మెయిన్ ఫీచర్

భావితరం నాయకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మీరు పాకిస్తాన్ వెళ్లి అక్కడి నేతలను కలిశారు.. వారింట్లో బిర్యానీ తిన్నారు.. వారిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు.. మీరు ప్రపంచమంతా తిరుగుతారు.. కరచాలనాలు, ఆలింగనాలతో విదేశీయుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తారు.. ఈ దేశంలో ఒక్క పేదవాడినైనా ప్రేమతో ఆలింగనం చేసుకొన్నారా..? మీ నియోజకవర్గమైన వారణాసికి ఎప్పుడో వస్తుంటారు.. గత అయిదేళ్లలో ఏ గ్రామానికైనా వెళ్లి ప్రజలను పలకరించారా..? మీరు గొప్ప జాతీయవాదినని చెప్పుకొంటారు.. దీనావస్థలో ఉన్న రైతులు ఢిల్లీ వస్తే- వారికోసం మీ ఇంటి తలుపులు తెరచుకోలేదు.. సామాన్యులు చితికిపోతుంటే బడా పారిశ్రామికవేత్తలను మీరు అక్కున చేర్చుకొంటారు..’
- సాక్షాత్తూ దేశ ప్రధాని మోదీపై ఇలా నిప్పులు చెరుగుతూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న ఆమె ఇపుడు ఎన్నికల ప్రచారంలో ఓ ‘ఫైర్ బ్రాండ్’! దేశ రాజకీయ యవనికపై ఆమె ఇపుడు ఓ సంచలనం.. కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీని విజయపథం వైపు నడిపించేందుకు నడుం బిగించిన ఆమె ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎక్కడికి వెళ్లినా అడుగడుగునా జన నీరాజనం.. కాంగ్రెస్ కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ప్రియాంక గాంధీ వాద్రా (47) పార్టీ ‘స్టార్ క్యాంపయినర్ల జాబితా’లో చోటు దక్కించుకొని ఉత్తరప్రదేశ్ సహా మరికొన్ని చోట్ల ఎన్నికల సభల్లో పాల్గొంటూ ప్రజలను ఉర్రూతలూగిస్తున్నారు.
గతంలో తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ తరఫున రాయబరేలి, అమేథీ నియోజకవర్గాలకే పరిమితమైన ప్రియాంక ఇపుడు పార్టీ కార్యదర్శి హోదాలో మిగతా ప్రాంతాల్లోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ రాష్ట్రాల్లోనూ ప్రచారంలో పాల్గొనవలసిందిగా పార్టీ శ్రేణుల నుంచి ఆమెకు విజ్ఞప్తులు వస్తున్నాయి. ప్రియాంక ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ నుంచి వారణాసి వరకూ గంగానదిలో పడవలో ప్రయాణిస్తూ వినూత్న రీతిలో చేపట్టిన ప్రచారయాత్ర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. కాంగ్రెస్ అధిష్ఠానం అభీష్టం మేరకు ఆమె ఎట్టకేలకు రాజకీయ అరంగేట్రం చేయడం కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆమె ప్రచారం ఫలితంగా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి మెరుగవుతుందన్న విశ్వాసం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది.
ఆదరణ అమోఘం..
ఇన్నాళ్లూ రాయబరేలి, అమేథీ నియోజకవర్గాలకే పరిమితమైన ప్రియాంక పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలన్న కాంగ్రెస్ అభిమానుల ఆకాంక్ష ఇప్పటికి నెరవేరింది. పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ఆమెను ‘బ్రహ్మాస్త్రం’గా సంధించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తూర్పు ఉత్తర ప్రదేశ్ పార్టీ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రియాంక ఎక్కడికి వెళ్లినా అఖండ ఆదరణ లభిస్తోంది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించిన అనంతరం ఆమె ‘ట్విట్టర్’ ఖాతా తెరిచాక కేవలం పనె్నండు గంటల వ్యవధిలోనే లక్షమందికి పైగా ‘్ఫలోవర్స్’ నమోదు కావడం ఓ రికార్డు. ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ రికార్డును వెనక్కి నెట్టేసిన ప్రియాంక ఇపుడు ‘ట్విట్టర్’లో ఓ ఆకర్షణగా నిలిచారు. ‘ఈ శతాబ్దపు ఇందిరా గాంధీగా’, ‘ఐరన్ లేడీ నెంబర్ 2’గా అభిమానులు ఆమెను కీర్తిస్తున్నారు. ఇదే జనాదరణ ఆమె ఎన్నికల సభల్లోనూ, రోడ్ షోల్లోనూ కనిపిస్తోంది.
అచ్చం నానమ్మలా..
బాబ్డ్ హెయిర్, నేత చీరలు, సాదాసీదా అలంకరణ, ముక్కు తీరు, ముఖంపై చెరగని చిరునవ్వు.. ఇవన్నీ చూస్తే ప్రియాంక అచ్చం ఆమె నానమ్మ ఇందిరా గాంధీలానే కనిపిస్తారు. రాజీవ్, సోనియా దంపతులకు 1972 జనవరి 12న జన్మించిన ప్రియాంకపై నానమ్మ ఇందిర ప్రభావం ఎక్కువ. రాజకీయ కుటుంబానికి చెందడంతో ప్రియాంక తన చిన్నప్పటి నుంచి రాజకీయ ఎత్తుగడలను గమనించేవారు. పార్టీలో ప్రముఖ నేతలందిరితోనూ పరిచయాలు ఉండడం, ప్రజలతో మమేకమయ్యే తత్వం, వాక్చాతుర్యం వంటివి ఆమెలోని సానుకూలతలు. ప్రత్యక్ష రాజకీయాల్లో లేనపుడు కూడా ఆమె పార్టీకి సంబంధించి తల్లికి, సోదరుడికి సలహాలు ఇచ్చేవారు. 2004లో తొలిసారిగా రాహుల్ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రియాంక ఒప్పించారు. తల్లి సోనియా అమేథీకి బదులు రాయబరేలి నుంచి బరిలో నిలిచేలా చేశారు.
బౌద్ధంపై ఆసక్తి..
కట్టూబొట్టూలో నానమ్మలా కనిపిస్తూ, నేటి తరానికి ఇందిరమ్మను గుర్తుకు తెచ్చే ప్రియాంక వివాహం అనంతరం బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఢిల్లీలోని జీసస్ అండ్ మేరీ కాలేజీలో మనస్తత్వ శాస్త్రంలో డిగ్రీ చదివిన ఆమె బౌద్ధమత అధ్యయనంలో పీజీ చేశారు. పిన్న వయసులోనే తన స్నేహితురాలి సోదరుడైన రాబర్ట్ వాద్రాను ప్రేమించి, 1997 ఫిబ్రవరి 18న వివాహం చేసుకొన్నారు. తన తండ్రి రాజీవ్ గాంధీ లానే ఫొటోగ్రఫీ అంటే ఆమెకు ఎనలేని మక్కువ. రచనలు చేయడం, చిత్రలేఖనం, రైడింగ్, మార్షల్ ఆర్ట్సులోనూ ఆమెకు ప్రవేశం ఉంది. రాజకీయాల్లోకి రాకముందు కూడా గ్రామసీమల్లో పర్యటిస్తూ, అక్కడి ప్రజలతో మమేకం అవుతూ వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఆమెకు అలవాటు. అందుకే ఆమె వస్తున్నారంటే చాలు పల్లెసీమల్లో కోలాహలం నెలకొంటుంది.
అదో సంచలనం..
తన తండ్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలుశిక్షను అనుభవిస్తున్న నళినీ శ్రీహరన్‌ను 2008లో వెల్లూరు జైలులో ప్రియాంక కలుసుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తండ్రిని చంపిన హంతకురాలిని ఆమె కలుసుకోవడంపై కొందరు ఘాటైన విమర్శలు చేశారు. రాజీవ్ హంతకులపై తనకు మొదట్లో కోపం ఉన్నా, కాలగతిలో అది చల్లారిందని, శాంతి కోసం హింసను విడనాడాలని చెప్పేందుకే తాను అలా కలిశానని ప్రియాంక పేర్కొనడం సంచలనమైంది.
పిల్లల పెంపకంలో..
రాజకీయ చర్చలు, ఎన్నికల ప్రచారంతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన కుటుంబానికి ప్రియాంక ఎప్పుడూ తొలి ప్రాధాన్యం ఇస్తారు. పిల్లల పెంపకంలో ఆమె కఠినంగానే ఉంటారు. పాఠశాలలో పేరెంట్స్ మీటింగ్‌కు ఆమె ఒక్కసారి కూడా గైర్హాజరు కాలేదు. క్రమశిక్షణతో పాటు మమకారాన్ని కూడా ఆమె తమకు అందించారని ప్రియాంక కుమారుడు రిహాన్ (17), కుమార్తె మిరయ (16) చెబుతుంటారు. నానమ్మ ఇందిరా గాంధీ హత్యకు గురైన తర్వాత పాఠశాలకు వెళ్లకుండా ప్రియాంక ఇంటిపట్టునే కొన్నాళ్లు చదువుకున్నారు. తండ్రి రాజీవ్ హత్యకు గురైన తర్వాత తల్లి సోనియాకు అండగా నిలిచారు. సోదరుడు రాహుల్ తనకు ఏకైక ఆప్తమిత్రుడని ఆమె చెబుతుంటారు. రాజకీయాలకు సంబంధించి రాహుల్‌కు సలహాలిస్తుంటారు. పదహారేళ్ల ప్రాయంలో తండ్రి కోసం ఎన్నికల సభలో తొలిసారి ప్రసంగించిన ఆమె ఆ తర్వాత తల్లి, సోదరుడి కోసం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నానమ్మ, తండ్రి నుంచి వారసత్వంగా పట్టుదల, స్థిరత్వం, ఆత్మవిశ్వాసం వంటి లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు. ఈ ‘జూనియర్ ఇందిరమ్మ’ భావితరం నాయకి కాగలదని రాజకీయ పరిశీలకులు అంచనాలు వేస్తున్నారు.

- ఎస్‌ఆర్