మెయిన్ ఫీచర్

ఫలితం .. విశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మకంతో దేనినైనా సాధించవచ్చు. విశ్వాసం తో కొండనైనా ఎక్కగలము. ఆకాశములోను విహరించవచ్చు. మొట్టమొదట మనిషికుండాల్సింది నమ్మకమే. ఈ విశ్వాసము అనేది ఒక్కోక్కరికి ఒక్కోదానిపై ఉంటుంది. సాధారణంగా భక్తులందరికీ భగవంతునిపైన అపార మైన విశ్వాసము, నమ్మకము ఉంటాయి. ఆ నమ్మకంతోనే మనుష్యులు భగవంతుడిని సాక్షాత్కరింపచేసుకొంటారు. తమతో మాట్లాడేటట్లు తాము చెప్పింది భగవంతుడు వినేట్టుగా కూడా పరిస్థితులను మార్చుకుంటారు. మనుష్యుల్లో కొంతమంది భగవంతుడు ఉన్నాడనే విషయానే్న విశ్వసించరు. వారు ఇక భగవంతునితో సానిహిత్యాన్ని ఎలా సాధించగలరు.
విశ్వాసమనేది ఎంత బలమైనది అంటే తులసీదాసు రామభక్తుడు కాకమునుపు అతని భార్యపైన అత్యంత ప్రేమను కనబర్చేవాడట. ఆమెను చూడకుండా క్షణంసేపైనా జీవించలేను అనుకొనేవాడట. అట్లాంటి సమయంలో తులసీ దాసు భార్య పుట్టింటికి వెళ్లింది. ఆమె లేకుండా అతడు ఇంట్లో ఉండడానికి ఇష్టపడక వెంటనే ఆమెను చూడాలని బయలుదేరాడు. అపుడు దారిలో జోరువాన కురియడం మొదలుపెట్టింది. కానీ ఆ వానలో తడుస్తూనే తులసీదాసు అత్తింటికి వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో అక్కడికి చేరేసరికి ఆ ఇంటిలోని వారు అందరూ నిద్రపోతున్నారు. పైగా ఇతడు వస్తాడని వారు ఊహించలేదు. దానితో ఎవరూ తులసీదాసుకు తలుపులు తీయలేదు. తులసీదాసు భార్య పైఅంతస్థులో ఉంటుందనే విషయం తులసీదాసుకు తెలిసినదే. కనుక అతడు పై అంతస్థు చేరడానికి చీకటిలో పై గోడమీద నుంచి ఏదో వేలాడుతుంటే దాన్ని పట్టుకొని ఎక్కి కిటికీలోంచి లోపలికి వెళ్లాడు. ఆయన పట్టుకొన్న దాన్ని తాడు అనుకొన్నాడు.
ఆ అది తాడు కాదు ఒక పాము. పాము అని తెలుసుకొని ఉంటే అతడు దానిని ముట్టుకునేవాడా?
అట్లానే ఒక విషయాన్ని మనిషి ఏవిధంగా నమ్ముతాడో దానిని బట్టి మసలుకుంటాడు. గురువాయూరులో ఒకసారి ఒక పిల్లవాడు అక్కడున్న దేవుని గుడిలో దేవుడు ఎలా ఉంటాడు అని ఓ పూజారిని అడిగాడట. (ఆకాలంలో కొందరికి గుడిలో ప్రవేశం లేదు కనుక) ఆ పిల్లవాడు ఆ విధంగా పూజారిని అడిగాడు. కానీ ఆ పూజారి అహంకారంతో భగవంతుడు అంటే నువ్వు మేపే దున్నపోతు మొహంతో ఉంటాడు రెండు పెద్ద పెద్ద కొమ్ములుంటాయి అని చెప్పాడట.
పాపం ! ఆ పిల్లవాడు నిజంగా భగవంతునికి రెండు కొమ్ములున్నట్లు ఊహించుకుంటూ ఆ విశ్వాసంతోనే మనసులో నిత్యం పూజచేసేవాడు. కొన్నాళ్లకు ఆ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. గర్భగుడిలోంచి భగవంతుడి విగ్రహాన్ని బయటకు తెచ్చి రథంలో పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ భగవంతుని విగ్రహం ద్వారబంధంలో చిక్కుకుని పోయింది. ఎంత ప్రయత్నించినా ఆ ద్వారం నుంచి మూర్తి బయటకు రావడం లేదు.
అపుడు అక్కడికి దగ్గరలో నించుని చూస్తున్న ఆ పిల్లవాడు పూజారులను స్వామి కాస్త దేవుని కిందకు దించండి కొమ్ములు ద్వారానికి అడ్డుకుంటున్నాయి అన్నాడట. పూజారులకు ఏమీ అర్థం కాలేదు. కానీ పిల్లవాడు మరలా మరలా చెప్పినందువల్ల విగ్రహాన్ని కిందకు దింపి వెలుపలకు తీసుకొని వస్తే చక్కగా వచ్చేశాడట.
అక్కడున్న పూజారులు ఈ పిల్లవానిని మరల అడిగి అసలు విషయం తెలుసుకొన్నారు. ఆ దేవునికే పూజారులు రోజూ పూజ చేస్తున్నా ఆ పిల్లవాడు పెంచుకున్న విశ్వాసం మేరకే ఆ దేవుడు కొమ్ములు గలవాడిగా కనిపించి పూజారులకు కనులు తెరిపించాడు. ఇట్లా ఎవరైనా విశ్వాసంతో ఏ పని చేసినా అది పూర్తి ఫలితాన్ని ఇస్తుంది.

- జానకి