మెయన్ ఫీచర్

చైనా దూకుడుకు భారత్ పగ్గాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముసలి సింహం నూతిలో నుండి తనను కాపాడాలని అరుస్తుంటే ఓ వ్యక్తి జాలిపడి పైకి లాగాడట! ఇపుడు చైనా చేస్తున్నది అదే.. కాకపోతే మరో రకంగా నరుక్కుంటూ వస్తోంది. ‘మీకు డబ్బు ఇస్తాం, రవాణా మార్గాలు మెరుగుపరచండి లేదా మేమే మీకు నౌకాశ్రయాలను, విమానాశ్రయాలను నిర్మించడంలో సహకరిస్తాం’ అని చెబుతోంది. 2050 నాటికి అగ్రరాజ్యాలను సైతం గడగడలాడించే స్థాయికి భారత్ ఎదగబోతోందనే సర్వే నివేదికలు చూసి చైనా మన దేశం ముందరికాళ్లకు బంధం వేయాలని చూస్తోంది. భారత్ ఎదుగుదల ఏ మాత్రం ఇష్టం లేని ప్రపంచంలోని కొన్ని రాజ్యాలు మన ముందు మొసలి కన్నీళ్లు కారుస్తూ చైనా ఎత్తుగడలకు ఊతం పలుకుతున్నాయి. ఒక పక్క హెచ్చరికలు జారీ చేస్తున్నట్టే కనిపిస్తున్నా చైనాను దువ్వుతున్నాయి. తాత్కాలిక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ సహా హిందూమహాసముద్ర ప్రాంతంలోని కొన్ని దేశాలు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నాయి. భారత్ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తే మిగిలిన అన్ని రంగాలనూ కొల్లగొట్టవచ్చనే ఆయా దేశాల పగ, ప్రతీకారాలకు భారత్ దీటైన సమాధానం ఇస్తూ ఆర్థిక రంగాన్ని చక్కదిద్దుకుంటూ మిగిలిన దేశాలు సైతం గుణపాఠాలు నేర్చుకునే రీతిలో ముందడుగు వేస్తోంది.
152 దేశాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపరచడమేగాక, వివిధ ఖండాల్లోని అంతర్జాతీయ సంస్థలకు ఆర్థిక సాయం అందజేసే మహత్తర పథకాన్ని చైనా ప్రారంభించడం భారత్ సహా అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు పెనుసవాల్ కానుంది. ‘వివిధ దేశాల్లో రోడ్లను, పోర్టులను, విమానాశ్రయాలను చైనా నిర్మిస్తే మీకు వచ్చే నష్టం ఏమిటి?’ అని ప్రశ్నిస్తున్న అంతర్జాతీయ నిపుణులు మరో అడుగు ముందుకు వేసి ‘తెలివిగా వాడుకోండి’ అంటూ సలహా ఇస్తున్నారు. పక్కింటి వారి కిచెన్‌లో వండుకుంటామని చెప్పి పాగా వేసి, రెండో రోజు మీ బెడ్‌రూమ్‌లో పడుకుంటామని చెప్పి వారి ఇంటిని ఆక్రమించే ప్రక్రియ ఎలా ఉంటుందో చైనా చేయబోయేది కూడా అదే. ప్రపంచ దేశాలకు అర్థమవుతున్నా లేకున్నా చైనా కుతంత్రాలు ఏమిటో తమ పార్టీ అగ్రనేతలకు అందజేసిన నివేదికలోనే పేర్కొంది.
సరిగ్గా ఆరేళ్ల క్రితం ‘వన్ బెల్ట్, వన్ రోడ్’ (ఒబర్) పథకాన్ని చైనా ప్రారంభించింది. ఇక్కడ ‘బెల్ట్’ అంటే ఒక దేశానికి నేరుగా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం.. అంటే ఈ రవాణాలో మిగిలిన ఏ దేశాలతో ఆటంకాలు లేకుండా చైనా తన రాకపోకలు నిర్వహించుకునే వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం. అది రోడ్డు మార్గం కావచ్చు, రైలు మార్గం కావచ్చు, విమానమార్గం కావచ్చు, జలరవాణా మార్గం కావచ్చు. ఆ రవాణా ప్రక్రియలో ఆయా దేశాలకు చెందిన తీరప్రాంతంలో నౌకాశ్రయాలను సైతం చైనా నిర్మిస్తుంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చైనా ఆధిపత్యం ఆ నౌకాశ్రయాలపై ఉంటుంది. ఈ కార్యాచరణను తర్వాత బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బ్రి)గా మార్చేసింది. 2017 మే 14 తేదీన చైనాకు అత్యంత సన్నిహిత దేశాల ప్రతినిధుల సమక్షంలో అప్పటి చైనా అధ్యక్షుడు జింగ్‌పింగ్ ఈ ప్రాజెక్టును ప్రారంభించారు.
రాతియుగం నుండి చరిత్ర ఆనవాళ్లను సొంతం చేసుకున్న చైనా 1912 జనవరి 1న రిపబ్లిక్‌గా అవతరించింది. ఒక దశలో చైనా-్భరత్‌ల జీడీపీ ఇతర ఆర్థిక గణాంకాలు దాదాపు సమానమే. కానీ నేడు చైనా ఎవరికీ అందనంత ఎత్తులోకి ఆర్థికంగా ఎదిగింది. మిలటరీ పరంగా ఎదిగి పొరుగుదేశాలను తన అజమాయిషీలోకి తెచ్చుకోవాలనే సామ్రాజ్యవాద కాంక్షతో అడుగులు వేస్తోంది. సమైక్య రష్యా తర్వాత అంతటి విశాల భూభాగమున్న దేశం చైనా మాత్రమే. ఇది చైనాకు ఎంత అనుకూలమో అంతే ప్రతికూలం. చైనా చుట్టూ 14 దేశాలున్నాయి. అత్యంత పొడవైన సరిహద్దు ఉన్న దేశం కూడా చైనాయే. రష్యా తర్వాత విశాల భూభాగం ఉన్న దేశం కూడా చైనా కావడంతో ఇపుడు చైనా ఆధిపత్య కాంక్షతో కొత్త కార్యాచరణలకు దిగుతోంది. చేయి చాచి అడిగిన వారికే కాకుండా, అడగని వారికి సైతం ‘తగుదునమ్మా’ అంటూ విద్యారంగంలోనూ, సాంస్కృతిక రంగంలోనూ విరివిగా సాయం చేస్తూ ఆయా దేశాల అంతర్గత రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యారంగాల్లో అధ్యయనం చేస్తూ తనకు అనుకూలంగా వినియోగించుకోవడంపై బృహత్తర ప్రణాళిక రచించింది. భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల సరిహద్దులపై చిరకాలం నుండి పోరాడుతూ, తన రక్షణ బలగాలతో ఎపుడూ కవ్విస్తూ భారత్‌ను హెచ్చరిస్తున్న చైనా ఇపుడు భారత్ చుట్టూ ఉండే దేశాలను లొంగదీసుకోవడం ద్వారా భారత్‌కు ‘ఝలక్’ ఇవ్వాలని చూస్తోంది.
చైనా నుండి ఇండోనేషియాకు, అక్కడి నుండి కొలంబో మీదుగా భారత్‌కు అక్కడి నుండి కెన్యా, ఈజిప్ట్, గ్రీస్ , ఇటలీ, నెదర్లాండ్స్‌కు ఈ ప్రాజెక్టును విస్తరిస్తోంది. రాటర్‌డామ్, మాస్కో, ఎథెన్స్, ఇరాక్, కజికిస్థాన్ మీదుగా తన దేశంలోకి రహదారులు నిర్మించాలని చైనా పట్టుదలగా ఉంది. 440 కోట్ల మంది ప్రజలను కవర్ చేస్తూ అంటే ప్రపంచంలో 62 శాతం జనాభాకు అర్థమయ్యే రీతిలో 23 ట్రిలియన్ల వెచ్చించనుంది. చైనా జాతీయ అభివృద్ధి సంస్కరణల కమిషన్ చేసిన ప్రతిపాదనలపై ప్రభుత్వం తీసుకున్న ఈ కార్యాచరణ వల్ల ప్రపంచంలో చాలా దేశాలకు రవాణా కనెక్టివిటీ పెరగనుంది. కానీ ఎంత మూల్యానికి అన్నది- ముందుంది మొసళ్ల పండగ అన్నట్టు భవిష్యత్‌లో తేలుతుంది. చైనా నిర్మిస్తున్న బెల్టు రోడ్ ఇనీషియేటివ్ కార్యాచరణలో భాగంగా చైనా నుండి మధ్య యూరప్‌కు రవాణా సమయం ప్రస్తుతం ఉన్న 30 రోజులు నుండి సగానికే తగ్గిపోతుంది. రైలు మార్గం గుండా రవాణా భారీ వ్యయంతో కూడుకున్నది కావడంతో చైనా జలరవాణాకు ప్రాధాన్యత ఇస్తోంది. సమీప దశాబ్దాల్లో స్వేచ్ఛా వాణిజ్య మండళ్లను ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేయడం, పొరుగున ఉన్న ఆసియా దేశాలతో రక్షణ ఒప్పందాలను కుదుర్చుకోవడం, ఈస్ట్ ఆసియా సమ్మిట్ పేరుతో భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను ఒక పక్క దువ్వుతూనే ఇంకో పక్క షాంఘై కార్పొరేషన్ ద్వారా నిధులను అందజేస్తూ, పర్మినెంట్ నార్మల్ ట్రేడ్ రిలేషన్‌షిప్ హోదాలో ఎగుమతులను పెంచుకుంటూ, దిగుమతులను రోజురోజుకూ తగ్గించుకుంటోంది. ప్రస్తుతం అమెరికా, దక్షిణ అమెరికా, బ్రెజిల్, అర్జంటీనాలకు చైనా పెద్దఎత్తున ఎగుమతులు చేస్తుండగా, రానున్న రోజుల్లో ఆఫ్రికన్ దేశాలకు ఎగుమతులను పెంచాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. భారత్, భూటాన్, తైవాన్, స్కార్బరో షోయల్ ద్వీపకల్పంతో చిరకాల వివాదాలను పక్కన పెట్టి మైత్రీ బంధాన్ని పటిష్టం చేయాలని చూస్తోంది.
తొలి రోజుల్లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా సోవియట్ యూనియన్ శైలిలోనే పయనించినా, మావో మరణం తర్వాత సాంస్కతిక విప్లవానికి ముగింపు పలికి, డెంగ్ క్సియోపింగ్ నాయకత్వంలో సరికొత్త అభివృద్ధి కార్యాచరణ మొదలైంది. మార్కెట్ ఆధారిత అభివృద్ధి వైపు పయనిస్తున్న చైనా తాజాగా ప్రైవేటు రంగాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తోంది. పెట్టుబడిదారీ విధానాల్లో కూడా అనేక మార్పులను చైనా చేసుకుంది. 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభావ్ని చవిచూసిన తర్వాత ఇక ఎంతమాత్రం అమెరికా డాలర్‌పై ఆధారపడకూడదని స్వీయ ఆర్థిక విధానానికి శ్రీకారం చుట్టింది.ప్రపంచ దేశాలపై ఆధిపత్యం సాధించాలంటే ప్రధానంగా పరిశోధనల్లో సత్తాచూపాలని గ్రహించిన చైనా 2012 తర్వాత పరిశోధనలకు పెద్దపీట వేసింది. సమాచార సాంకేతిక పరిజ్ఞానం, అంతరిక్ష రంగం, టెలీకమ్యూనికేషన్స్, పర్సనల్ కంప్యూటింగ్, సూపర్ కంప్యూటర్లు, కృత్రిమ మేధ, రోబోటిక్స్, డేటా అనాలసిస్, నానో టెక్నాలజీ రంగాలతోపాటు సైనిక బలగాలను పెంచుకోవడంపై దృష్టి సారించింది. ఇదంతా చైనాకు అంతర్గత బలాన్ని సమకూరిస్తే, ఇంటాబయటా బలగాన్ని సమకూర్చుకునేందుకు బెల్టు రోడ్ ఇనీషియేటివ్‌ను ప్రారంభించింది.
భారత్ సైతం పొరుగుదేశాల మహాముదురు ఆలోచనలపై ఒక కనే్నసి ఉంచింది. చైనాకు ముకుతాడు వేసేందుకు ఒక పక్క అమెరికాతోనూ, మరో పక్క రష్యాతోనూ సయోధ్యగా ఉంటూ అంతరిక్ష రంగంలో తన ప్రతాపాన్ని చూపించింది. రక్షణ రంగంలోనూ చైనాకు దీటుగా యుద్ధతంత్రాలను, మంత్రాంగాన్ని సమకూర్చుకుంటోంది. భార త్ జలాల్లోకి ప్రవేశించి సరిహద్దు సమీపంలో పీటవేసుకునేందుకు చైనా చేస్తున్న కుతంత్రాలను తేలికగా తీసుకోవడం లేదు. ముంచుకొచ్చే ముప్పును ముందే గుర్తించి అంతర్జాతీయ వేదికలపై భవిష్యత్ సవాళ్లను అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదే చైనాకు మింగుడుపడని అంశం.

-బీవీ ప్రసాద్ 98499 98090