మెయిన్ ఫీచర్

బాల మేధావులకు ఆలవాలం ఆ ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలంతా అద్భుత చిన్నారులే. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనటానికి నిదర్శనంగా నిలుస్తారు. బహదూర్ వర్మకు పుట్టిన ముగ్గురు పిల్లలు కూడా వయసుకు మించి మేథస్సును సొంతం చేసుకుని కన్నవారి పేరును నిలబెడుతున్నారు. పోనీ తల్లిదండ్రులేమైనా గొప్ప విద్యావంతులా అని అనుకుంటే కనీసం పదవతరగతి పాసైనవారు కూడా కాదు. కాని వారి పిల్లలు మాత్రం లిమ్కా ఆఫ్ బుక్‌లో రికార్డులు నమోదు చేసుకుంటూ తల్లిదండ్రులు ఆనందడోలికల్లో తేలియాడేలా చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే బహదూర్ వర్మ ఉత్తరప్రదేశ్‌లోని రేబార్లే జిల్లా టిలోయ్ అనే కుగ్రామం నుంచి పొట్టచేతబట్టుకుని లక్నోకు వలసవచ్చాడు. అతను చదివింది కేవలం ఎనిమిదో తరగతి మాత్రమే. అతని భార్యకు అక్షరం ముక్క రాదు. బహదూర్ వర్మ లక్నోలోని అంబేద్కర్ యూనివర్శిటీలో అసిస్టెంట్ శానిటేషన్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు ముగ్గురు సంతానం. తమకు చదువులేకపోతేనేమి బిడ్డల్లో దాగి ఉన్న గ్రహణశక్తిని అంచనావేయగల సమర్థులు. తదనుగుణంగా వారిని చదవించేలా తమ వంతు ప్రయత్నం చేశారు. వారిపై ఎలాంటి ఒత్తిడి వేయకుండా వారిలో అంతర్గతంగా దాగి ఉన్న గ్రహణశక్తిని గ్రహించి ప్రోత్సహించారు.
పదహారేళ్లకే పీహెచ్‌డీ..
ఈయన పెద్ద కుమార్తె సుష్మా. ఏడేళ్లేకే 10వ తరగతి పరీక్షలు రాసింది. సుష్మాను ప్రత్యేక కేసుగా పరిగణించి ఆమెను ఏడేళ్లకే పదవ తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చారు. ఈమె లిమ్కా ఆఫ్ బుక్ రికార్డ్స్‌లో తన పేరును నమోదు చేసుకుంది. తదనంతరం బీ.ఎస్సీ పూర్తి చేసి నేడు 16 ఏళ్లకే అంబేద్కర్ యూనివర్శిటీలో పీహెచ్‌డీలో జాయి న్ అయ్యింది. కుమారుడు శైలేంద్ర 14 ఏళ్లకే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ పూర్తి చేసి 24 ఏళ్లకే బెంగుళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు.