మెయిన్ ఫీచర్

ఈ ఊళ్ల్లు ఆడవాళ్లకు మాత్రమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మగవారి చేతిలో ఆడవారికి గృహహింస కొత్తకాదు. ఈనాటిదీ కాదు.. అనాదిగా కొనసాగుతూనే ఉంది. ఆడవారిపై పెత్తనం చేయడం మగవారు హక్కుగా భావిస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనభై శాతం మంది మహిళలు నిత్యం మగవారి చేతిలో హింసకు గురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి పురుషాధిక్య ప్రపంచంలో కొన్ని ఊళ్లు మాత్రం కేవలం స్ర్తిల కోసమే ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మలేరు కదూ.. నిజమండీ.. ఈ పురుషాహంకార సమాజంలో కూడా ఇటువంటి ఊళ్ల్లు ఉన్నాయి. కావాలంటే మీరూ చూడండి..

ఉమోజ
ఉత్తర కెన్యాలోని సంబురులో పచ్చటి వాతావరణంలో ఉంటుంది ఉమోజ అనే ఊరు. మగవారి ప్రవేశం ఇక్కడ నిషిద్ధం. 1990లో బ్రిటిషర్ల చేతిలో అత్యాచారానికి గురైన 15 మంది మహిళలు కలిసి ఈ ఊరిని నిర్మించినట్లు స్థానికులు చెబుతారు. ఈ ఊర్లో అత్యాచారానికి గురైన స్ర్తిలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మగవారి చేతిలో చిత్రహింసలకు గురైన అమ్మాయిలు, వృద్ధులకు అమ్మేసిన అమ్మాయిలు, ఇంట్లోంచి గెంటివేయబడ్డ గృహిణులు ఇలా.. ఏదో ఒక రకంగా వేధింపులకు గురైన అమ్మాయిలకు ఈ ఉమోజ నీడనిస్తోంది. సామాజిక చైతన్యం కలిగిన మహిళలు ఇతర మహిళలకు సామాజిక అంశాలపై అవగాహనను కల్పిస్తుంటారు. ఈ ఊర్లో 50 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నారు. జీవనాధారం కోసం ఇక్కడి మహిళలు పశువులను కాయడం, వ్యవసాయం చేయడం చేస్తుంటారు. వీటితో పాటు ఇక్కడ దొరికే రంగురాళ్లతో రకరకాల ఆభరణాలను, వస్తువులను తయారుచేసి అమ్ముతుంటారు.

చూడండి.. అల్ సమాహా
అల్ సమాహా ఊరిని ఈజిప్టు ప్రభుత్వం నిర్మించింది. ఇది కేవలం వితంతువులకు, విడాకులు తీసుకున్నవారికోసం నిర్మించింది అక్కడి ప్రభుత్వం. పలు అంతర్జాతీయ సంస్థల సహకారంతో అన్నివిధాలా అర్హులైన ఆడవారికి ఈ ఊర్లో ఒక ఇంటితో పాటు ఆరు ఎకరాల భూమిని ప్రభుత్వమే కేటాయిస్తుంది. దీనితో పాటు ఇంట్లో అవసరమైన ప్రతి వస్తువును, వ్యవసాయానికి కావలసిన ప్రతి ముడి సరుకును కూడా ప్రభుత్వమే ఇస్తుంది. ఇక్కడ దాదాపు మూడొందల మంది మహిళలు తమ పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. వారు ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లలో ఉంటూ, వారు ఇచ్చిన భూమిని సాగుచేస్తుంటారు. ఒకవేళ ఈ వితంతువుల్లో, విడాకులు తీసుకున్నవారిలో ఎవరైనా పెళ్లి చేసుకుంటే వారికి ఇచ్చిన ఇంటిని, వ్యవసాయ భూమిని తిరిగి తీసేసుకుంటుంది అక్కడి ప్రభుత్వం. ఎలాంటి ఆసరాలేని ఒంటరి మహిళలు మాత్రమే ఇక్కడ నివసించాలనేది ప్రభుత్వ నిబంధన.

నొయివా డు కోర్డియొరో
నొయివా డు కోర్డియొరో అనేది బ్రెజిల్‌లోని ఓ ఊరు. ఇక్కడ 20 నుంచి 35 సంవత్సరాల వయసుండే ఆరువందల మహిళలు మాత్రమే జీవిస్తున్నారు. గతంలో ఇక్కడ వితంతువులు, అనాథ మహిళలు, పెళ్లికాని ఆడపిల్లలు మాత్రమే ఎక్కువగా ఉండేవారట. ఇక్కడ వీరు పెట్టిన నియమ నిబంధనలకు ఒప్పుకుంటేనే మగవారికి ఈ ఊరిలోకి ప్రవేశం. లేకుంటే లేదు. అది కూడా వీకెండ్స్‌లో మాత్రమే సుమా! మిగిలిన రోజుల్లో ఎక్కడికైనా వెళ్లి పని చూసుకుని అక్కడే ఉండాల్సిందే కానీ ఈ ఊర్లో మాత్రం ఉండటానికి లేదు. ఆఖరుకి సొంత కొడుకులైనా సరే.. వారికి పద్దెనిమిదేళ్లు దాటితే ఊరి నుండి వెళ్లిపోవాల్సిందే..

సూపర్ షీ ఐల్యాండ్
ఈ ఐల్యాండ్ యజమానురాలు పేరు క్రిస్టినారోత్. ఈమె ఒక వ్యాపారవేత్త. ఈమె వ్యాపారం ప్రారంభించక మునుపు పలు ఉద్యోగాలను చేసింది. ఆ సమయంలో మగవారు చేసే వికృత చేష్టలు, బాస్‌ల స్థానంలోని వారి ఆజ్ఞలను పాటించాల్సి రావడం వంటివి ఆమెకు నచ్చలేదట. అందుకే తానే ఒక సంస్థను నెలకొల్పి వ్యాపారవేత్తగా ఎదిగింది. అప్పుడు కూడా ఆమెకు పురుషుల నుంచి అనేక రకాల బాధలు ఎదురయ్యాయి. అంతే ఇక వెనుకా ముందూ ఆలోచించకుండా తాను నెలకొల్పిన సంస్థను అమ్మేసి తనలాంటి మహిళల కోసం ఏకంగా ఓ దీవినే కొనేసింది. ఆ దీవికి ‘సూపర్ షీ ఐల్యాండ్’ అని నామకరణం చేసేసింది. ఇక్కడ మగవారికి నిషిద్ధం. ఇక్కడికి మగవారు ప్రవేశించింది కేవలం దీవి నిర్మాణ సమయంలోనే.. ఈ దీవిలో మహిళలకు యోగా, మెడిటేషన్ వంటి వాటిలో శిక్షణను ఇస్తుంటారు. అయితే ఈ దీవిలో మహిళలకు ప్రవేశం అంత సులభం కాదండోయ్.. ఇది సంపన్న మహిళలకే అందుబాటులో ఉంటుంది. పైగా ఇందులో మహిళల ప్రవేశానికి జరిగే సెలక్షన్స్‌లో కఠిన నియమాలతో పాటు నాలుగువేల యూరోలను చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారట మహిళలు.

జిన్ వార్
సిరియా అంటే ఎప్పుడూ యుద్ధాలు జరిగే ప్రదేశమని అందరికీ తెలిసిందే.. అక్కడ ఎప్పుడూ హింసనే.. అలా యుద్ధంలో వీరమరణం పొందిన సైనికుల భార్యల కోసం ‘జిన్ వార్’ అనే ఊరిని ప్రత్యేకంగా నిర్మించాయి అక్కడి మహిళా సంఘాలు. మహిళలను, పిల్లలను హింస నుండి దూరంగా ఉంచేందుకు కెన్యాలోని ఉమోజ గ్రామాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఊరిని నిర్మించాయి మహిళాసంఘాలు. ఈ ఊర్లో 30 కుటుంబాలు నివశిస్తున్నాయి. ఇక్కడ బడి, జిన్ వార్ అకాడమీ, మ్యూజియం, ఓ ఆరోగ్య కేంద్రాన్ని నెలకొల్పారు. ఈ ఊరిలోకి పురుషులెవరూ రాకుండా పెద్ద గేటు ఉంటుంది. ఆ గేటుకి ఒక మహిళ తుపాకీతో కాపలా కాస్తుంది. ఇక్కడ మహిళలు స్వయంగా వ్యవసాయం, పశువుల పెంపకం చేపడుతూ జీవనం సాగిస్తారు. ఈ ఊరిని మహిళలపై హింసకు వ్యతిరేకంగా నవంబర్ 25న జరుపుకునే అంతర్జాతీయ దినోత్సవం నాడు ప్రారంభించారు. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకూ ఈ ఊరిలోని కుటుంబాలన్నీ ఒకేచోట కూర్చుని, కలిసే చేస్తారు. అదే ఇక్కడి ప్రత్యేకత. మనదేశంలో కూడా ఇలాంటి ఊళ్లు ఉంటే బాగుంటాయి కదూ.. ఆలోచించండి.

కిహ్ను
యూరప్‌లోని బాల్టిక్ నదిలో ఉంది ‘కిహ్ను’ అనే దీవి. ఐక్యరాజ్య సమితి కిహ్నుని మాటలకందని వారసత్వ సంపదగా అభివర్ణించింది. ఇదో అద్భుతమైన దీవి అని, దీని అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవని స్థానికులు చెబుతున్న మాట. కారణం ఈ దీవి నిర్వహణను మహిళలు చేస్తూండటమే.. దాదాపు ఆరువందలకు పైగా ఉండే ఈ ఊరి జనాభాలో మహిళలే ఎక్కువ. పైగా అధికారమంతా మహిళల చేతిలోనే ఉంటుంది. ఇక్కడి మగవారు నెలల తరబడి చేపల వేటకు వెళ్లడం వల్ల పిల్లల ఆలనాపాలనా దగ్గర్నుంచి ఊర్లోని అన్ని విషయాలనూ మహిళలే చూసుకుంటారు. అందుకే ఈ ప్రాంతం అందంగా, సంస్కృతీ సంప్రదాయలతో అలరారుతూ ఉంటుంది.