మెయిన్ ఫీచర్

మొదటిసారి బరిలో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నికల్లో ఈసారి కొత్తరక్తం ఉరకలేస్తోంది. అసెంబ్లీ స్థానాలతో పాటు లోక్‌సభ స్థానాల్లోనూ ప్రధాన పార్టీల నుంచి సీనియర్ నేతల వారసులు రంగంలోకి దిగారు. మునుపెన్నడూ లేనట్లుగా పెద్దసంఖ్యలో రాజకీయ వారసులు అరంగేట్రం చేస్తున్నారు. కొందరు సీనియర్ నేతలు ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పుకుని తమ వారసులను పోటీకి నిలుపగా.. మరికొందరు మాత్రం తాము పోటీలో ఉండగానే, తమ సంతానాన్ని కూడా ప్రత్యక్ష ఎన్నికల్లోకి తీసుకొచ్చారు. వారిలో అనేకమంది మహిళలు కూడా ఉన్నారు. వారెవరో చూద్దాం..
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి పోటీపడుతున్న గౌతు శిరీషకు ఇవే తొలి ఎన్నికలు. ఆమె తండ్రి గౌతు శ్యామసుందర శివాజీ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే. 2009లో నియోజవర్గాల పునర్విభజన తరువాత పలాస నియోజకవర్గం ఏర్పడింది. అంతకుముందు సోంపేట నుంచి శివాజీ అయిదుసార్లు విజయం సాధించాడు. శివాజీ తండ్రి గౌతు లచ్చన్న కూడా సోంపేట నుంచి అయిదుసార్లు శాసనసభకు గెలిచాడు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న శిరీష.. తన తాత, తండ్రిల వారసురాలిగా తొలిసారి ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఈసారి ఇద్దరు వారసులు తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి అదితి గజపతిరాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమె కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె. అశోక్ విజయనగరం శాసనసభ స్థానం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. రాష్ట్రంలో పలుమార్లు మంత్రిగానూ పనిచేశాడు. 2014లో విజయనగరం నునంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలోనూ మంత్రిగా పనిచేశాడు.
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిరెడ్డి భవానీకి ఇవే తొలి ఎన్నికలు. ఆమె కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమార్తె. భవానీ సోదరుడు రామ్మోహననాయుడు 2014లో శ్రీకాకుళం ఎంపీగా గెలిచాడు. చిన్నాన్న అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేశాడు. భవానీ మామ ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా పనిచేశాడు. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తోట వాణికి కూడా ఇవి తొలి ఎన్నికలు. ఈమె కాకినాడు ఎంపీ తోట నరసింహం సతీమణి. వాణి తండ్రి మెట్ల సత్యనారాయణ గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పోటీ చేస్తున్న షబానా ఖాతూన్ అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కుమార్తె.
బనగానపల్లె జనసేన అభ్యర్థి అరవింద్ రాణి, శ్రీశైలం జనసేన అభ్యర్థి సుజలు ఇద్దరూ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుమార్తెలు. ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీ్ధర్ రెడ్డి కూడా ఇదే జిల్లాలోని నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఎస్పీవై రెడ్డి నంద్యాల లోక్‌సభ స్థానానికి జనసేన నుంచి బరిలో ఉన్నాడు.
లోక్‌సభ అభ్యర్థులుగా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోక్‌సభ అభ్యర్థుల్లోనూ తొలిసారి పోటీచేస్తున్న వారసులున్నారు.
రాజమండ్రి లోక్‌సభ స్థానం టీడీపీ అభ్యర్థి మాగంటి రూప ఎంపీ మురళీమోహన్‌కు స్వయానా కోడలు. ఎంపీ మురళీమోహన్ ఎన్నికల బరి నుండి తప్పుకోవడంతో ఆయన కోడలు మాగంటి రూప పోటీ చేస్తున్నాడు. గతంలో మామకు సహకారంగా ఉన్నా నియోజకవర్గంలో ఆమె మార్క్ ఏమీలేదు. నామినేషన్లకు కొన్ని రోజుల ముందు ఆమె అభ్యర్థిత్వం ఖరారైంది.
అరకు లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి శ్రుతిదేవి తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమె తండ్రి కిశోర్ చంద్రదేవ్ కేంద్రంలో మంత్రిగా పనిచేశాడు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి అరకు లోక్‌సభకు పోటీ చేస్తున్నాడు. దీంతో శ్రుతి తొలి ఎన్నికల్లోనే తండ్రిపై పోటీ చేస్తున్నట్లయింది. రాజకీయాలు శ్రుతికి కొత్తకాదు. ఇరవై ఏళ్లనుంచి కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసింది. అరకు ( ఎస్టీ) పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతోంది. తండ్రికి తాను రాజకీయ వారసురాలిని కాదని, తన తండ్రి పార్టీ మారిన విషయం పేపర్‌లో చూసే తెలుసుకున్నాను అని తెలిపింది శ్రుతి. శ్రుతి మునుపు సామాజిక కార్యకర్తగా, లాయర్‌గా ఇక్కడి ప్రజలకు ఎంతో సేవ చేసింది. విద్య, వైద్యం విషయంలో ప్రభుత్వ సహకారంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. అరకులో మహిళల సమస్యలు ఏమిటో తనకు తెలుసునని, మునుపు తన తండ్రి ఎంపీగా ఉన్న సమయంలో మహిళా సమస్యలపై అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చానని, కానీ నాన్న స్పందించలేదని ఆమె మీడియాకు తెలిపింది. శ్రుతికి ప్రజలతో విస్తృత సంబంధాలు ఉన్నాయి.
నల్గొండ సీపీఎం అభ్యర్థి మల్లు లక్ష్మి.. మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం కోడలు. తెలంగాణా సాయుధ పోరాల యోధుల కుటుంబం నుంచి వచ్చిన మల్లు లక్ష్మి, నల్గొండ లోక్‌సభ ఎన్నికలబరిలో సీపీ ఎం అభ్యర్థిగా నిలిచింది. ఈమె స్వగ్రామం మొల్కపట్నం. భర్త మల్లు నాగార్జున్ రెడ్డి. ఈమెకు ఇద్దరు మగపిల్లలు. మల్లు లక్ష్మి ఐద్వానాయకురాలుగా పనిచేసింది. ఈమె బీఏ, ఎల్‌ఎల్‌బీ చదివింది. మునుపు రాయినిగూడెం ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికైంది.
నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బంగారు శ్రుతి కూడా మొదటిసారి ఎన్నికల్లో పాల్గొంటోంది. ఈమె కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ కుమార్తె.
అనంతపురం పార్లమెంటు స్థానానికి మొదటిసారిగా మహిళా అభ్యర్థి దేవినేని హంస బీజేపీ తరఫున బరిలోకి దిగారు. హంస లాయరు. హైదరాబాదులో ప్రాక్టీసు చేస్తోంది. ప్రజలకు సేవ చేయాలనే వుద్దేశ్యంతోనే హంస రాజకీయాలోలకి వచ్చానని చెబుతోంది.