మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

681. ఒక గృహస్థ భక్తుడు: దేవా! మీరు భగవంతుని జూచితిరని వినియున్నాము. కావున మమ్మనుగ్రహించి మేము కూడ భగవంతుని జూచునట్లు చేయుడు. ఆ భగవానుని చెలిమి సంపాదించుటెట్లు?
ఉ. సర్వము ఈశ్వరేచ్ఛననుసరించి నడచును. భగవద్దర్శనము నొందుటకై సాధన చేయవలయును. కేవలము చెఱువుగట్టున గూర్చుండి, ‘‘ఈ చెఱువులో చేపలున్నవి, ఈ చెఱువులో చేపలున్నవి’’అని యఱచుటచే చేపలు చేచిక్కునా? వానిని బట్టుటకు వలయు పరికరములను సంపాదింపుము,- గాలపు జువ్వ, దారము, ఎర-వీనిని దెచ్చి ముందు చేపల నాకర్షించు నాహారము నీటిలో చల్లుము. అంతట లోతుననున్న చేపలు పైకి వచ్చును. అప్పుడు నీవు వానిని పట్టుకొనవచ్చును. ఏ ప్రయత్నమును చేయక మీరూరక కూర్చుండియుండనన్ను మీకు భగవంతుని జూపింపుమని యడుగుచున్నారా! పెరుగుతోడుపెట్టి, వెన్న చిలికి మీనోటికి అందీయవలయునా! చేపను బట్టుకొని మీ చేతిలో బెట్టవలయునా! ఎంత విపరీతముగానున్నది మీ కోరిక!!
682. నడిసముద్రమున బోవు నోడ తెరచాపకొయ్య మీద నొక పక్షి వాలియున్నదనుకొనుడు. అది యచట చాలసేపు కూర్చుండుటకు విసుగుచెందును; మఱియొక తావును వెదకుటకై యెగిరి వెడలును; దేనిని గానక, ఎంతయో అలసిసొలసి తుదకు పూర్వపు ఓడకొయ్యనే చేరును. అట్లే సామాన్య సాధకుడు తన శ్రేయోభిలాషియు, అనుభవశాలియునగు గురువు విధించు శిక్షణమును సాధనలను సాగింప విసుగు చెందును; నిరాశుడగును, గురువునందు విశ్వాసము కోల్పోవును; ఇక స్వప్రయత్నముచే భగవంతుని గనుగొందమను ఆశతో ఎందెందో తిరుగాడును; ఎంతయో వృథాయత్నము చేసి, తుదకు తన పూర్వపు గురునియొద్దకు - ఆతని యనుగ్రహమును ఆశీర్వాదమును బొందుటకై- తిరిగివచ్చును.
683. ఉక్కగా నుండగా గాలి వీచనంతకాలము విసనకఱ్ఱతో విసరుకొందుము. ధనవంతులకును దరిద్రులకును ఎల్లరకును సమానముగా హాయినొసగు మలయమారుతము వీచ నారంభించినంతనే విసనకఱ్ఱ నావల బెట్టుదుము. పరమావధిని బొందుటకై దైవసాహాయ్యము లేకుండునంత కాలము స్వప్రయత్నమును సాగింపవలయును. కాని యదృష్టవశమున ఆ తోడ్పాటు లభించునపుడు ఇక శ్రమపడుట- సాధనచేయుట- అనావశ్యకము. అంతవఱకు మాత్రము శ్రమపడక తీరదు.
684. మలయమారుతమే వీచునపుడు విసనకఱ్ఱ యెందులకు? భగవత్కృపయే లభించునపుడు జపతపము లెందులకు?
685. ‘‘్భగవంతునియొక్కయు గురునియొక్కయు సద్భక్తునియొక్కయు అనుగ్రహము లభించినను ఒక్కదాని యనుగ్రహము లేకపోయెనా, నరుడు నశించును.’’ ఈ మూడువిధములైన యనుగ్రహమును అదృష్టవశమున బొందినను అంతఃకరణముయొక్క అనుగ్రహము లేనియెడల- అనగా తరణోపాయమునకై పరితపింపనియెడల- అన్నియు నిష్ఫలము.
686. నీ వెంతగా ప్రయత్నించినను భగవదనుగ్రహము లేనిదే ఏమియు లభింపదు: వాని కృపలేనిదే నీవు వాని సాక్షాత్కారమును బొందజాలవు. కాని భగవత్కృప సులభముగ చేచిక్కునది కాదు. హృదయమునుండి యహంకారమును నిర్మూలము చేయవలయును. ‘‘నేను కర్తను’’అను నహంకారము ఏమాత్రమున్నను నీవు భగవంతుని గనజాలవు. (ఇంటి సామగ్రి పెట్టుకొను) గదిలో ఎవరో యొకరుండగా ఇంటి యజమానుని మఱియొకరు ఏదియో యొక వస్తువును అందుండి తెమ్మనిన యెడల వెంటనే యాతడు, ‘‘గదిలో ఎవరో ఉన్నట్లున్నారు, చూడు, వాని నడిగి పుచ్చుకో’’అని చెప్పునుగదా?

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది