మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని నీటికొఱకై ఇట్టి శ్రమనెంత మాత్రము పడనక్కఱలేని యదృష్టవంతులు కొందఱుందురు. ఎట్లన, వానలువచ్చి వారి పొలమునంతయు చక్కగా నింపును. మాయాబంధమునుండి విముక్తిపొందుటకై ఇంచుమించుగా అందఱును దీక్షతో సాధన చేయవలసియేయున్నారు. కాని కృపాసిద్ధులకీ శ్రమయంతయు అనావశ్యకము. భగవత్కృపచేతనే వారు ముక్తులగుదురు. కాని వీరి సంఖ్య అత్యల్పము!
ఏకాగ్రత: ధ్యానము
594. జపతమములను సదా ఆచరించుచుండవలయును.
595. అన్ని పనులను కట్టిపెట్టి సాయంకాలము నీవు భగవంతుని ధ్యానింపవలయును. సంధ్యాసమయమున సహజముగా భగవద్భావన మనస్సునావరించును. ‘‘కొంతసేపటి క్రిందట సమస్తము దృగ్గోచరమై యున్నది. కాని, ఆహా! ఇంతలోనే సర్వము చీకటిచే ఆవరింపబడినదే! ఇట్లు చేయువారెవ్వరు!’’ ఇట్టి భావములు మనస్సున పొడమును, సాయంకాలమున మహమ్మదీయులెట్లు అన్ని పనులను విడిచిపెట్టి నమాజునకు గూర్చుందురో మీరు చూడలేదా?
596. పొట్లము చినుగ కాఱిపోయి నలుదిక్కులందును చెల్లాచెదరగు నావగింజలను ప్రోవుచేయుట చాల కష్టము. విషయముల వెంటబడి నలుదిక్కులను బరుగెత్తు మనస్సును అంతర్ముఖముచేసి యేకాగ్రము చేయుట బహుకష్టసాధ్యము.
597. ఏ మాఱుమూలనో, నిర్జన ప్రదేశమగు నరణ్యముననో, నిశ్శబ్దమగు నీ హృదయ దేవయలాముననో భగవంతుని ధ్యానింపుము.
598. సాధకుడు ప్రారంభ దశలో ఎప్పుడును ఏకాంత స్థలమునకు బోయి మనస్సునేకాగ్రముచేయ యత్నింపవలయును. లేనిచో నానా విషయములును మనస్సు నాకర్షించి కలవరపెట్టును. పాలకునీటిచేరిక కలిగించినయెడల రెండును కలిసిపోవును. కాని పాలను చిలికి వెన్నగా మార్చితిమేని, అటుల పరిణామము పొందిన పాలు (అనగా వెన్న) ఇక నీటితో గలియుటకు మాఱు నీటిపైన తేలియాడుచుండును. అటులనే నిరంతర సాధనచే చితె్తైకాగ్రతను బొందిన మానవుడెచటనున్నను వానిమనస్సు పరిస్థితులకు లొంగక సదా బ్రహ్మభావమున నిలుకడ కలిగియుండును.
599. తన శరీరమును జూపుచు శ్రీగురుదేవుడు శిష్యులకిట్లు బోధించువాడు. ‘‘్ధ్యనమారంభించుటకు ముందు దీనిని గూర్చి కొంతసేపు భావింపుడు. నేనిట్లు చెప్పుటకు కారణమేమో తెలియునా? మీకు దీని (నా)యందలి నమ్మికచే మీ భావములు దీని (నా)వైపునకు త్రిప్పబడిన పక్షమున వెంటనే భగవంతుని వైపునకు మఱలును. ఇయ్యది ఆవులమంద కాన్పింపగనే ఎవ్వనికైనను ఆలకాపరి తలపునకు వచ్చుట వంటిది; లేదా, కుమారుని జూచినంతనే తండ్రియు, వకీలును జూచినంతనే కోర్టుకు జ్ఞప్తికివచ్చుటవంటిది. వేయి విషయములందు చెల్లాచెదరైయుండు మనస్సు దీనిని (నన్ను) గూర్చి భావించునప్పుడు ఏకాగ్రమగును. అటులేకాగ్రమైనంతనే భగవానుని మీదికి మఱలును, అంత సరియైన ధ్యానము సాధ్యమగును.’’
600. మనస్సును ఏకాగ్రము చేయుటకు దీపముపై నిలుపుట అతిసులభమైన మార్గము; దానికి సరిగా నడుమనుండు నీలి భాగము కారణ శరీరమునకు సరివచ్చును. దానిపై మనస్సును నిలుప యత్నించుటచే ఏకాగ్రతాశక్తి త్వరితముగా అలవడును. దీపమున నీలాంశము చుట్టునుండు తేజోవంతమైన భాగము సూక్ష్మశరీరమును బోలును. దానినావరించుకొనియుండు భాగమే స్థూల శరీరము.
601. శ్రీ గురుదేవుడు తన సాధన దశనుగూర్చి ముచ్చటించుచు శిష్యుల కిట్లు తెల్పువాడు:
- ఇంకాఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి