మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వము భగవదనుగ్రహముపై నాధారపడియున్నది. వాని యనుగ్రహము పొందదలచెదవా, నీవేకర్మ మొనర్చినను మనఃపూర్వకముగా నొనర్పుము, భగవంతుని బొందవలయునను పరితాపముతో నొనర్పుము. వాని కృపవలన నీ పరిస్థితులనుకూలపడగలవు; సాక్షాత్కారమునకు వలయు స్థితిగతులేర్పడగలవు. నీవు సన్న్యసింపదలచియుండ, కుటుంబము నీపై నాధారపడియుండ, బహుశః నీ సోదరుడు ఆ భారమును వహించును. నీ భార్య నీకు అడ్డము వచ్చుటకు బదులు నీకు తోడ్పడవచ్చును. లేదా, నీవు వివాహమే చేసికొనక పోవచ్చును. అపుడు నీకు సంసార బాధ్యతయేయుండదు. అంతయు దైవానుగ్రహము!
675. శతాబ్దములకొలది గది నావరించియున్న చీకటి దీపము వెలిగించినంతనే మటుమాయమగుచున్నది. కోట్లకొలది జన్మములలో జేసిన పాపములు భగవానుని కరుణాకటాక్షమొక్కటి ప్రాప్తించినంతనే పటాపంచలై పోవుచున్నవి.
676. కొన్ని చేపలకు చాలవరుసల యొముకలుండును, మఱికొన్నిటికి ఒకే వరుస యెముకలుండును. అవి హెచ్చుగా నున్నను తక్కువగా నున్నను చేపలను దినువారు మాత్రము వానినన్నిటిని తీసిపాఱవేయుదురు. అటులనే కొందఱి పాపములు విశేషముగానుండును. మఱికొందఱివి కొలదిగానుండును. కాని రుూశ్వరానుగ్రహము సకాలమున వానినన్నిటిని తొలగించి నరులను పాపవిముక్తులనుజేయును.
677. మలయమారుతము వీచునప్పుడు చేవగల చెట్లన్నియు మంచిగంధపు జెట్లుగా మాఱునందురు. చేవలేని బొప్పాయి, వెదురు, అరటి మొదలగునవి మార్పుచెందక యథాప్రకారముగనే యుండును. అటులనే ఈశ్వరానుగ్రహము లోకమునకు ప్రాప్తించునపుడు సౌజన్యపుణ్యాంకురములు గలవారు శీఘ్రముగా మహనీయులగుదురు- భక్తులగుదురు. ఇక నిర్భాగ్యులగు విషయాసక్తులు మాత్రము ఎట్టిమార్పును జెందక ఎప్పటివలెనే యుందురు.
678. ఒక పుణ్యాత్ముడు జపమాల త్రిప్పుచు భగవన్నామస్మరణ చేయుచుండెడివాడు. శ్రీగురుదేవుడాతని కిట్లనియె: ‘‘ఒకే తావును (సాధనను) అంటిపట్టుకొని యుండనేల? ముందునకు సాగిపొమ్ము.’’ ఆతడు, ‘‘అందులకు భగవదనుగ్రహము కావలయునుగదా!’’ అనియెను. అంత శ్రీగురుదేవుడాతనికిట్లు బోధించెను: ‘‘్భగవదనుగ్రహమను మారుతము అహర్నిశము నీ శిరస్సుమీదుగా వీచుచునేయున్నది. సంసార సాగరమును శీఘ్రముగా తరింపగోరెదవేని నీ మనస్సను నౌకయొక్క తెరచాపలను విప్పుము.’’
679. ఈశ్వరానుగ్రహమను గాలి సర్వదావీచుచునేయున్నది. సోమరులై సంసార సాగరమున బడియుండువారు దాని లాభమునుబొందరు. కాని కార్యదక్షులు, బలాఢ్యులు నగువారు తమ మనస్సను తెరచాపను నిండారవిప్పుకొని, ఆ యనుకూలవాయువును గ్రహించి శీఘ్రముగా పరమావధిని బొందుదురు.
680. ప్రశ్న: ఆకస్మికముగానేమియు సిద్ధింపదా?
ఉ. ముక్తినొందుటకుముందు సర్వసాధారణముగా అందఱును దీర్ఘకాలము సాధన చేయవలసియేయున్నారు. ద్వారకనాథ బాబు ఒక్కసారిగా ‘హైకోర్టు జడ్జి’కాలేదు, ఆ పదవిని బొందుటకు ముందాయన అనేక సంవత్సరములు కష్టపడి పనిచేసెను-శ్రమపడి చదువుకొనెను. అట్లు శ్రమకోర్వనిచ్చగింపనివారు కక్షిదారులు లేని ‘‘బల్లదండుగ ప్లీడరు’’లై యుండుటకు సిద్ధపడవలసినదే! ఐనను భగవదనుగ్రహముచే అకస్మాత్తుగా అభ్యుదయము నొందుటయు గలదు. కాళిదాసు విషయమిట్టిది. సరస్వతీదేవియను గ్రహమున పరమ పామరస్థితినుండి యాతడొక్కసారిగా భారతదేశ కవీశ్వరుడనిపించుకొను స్థితినిబొందెను.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి