మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

661. ఉత్తమ సాధువు తన మనస్సులో ముప్పాతిక భాగము భగవానునకర్పించును. మిగిలిన నాల్గవవంతు మాత్రమే ఐహిక విషయములందుంచును. ఇతర భాగములన్నింటియందుకంటెను తోకయందే తన ప్రజ్ఞ కేంద్రీకరింపబడియున్నదో యనునటుల, ఎవ్వరైనను తోకను త్రొక్కినంతనే పాము బస్సుమనును. అట్లే సాధువు భగవద్విషయమునందెక్కువ మెలకువ గలిగియుండును.
662. శ్రీరామకృష్ణునుద్దేశించి ప్రఖ్యాత బ్రాహ్మ సామాజిక ప్రచారకుడొకరు పరమహంస వట్టి పిచ్చివాడనియు, ఒకే విషయముపై విధివిరామములు లేని చింతన యాతని మనోవైకల్యము గల్గించెనని ఐరోపా దేశపు విజ్ఞానులలో గూడాననేకులకు ఈ గతియే పట్టెననియు జెప్పసాగెను. అనంతరము శ్రీగురుదేవుడీ ప్రచారకుని సంబోధించుచునిట్లు సమాధానమొసగెను. ‘‘ఒకే విషయమునుగూర్చి నిరంతర చింతనచేయుటవలన ఐరోపా పండితులకు గూడ మతిపోయెననియా మీరు చెప్పుచున్నారు? సరి, వారు చింతించుచుండిన విషయము ఐహికమా, ఆముష్మికమా? ఐహికమైన పక్షమును దానిని గూర్చి నిరంతర యోచనచేయువారు పిచ్చివారగుటలో ఆశ్చర్యమేమున్నది! కాని దేని దివ్య తేజముచే జగమంతయు భాసించుచున్నదో అట్టి చిద్రూపమును గూర్చి ఆముష్మికమునుగూర్చి చింతన చేయుటవలన నరుడు ప్రజ్ఞనెట్లు కోల్పోవును? మతిమాలినవాడెట్లగును? ’’
663. భగవద్భక్తి సాగరమున నిమగ్నుడవు కమ్ము. భయపడకుము. నేనొకప్పుడు నరేంద్రునితో నిట్లంటిని: ‘‘్భగవానుడు అమృతసాగరము. ఆ సాగరమున నీవు నిమగ్నుడవు కాగోరవా? పంచదార పానకముతో నిండిన బిందె కలదనుకొనుము, నీవొక మక్షిక మనుకొనుము. నాయనా! అపుడు నీవెట్లా పానకమును గ్రోలెదెవు?’’ - నరేంద్రుడు తానందు పడిపోయినచో మునిగిపోవుట నిశ్చమున కావున అంచుపై వ్రాలి త్రాగుదననియెను. అంత నేనిట్లంటిని: ‘‘ఇది యమృత సాగరమోయి! ఇందు మునిగినవారికి మరణ భయమెక్కడిది? సచ్చిదానంద సాగరము అమృత సాగరమను మాట మఱవకుము. అమృతసాగరమను భగవానునియందమిత భక్తి వలదనువారవివేకులు. వారివలెనే నీవు భయమందకుము. ఈ అమృత సాగరమున నిమగ్నుడవు కమ్ము!’’
భక్తుడు: సంసారము
664. దేవకీ దేవికి చెఱసాలలో శ్రీకృష్ణ దివ్యదర్శనప్రాప్తి కలిగినను అది యామెకు చెఱనుండి విముక్తిని గల్గింపజాలక పోయెను.
665. పవిత్రమైన గంగాస్నానముచే ఒకప్పుడొక గ్రుడ్డివాడు పాప విముక్తుడైనను వాని గ్రుడ్డితనము మాత్రము పోలేదు.
666. కట్టెలు కొట్టునొక భక్తుని కొకప్పుడు అల జగజ్జనని ప్రత్యక్షమై వానిననుగ్రహించెను. కాని వానికి కట్టెలుకొట్టు వృత్తిమాత్రము తప్పలేదు. ఎప్పటివలెనే కట్టెలుకొట్టుకొని యమ్ముకొనుచు కష్టజీవనము చేయుచుండెను.
667. అంపశయ్యపై మరణమునకై వేచియున్న భీష్మదేవుని కన్నులనుండి బాష్పములు కాఱుచుండెను. అంతనర్జునుడు శ్రీకృష్ణునితో నిట్లుపల్కెను: ‘‘బావా! ఏమిది! మా తాతగారు (్భష్ములు) నిత్యసత్యవ్రతులు, జితేంద్రియులు, బ్రహ్మజ్ఞాన సంపన్నులు, స్వయముగా అష్టవసువులలో నొకరుగదా; ఆయన కూడ అవసానకాలమున మాయలోబడి కన్నీరు విడుచుచున్నాడే!’’ శ్రీకృష్ణ భగవానుడంత భీష్మునకీ విషయము దెలుప భీష్ముడిట్లు వచించెను: ‘‘కృష్ణా! నేను అందులకు విలపించుట లేదని నీకు పూర్తిగ దెలిసినదే. ‘ఎవ్వని పావన నామస్మరణమువలన నరులు సమస్త కష్టములనుండియు తరింతురో అట్టి భగవంతుడే స్వయముగా పార్థసారథియై పాండవ పక్షము నవలంబించినను వారికష్టములకంతము లేకున్నది గదా!
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి