మెయిన్ ఫీచర్

సాన పెడితే.. సృజనకు గుర్తింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానసిక సామర్థ్యానికి తగ్గట్లుగా యువత తమలో దాగివున్న అంతర్గత శక్తులను వెలికితీస్తూ సృజనాత్మకతకు సానబెట్టాలి. లక్ష్యసాధన కోసం పరితపించే యువత, లక్ష్యాన్ని సాధించాలనే కసిని పెంచుకోవాలి. బాల్యదశ నుండే వినూత్న ఆలోచనలను, సృజనాత్మకతను పిల్లల్లో పెంపొందించే విధంగా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరం తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తించాలి. అరమరికలు లేని బాల్య జీవితాన్ని అనుభవించేలా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎదిగిన పిల్లలు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆల్‌రౌండర్‌గా ఎదగాల్సిన పిల్లలను బందిఖానాలో ఉంచి, యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నారు. వారిలోవున్న సృజనాత్మక నైపుణ్యాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడబోతోంది. విద్యాబుద్ధులలో విద్యకు మాత్రమే ప్రాధాన్యత పెరుగుతోంది. విద్యతోపాటు బుద్ధులకు కూడా సమప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం వుంది. చదువు- సంధ్యలు అనే జంట పదంలో చదువు ఒక్కటి మాత్రమే కనిపిస్తోంది. సంధ్యలు అంటే ఏమిటో కూడా ప్రస్తుత తరానికి తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయామంటే.. ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమస్య పరిష్కారంలో సృజనాత్మకత ఎంతగానో దోహదం చేస్తుంది. సృజనాత్మక ఆలోచనలతో మెదడు పదునెక్కుతుంది.
సృజనాత్మకత నిపుణులు మార్సి సెగల్ భూప్రపంచాన్ని ప్రకాశవంతమైన మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ప్రజలలో సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రపంచ సృజనాత్మకత మరియు ఇన్నోవేషన్ డే ఆలోచనతోముందుకు రావడం జరిగింది. ఆనాటినుండి ఏప్రిల్ 21నాడు ప్రపంచ సృజనాత్మకత మరియు వినూత్న ఆలోచనల దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతోంది.
సెల్‌ఫోన్
సెల్‌ఫోన్ నుండి వచ్చే రేడియో ధార్మిక కిరణాల నుండి పిల్లల బ్రెయిన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. పిల్లల్లో సృజనాత్మకశక్తి, ఆలోచనా శక్తి, తెలివితేటలు, మెమొరీ మందగిస్తాయి. ఏకాగ్రత సన్నగిల్లుతుంది. ఆత్మవిశ్వాసం లోపించడంతో పాటుగా కోపం, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరిగే అవకాశం వుంటుంది. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడం, పిల్లలకు జీవితంపట్ల భరోసాను కల్పించడంపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.
విద్యాలయం
పాఠశాల విద్య నుంచి విశ్వవిద్యాలయం వ రకు అత్యంత కీలకమైనది సృజనాత్మక ఆలోచనలను కలిగించడం. ప్రతి మనిషికీ మెదడులో పాజిటివ్ ఆలోచనలతో పాటు నెగెటివ్ ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి.
పాజిటివ్ ఆలోచనలతో వ్యక్తి సంతృప్తిగా జీవిస్తాడు. పాజిటివ్ ఆలోచనలతోటే సృజనాత్మక ఆలోచనలు పదునెక్కుతాయి. పాజిటివ్ ఆలోచనలతో మనిషి శక్తివంతుడిగా తయారై సృజనాత్మక ఆలోచనలు, వినూత్న ఆలోచనలతో ముందడుగు వేస్తారు. అంతర్గతంగా చురుకుదనం పెరుగుతుంది. పాఠశాల దశ నుంచి విశ్వవిద్యాలయం దశ వరకు విద్యార్థుల్లో సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యతను ఇవ్వాలి. అపుడే దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకువెళ్లి ప్రపంచ అగ్రభాగాన ఉంచిన వాళ్లమవుతాం. ఉపాధ్యాయులు విద్యార్థి దశలో సృజనాత్మక, వినూత్న ఆలోచనలను మెదడునందు నాటుకుపోతే దేశానికి ఉపయోగపడే శాస్తవ్రేత్తలుగా ఎదుగుతారు.
అద్భుతాలు
యువత వినూత్న ఆలోచనలకు పదునుపెడితే అద్భుతాలు సృష్టించడానికి ఆస్కారం
ఉంటుంది. విద్యార్థి దశనుండే పిల్లలు ఈ అంశంపై దృష్టి సారిస్తే దేశానికి ఉపయోగపడే మంచి శాస్తవ్రేత్తలుగా తయారవుతారు. విద్యార్థి దశ నుండే పిల్లల దృష్టిని పరిశోధనలపైకి మళ్లించి వారిని బాల శాస్తవ్రేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉండాలి. సృజనాత్మకంగా ఆలోచిస్తేనే అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రతి ఒక్కరిలో నిగూఢంగా ఎంతో మేధో సంపత్తి, సృజనాత్మకత దాగి ఉంటాయి. వాటికి పదునుపెట్టి వెలికితీస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.
పోటీ ప్రపంచంలో..
ప్రస్తుతం వున్న పోటీ ప్రపంచంలో మేటిగా నిలవాలంటే సృజనాత్మక ఆలోచనలను (క్రియేటివ్ థింకింగ్) పెంచుకోవాలి. రోజంతా చదువుతూ మనసును యంత్రంలా మార్చుకోకుండా ఎప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో పదునుపెడుతూ ఉండాలి. సరదాగా మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే వాతావరణంలో మనసులో వినూత్న ఆలోచనలను వచ్చేటట్లు చేయవచ్చు.
మనలో వున్న మంచి గుణాలమీద దృష్టిని ఉంచాలి. మన గురించి మనం ఎప్పుడూ తక్కువ అంచనా వేసుకోకూడదు. పెద్ద ఆలోచనలు చేసేవారు ఏవిధంగా మాట్లాడుతూ ఉంటారో ఆ విధంగా మాట్లాడటానికి ప్రయత్నించాలి. ఆనందాన్ని ఇచ్చే మాటలను మాట్లాడుతూ, నవ్వుతూ, నవ్విస్తూ.. విజయాన్ని, సంతోషాన్ని అందించే మాటలను ఉపయోగిస్తూ ఉండాలి. చిన్న చిన్న విషయాల గురించి ఆలోచిస్తూ మనసును పాడుచేసుకోకూడదు. ధ్యాసను పెద్ద పెద్ద లక్ష్యాలపై కేంద్రీకరించాలి. చిన్న చిన్న విషయాలపట్ల.. ఇది మనకు ఎంతవరకూ ప్రయోజనకరంగా ఉంటుందనే తనకు తానుగా ప్రశ్నించే ఆలోచన చేయాలి. పెద్దగా ఆలోచించాలి, పెద్దగా ఎదగాలి. సృజనాత్మక కలిసిన వినూత్నమైన ఆలోచనలతో వున్నత ఆశయాలతో అత్యున్నత స్థానానికి ఎదుగుతూ ఇతరులకు స్ఫూర్తిగా ఉండాలి.

- డా॥ అట్ల శ్రీనివాస్‌రెడ్డి 9703935321