మెయిన్ ఫీచర్

విశ్వప్రేమను చాటే అంబేద్కర్ సిద్ధాంతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంబేద్కర్ దళితుల విమోచనానికి ప్రవచించిన సిద్ధాంతాలు నేడు విశ్వవ్యాప్తంగా ఆచరించడం జరుగుతున్నది. ప్రపంచంలో ఏ మూలలోనైనా సరే అణగారిన వర్గాలవారున్నారంటే వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు అంబేద్కర్ సిద్ధాంతాల వైపు ఎదురుచూడ్డం జరుగుతున్నది. అంబేద్కర్ మహాశయుడు జీవించి ఉంటే ఈ పరిణామంపట్ల ఆయన ఎంతగా ఆనందించి ఉండేవారో!
జపాన్‌లో ‘బురకుల’ అణచివేత
అంబేదర్ కాలంనుండి ఇండియా, జపాన్ దేశాలకు చెందిన అణగారిన వర్గాలు తమ విమోచనానికి సన్నిహితంగా కృషిచేయడం జరుగుతున్నది. హిందూ సమాజంలో ఉన్న దళితులకు బౌద్ధమతం తప్ప మరో మార్గం లేదని విశ్వసించిన అంబేద్కర్ 62 ఏళ్ళ క్రిందట 1956 అక్టోబర్ 4న బౌద్ధమతం స్వీకరించారు. మతం మార్పిడి జరిగిన అనతికాలంలోనే అంబేద్కర్ 1956 డిసెంబర్ 6న మరణించారు. ఆయన చూపిన మార్గంలోనే లక్షలాది అనుచరులు బౌద్ధమతం స్వీకరించారు. మరోవైపు కోట్లాది దళితులు హిందూ మతంలోనే ఉంటూ, రాజ్యాంగపరంగా పోరాటం కొనసాగించారు. క్రీ.శ.552లోనే జపాన్‌లో బౌద్ధమతం ప్రవేశపెట్టబడింది.
బౌద్ధమతాన్ని స్వీకరించిన రోజుల్లో జపాన్‌లో అణగారిన ఓ వర్గం బౌద్ధమతాన్ని ఆచరిస్తూనే వివక్షను ఎదుర్కొంది. భారత్‌లోని దళితుల్లాగా జపాన్‌లో వివక్షను ఎదుర్కొంటున్న వర్గాన్ని ‘బురకు’ అని అంటారు. జపాన్‌లో 1603-1867 మధ్యకాలంలో నెలకొన్న కులవ్యవస్థలో ‘బురకు’ సమాజం వెలివేయబడింది. జపాన్ భాషలో ‘బురకు’ అంటే శివారు అని అర్థం. ‘బురకు లిబరేషన్ లీగ్’ మేరకు జపాన్ ప్రజల్లో ‘బురకు’ సమాజం అత్యధిక స్థాయిలో వివక్షను ఎదుర్కొంటున్నది. వారు బహుళ జాతి జపాన్ దేశస్థుల్లో ఒక మైనారిటీ వర్గానికి చెందిన వారుగా పరిణింపబడుతున్నారు. భూస్వా మ్య యుగంలో వెలివేయబడిన కులానికి చెందిన వారుగా వారు గుర్తింపబడ్డారు. వారు జంతుబలి, నేరగాళ్ళకు ఉరితీయడం లాంటి సామాజిక బాధ్యతల్ని నిర్వర్తించేవారు. బౌద్ధం, షింటో మతస్థుల విశ్వాసం మేరకు జన సామాన్యం వారిని కాలుష్య కారకులుగా భావించేవారు. అంబేద్కర్ మరణానికి ఒక దశాబ్దం ముందు ‘బురకు’ నాయకుడు ‘జీచిరోమట్సుమోటో’ అంబేద్కర్‌తో సమావేశమై వారి మధ్య వున్న సమస్యల సారూప్యత, భవిష్యత్ కార్యక్రమాల్ని గురించి చర్చించడం జరిగింది. నేటికీ దళితులు ‘బురకు’లు కలిసి వారి విమోచనానికి కృషిచేయడం జరుగుతున్నది.
యూరప్‌లో పీడిత రోమాలు
తూర్పు యూరప్‌లోని హంగరీ దేశంలో నల్లజాతి రోమాలు దుర్భర వివక్షకు గురి అవుతున్నారు. యూరప్‌లో జిప్సీలని పిలవబడే రోమాలు ఉత్తర భారతదేశం నుండి వలస వచ్చినవారుగా శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతున్నారు.
వీరు తెల్లవారిచే నిరంతరం నిరాకరింపబడి హింసింపబడుతున్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలతో ప్రభావితులైన ‘రోమాల’ నాయకులు జిప్సీలకు సమాన హక్కులకోసం పోరాడుతున్నారు. భారత్‌లో దళితులు, యూరప్‌లో రోమాలు ఎదుర్కొంటున్న వివక్షలమధ్య అనేక సారూప్యతలున్నట్లు వారు కనుగొన్నారు. రోమాలపై చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమకారులు నిరంతరం పోరాటం కొనసాగిస్తున్నారు.

-గుండాల రామకృష్ణయ్య 9849890102