిని సీపీఎం తీవ్రంగా పరిగణిస్తున్నది. తమ బలమైన నియోజకవర్గాన్ని కాంగ్రెస్ స్వాధీనం చేసుకోవాలని అనుకోవటం- తమపైన యుద్ధం ప్రకటించటమే అని సిపియం అగ్రనాయకుడు ప్రకాశ్ కారత్ హెచ్చరించాడు. రాహుల్‌ను కచ్చితంగా ఓడిస్తామని ఆయన ప్రకటించారు. వాయనాడ్‌లో గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా - కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమి ఇకమీద ‘మహాకూటమి’గా ఉండజాలదు.
***
భాజపాకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమి ఏర్పాటు ఎండమావిగానే కనిపిస్తోంది. తృతీయ కూటమి ఏర్పడితే దానికి తాను ఆధిపత్యం వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశిస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రధాని కావాలని ఆశిస్తున్నది. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఢిల్లీలో చక్రం తిప్పాలని అనుకుంటున్నారు. బిఎస్పీ అధినేత్రి మాయావతి తానే భారత ప్రధాని అని కలలు కంటున్నది. ఇందులో సాధ్యాసాధ్యాలు ఎంత? వీరిలో ఎవరు చక్రం తిప్పగలరో కాలమే నిర్ణయిస్తుంది. ఏ విధంగా చూసినా రాహుల్ గాంధీ రాజకీయ జీవితం ప్రశ్నార్థకమయింది. ఇది కాంగ్రెస్ పార్టీకి శుభసూచకం కాదు. ఇప్పటికీ పంజాబ్, కర్నాటక, పుదుచ్చేరి ప్రాంతాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. మధ్యప్రదేశ్‌లో మళ్లీ పుంజుకుంది. రాజస్థాన్‌లో మంత్రివర్గం ఏర్పాటు చేసింది. ఈ దశలో రాహుల్ గాంధీ నాయకత్వానికి సవాలు ఎదురవుతున్నది. ఆయన ప్రధాని కాలేని పక్షంలో పార్టీ నేతలు ప్రత్యామ్నాయ నాయకుడి కోసం అనే్వషణ చేసుకోవలసి ఉంది. అంటే- నాయకత్వం ప్రియాంకా గాంధీ చేతిలోకి వెళ్లిపోతుందా? ఆమెకు అలాంటి శక్తిసామర్థ్యాలు ఉన్నాయా? ‘గాంధీ కుటుంబం’ దాటి కాంగ్రెస్ నేతలు మరొకరిని తమ నేతగా అంగీకరించే స్థితిలో లేరు.
***
‘హిందూ ఉగ్రవాదం’ అనే పదాన్ని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెరపైకి తెచ్చింది. దీనివల్ల వారికి ముస్లిముల నుండి రాజకీయ మద్దతు లభింపవచ్చునేమో కాని జాతి ప్రయోజనాలపై అశనిపాతం వంటి నినాదమిది. రాహుల్ గాంధీ హిందువుకాడు. ఆయన పరివారం హిందువులు కారు. జ్యోతిరాదిత్య, సచిన్ పైలెట్, దిగ్విజయ్ సింగ్, చంద్రబాబు నాయుడు, దేవెగౌడ రాహుల్‌గాంధీకి మద్దతునిచ్చే ‘మహాఘట బంధన్’ నేతలు. వీరిలో నిజమైన హిందువులు లేరట? మరి హిందువులెవరు? నరేంద్ర మోడీ- అమిత్‌షాలు మాత్రమే హిందువులా? ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది! సరిగ్గా ఇదే మానసిక ధోరణి 1947లో ద్విజాతి సిద్ధాంతానికి దారితీసి భారతదేశాన్ని ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లుగా విడగొట్టింది. ఈ పనిచేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా కుమారుడు ఒమర్ అబ్దుల్లా తమ రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రధాని, రాష్టప్రతి ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే కశ్మీరుకు భారత రాజ్యాంగం వర్తించదని అర్థం. కశ్మీర్‌లో వేర్పాటువాద నాయకుల డిమాండ్లను ప్రధాని మోదీ తన ఎన్నికల సభల్లో తిప్పికొడుతున్నారు. శరద్ పవార్, దేవెగౌడ, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, మమతా బెనర్జీ ఈ దేశానికి ‘ఇద్దరు ప్రధానమంత్రుల’ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారా? ద్విజాతి సిద్ధాంతకర్త ఫరూఖ్ అబ్దుల్లా తెదేపా తరఫున ఎన్నికల ప్రచారానికి వచ్చారు. జాతి సమగ్రతను ప్రశ్నిస్తున్న ఫరూఖ్‌ను ఏపీకి రప్పించినందుకు చంద్రబాబు నాయుడు బహిరంగ క్షమాపణ చెబుతారా? కేరళలోని ముస్లిం ఉగ్రవాద మెజారిటీ ప్రాంతమైన వయనాడ్ నుండి ఎన్నికల బరిలోకి రాహుల్ దిగారు. దీనికి కాంగ్రెస్ అగ్రనాయకత్వం సమాధానం చెప్పాలి. వీరు ఇస్లామిక్ ఫండమెంటలిజాన్ని బహిరంగంగా సమర్ధించినట్లయింది.
***
ఎన్నికల సమయంలో నాయకులు విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి మాట్లాడతారు. జాతి ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారు. ఓట్లకోసం నానాగడ్డి కరుస్తారు. కర్ణాటకలో ఆదాయపుపన్ను శాఖ అధికారులు జరిపిన దాడిలో భారీగా డబ్బు దొరికింది. ఇందులో జెడిఎస్‌కు చెందిన కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇక తమిళనాడులో ద్రవిడ మునే్నట్ర కజగం పార్టీవారు కోట్లాది రూపాయలు ప్రజలకు పంచడానికి తీసుకొనిపోతూ పట్టుబడ్డారు. ఇలాంటి నేర చరితులకు రాజ్యాధికారం ఇస్తే తమిళనాడు భవిష్యత్తు ఏమవుతుంది?
***
‘అయోధ్యలో రాముడి విగ్రహం పెట్టారు. గుజరాత్‌లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం పెట్టారు. మరి యూపీలోని ప్రతి పార్కులో నా విగ్రహం పెడితే తప్పేమిటి?’ అని బిఎస్పీ అధినేత్రి మాయావతి ప్రశ్నించింది. పురుషోత్తముడు రాముడు, జాతీయ సమైక్యతకు సంకేతం సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్. దేశ విచ్ఛిత్తికి ప్రయత్నిస్తున్న మమత, మాయావతి వంటి నేతల విగ్రహాలు పార్కుల్లో ఎందుకు పెట్టాలి? అదీ ప్రభుత్వ ఖజానా ఖర్చుతో. కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తాను ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటుచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. ముస్లింల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటిస్తే, ముస్లింలకు ఏకంగా బ్యాంకు ఏర్పాటు చేస్తానని ‘నారా’ వారు అంటున్నారు. ఈ ధోరణి దేశ విభజన నాటి పరిస్థితులకు దారితీస్తుంది. ఇంతకు మించిన దేశద్రోహం మరొకటి ఉందా?

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్