మెయిన్ ఫీచర్

అందాల దుపట్టా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరికిణీకి ఓణీ..
చుడీదార్‌కి చున్నీ..
పంజాబీకి దుపట్టా..
ఇలా పేర్లు ఎన్నో.. దుస్తులు ఎలాంటివైనా సరే వాటికి దీటుగా దుపట్టా ఉండాల్సిందే.. అలాగే దుపట్టాలు ఎంత కొత్తగా వచ్చినా సరే.. ఇవి అన్నిరకాల దుస్తులపైకీ నప్పవు. వీటిని కూడా దుస్తులను అనుసరించే ఎన్నుకోవాల్సి వస్తుంది. క్రాప్‌టాప్, పలాజో, చుడీదార్, పంజాబీ, పటియాలా, గాగ్రా.. ఇలా వస్తశ్రైలి ఏదైనా దుపట్టా ప్రత్యేకంగా ఉండాల్సిందే.. అది జాలువారే జార్జెట్‌దైనా, షిఫాన్‌దైనా, బెనారస్‌దైనా, పట్టుదైనా, ఇకత్‌దైనా.. ఇలా ఏదైనా సరే.. ఆ వస్తశ్రైలికి తగ్గట్టుగా దుపట్టా కూడా ప్రత్యేకంగా ఉండాలి. నేటి ట్రెండ్‌ను అనుసరించి బెనారస్, పట్టు, ఇకత్, పటోలా, బాందినీ, ఆర్గంజా వంటి రకాలకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా బెనారస్, కంచిపట్టులదే సందడంతా..
* చూడచక్కని రంగులు, మెరుపులతో నిండుదనాన్ని తెస్తాయి బెనారస్, పట్టు దుపట్టాలు. వీటిని పొడవాటి గౌన్లు, క్రాప్‌టాప్‌లపైకి వేసుకోవచ్చు.
* మడమ వరకు ఉండే చుడీదార్‌కు కూడా బెనారస్ దుపట్టాలు చాలా బాగుంటాయి.
* చందేరీ పట్టురకాల్లో టిష్యూ, గళ్లు ఇప్పుడు సందడి చేస్తున్నాయి. వీటిని ప్లెయిన్ సిల్క్, రా సిల్క్ వంటి డ్రెస్సులపైకి, ఎలాంటి డిజైన్లు లేని ప్లెయిన్ డ్రెస్‌లపైకి కూడా ఈ చున్నీలు బాగుంటాయి.
* చుడీదార్‌లపైకి కలంకారీ దుపట్టాలు చాలా బాగుంటాయి. చాలామంది వీటిని ప్రయత్నించరు. ఇవి చుడీదార్‌లకే కాదు పరికిణీ ఓణీలుగా కూడా బాగుంటాయి. కావాలనుకుంటే కలంకారీ దుపట్టాపై ఆప్లిక్ వర్క్ చేయించుకోవచ్చు. దేవతామూర్తుల ముఖాలను ప్యాచ్‌వర్క్‌గా కూడా చేయించుకోవచ్చు. ఇవి జార్జెట్ చుడీదార్, అనార్కలీలపైకి బాగుంటాయి.
* గాగ్రా, పరికిణీ ఓణీలపైకి అన్నీ కాకుండా ధూపియాన్ సిల్క్ దుపట్టాలు కొత్త అందాన్ని తెస్తాయి. కావాలనుకుంటే వీటిపైకి బ్లాక్ లేదా స్క్రీన్ ప్రింటింగ్ కూడా వేయించుకోవచ్చు. ఇంకా భిన్నంగా, కొత్తగా కావాలనుకుంటే వీటికి కట్‌వర్క్, అద్దాలు, త్రెడ్ వర్క్‌లను కూడా ఎంచుకోవచ్చు.
* పరికిణీలపైకి రెండు అంచులుంటే పట్టు ఓణీలు అతికినట్లు సరిపోతాయి. ఇలాంటప్పుడు జాకెట్టు మోచేతివరకూ కుట్టించుకోవాలి. లేదంటే డ్రెస్ మొత్తం ఎలాంటి డిజైనూ లేకుండా ఉండి.. చేతుల వరకు గళ్లు పెట్టించుకుని ఈ ఓణీని వేసుకోవచ్చు.
* గళ్ల డిజైన్ ఉన్న దుస్తులపైకి ఇకత్ చున్నీలు చాలా బాగుంటాయి.
* క్రాప్‌టాప్‌లు, గాగ్రాలపైకి డిజైన్, వస్తశ్రైలిని అనుసరించి నెట్ చున్నీలు బాగుంటాయి.
* ప్లెయిన్ చుడీదార్‌పైకి డిజైన్ చేసిన దుపట్టాలు కానీ, అద్దాల దుపట్టాలు కానీ అందాన్నిస్తాయి.