మెయిన్ ఫీచర్

వికాసం పెరగాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అనంత విశ్వంలో మీ వంటి వ్యక్తి మరొకరు, ఇదివరకు లేరు. అలాగే రాబోయే తరాల్లో ఉండబోరు. మీరు ఒక స్వచ్ఛమైన, అరుదైనవారు. మీలోని ఆ ప్రత్యేకతను ఆనందంగా అనుభవించండి’
- శ్రీశ్రీ
అనే ఆ మహాకవి చెప్పినట్లు మనలో ఉన్న మనోహరమైన ఉనికిని మరొక్కసారి వెలికితీద్దాం! ఒక చంటిపాపను చూస్తే మనమందరం ఎంతగా ఆనందిస్తామో ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం! ఆ చంటిపాప ప్రత్యేకంగా ఏమీ చేయకుండానే మనందరినీ ఆనందపరుస్తుంది. ఈ అనుభూతి ఎటువంటి ప్రత్యేకమైన శ్రమ లేకుండానే మనమందరము గమనిస్తాము. అప్పుడు ఎదుటివారికి మాటల ద్వారా కాకుండా మన ఉనికి ద్వారానే అనుభూతులను తెలియబరుస్తాం. ఇలా సున్నితంగా, హాయిగా బతికేస్తున్నవాళ్లం కాస్తా ఎదిగే కొద్దీ మనకు తెలియకుండానే ఈ విషయాల నుండి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. లెక్కలేనన్ని పాత అనుభూతులతో మనసు మొద్దుబారిపోవడంతో ఉనికిని కోల్పోవడం జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో పూర్వ ఉనికిని, ఆ చంటి పిల్లల మనస్తత్వమైనటువంటి ఆనందాన్ని, సహజతను ఎలా వెనక్కి తీసుకురాగలం. సుదర్శన క్రియలాంటి సులభమైన, శక్తివంతమైన శ్వాస ప్రక్రియల ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ ప్రక్రియలు మన శరీరంతో పాటు మరెన్నో స్థాయిల్లో మనలో నిక్షిప్తమై ఉన్న ఉనికిని, సున్నితత్త్వాన్ని, పాత అనుభూతుల నుండి బయటకు తీసుకురాగలగుతాయి.
విజయ మార్గం
జీవితంలో మనందరం విజయవంతంగా ఉండాలని కోరుకుంటాం. విలాసవంతమైన, ధనవంతమైన జీవితమొక్కటే విజయవంతమైన జీవితం కాదు కదా! శారీరకమైన సమస్యలు ఉంటే మనం ఎంతటి ధనవంతులైతే మాత్రం ఏం ప్రయోజనం? ఈ సందర్భంలో విలాసాలను, ధనాన్ని ఏం చేసుకోగలం? నేటి కాలంలో మన జీవితంలో సగభాగం సమయాన్ని, ధనాన్ని సంపాదించేందుకు ఉపయోగిస్తే, మిగతా సగభాగం సమయాన్ని అదే ధనాన్ని ఖర్చుపెట్టి మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు అవస్థలు పడుతూ ఉంటాం. దీన్ని మనం విజయమనుకుంటే అది పొరబాటు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితిని ఇబ్బందిపడని విధంగా, ఎంతో ఓర్పుతో, సహనంగా, ఆనందంగా ఎలా అధిగమించగలం? అలాగే కష్టమైన ప్రతీ సందర్భాన్ని ఒక అవకాశంగా మలిచి దాన్ని అధిగమించగలిగితే అదే నిజమైన విజయమంటే.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రక్రియలు మనలో ఇలాంటి మార్పులనే తీసుకువస్తాయి.
జీవితంలో మనం ఎంత త్వరగా యోగ, ప్రాణాయామం, ధ్యానం మొదలైనవాటిని తీసుకురాగలమో.. అంతే తొందరగా విజయాలకు నాంది పలకగలం.., అలాగే మనలో ఉన్న ఎంతో శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని వెలికితీయగలం. ఇందుకు ఎన్నో రకమైన పుస్తకాలు, విజ్ఞానం మనకు మనకు అందుబాటులో ఉంది. అయితే వీటివల్ల మనలోని ఉనికి, అనుభూతులు, స్నేహశీలత, అసలైన వ్యక్తిత్వం.. వంటివి వెలికిరావు. ప్రాచీన కాలం నుండి వచ్చిన యోగ, ప్రాణాయామం, ధ్యానం మొదలైన ఉపాయాలను ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రక్రియల ద్వారా మన ఆత్మ, విచారణ శక్తి, సృజనాత్మకత, ఉత్తేజం, మేధస్సును పెంపొందించి వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడతాయి. మన శక్తి సామర్థ్యాలను పెంచి, ఎల్లప్పుడూ చిరునవ్వుతో, ఎలాంటి పరిస్థితులనైనా అధిగమించగల స్థాయికి మనల్ని తీసుకు వస్తుంది. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనల్ని మార్గదర్శకంగా తీసుకునే విధంగా మనల్ని మారుస్తుంది. అందుకే జీవితంలో యోగా, ప్రాణాయామం, సుదర్శన క్రియ వంటివి వ్యక్తిత్వ వికాసానికి ఎంతో ఉపయోగపడతాయి.