మెయిన్ ఫీచర్

అత్యున్నత భావ చైతన్యమే దైవం (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అది నిజమేనేమో! లేకపోతే, అందరూ అలాగే ఎందుకంటారు?’’అనే అనుమానం వెంటనే మీలో కలుగుతుంది. అంతగా మీరు ఇతరుల భావనపై ఆధారపడతారు. దానివల్ల మీరు మీ అంతర్వాణిని పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. అప్పుడు మీరు దానిని మళ్ళీ కనుక్కోవలసి వస్తుంది. ఎందుకంటే, కేవలం అంతర్వాణి ద్వారా మాత్రమే చాలా విలువైన, అత్యంత సుందరమైన, పరమ పవిత్రమైన వాటిని మీరు అనుభూతి చెందగలరు. కాబట్టి, మీరు ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడడం మాని, మీ అంతర్వాణిపై దృష్టి సారించండి. అప్పుడు అది మీకు ఏదో చెప్పాలని చూస్తుంది. దానిని చెప్పనివ్వండి. పరిపూర్ణ విశ్వాసంతో దానిని మీరు పూర్తిగా నమ్మండి. అలా నమ్మడం ద్వారా మీరు దానిని పోషించినట్లవుతుంది. అప్పుడే అది మీలో చాలా చక్కగా ఎదుగుతూ బలపడుతుంది.
తర్కబద్ధంగా ఆలోచిస్తూ, ఎప్పుడూ అనుమానించే తత్వంతోపాటు, పాశ్చాత్య తాత్విక ఆలోచనాధోరణిపై గట్టి పట్టున్న వివేకానందుడు ‘దేవుడు లేడని నేను నిరూపించగలను’ అన్నాడు. నిరక్షరాస్యుడు, విద్యావిహీనుడైన రామకృష్ణ పరమహంసతో. వెంటనే ఆయన ‘‘సరే నిరూపించు’’ అన్నారు.
వెంటనే వివేకానందుడు అనేక తర్కబద్ధమైన ఉదాహరణలతో తన వాదనను వినిపించాడు. వాటిని విన్న రామకృష్ణ పరమహంస ‘‘నువ్వు చెప్పినవన్నీ కేవలం వాదనలే. నాకు అత్యంత ప్రామాణికమైన నా అంతర్వాణి నాతో ‘దేవుడున్నాడు’అంటోంది. మరి నీ అంతర్వాణి ఏమంటోంది?’’ అన్నారు.
‘‘దేవుడున్నాడా, లేడా’’అనే విషయంపై అనేక పుస్తకాలు చదివి, అనేక వాదోపవాదాలు చేసిన వివేకానందుడు తన అంతర్వాణి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. అందుకే ‘‘నాకు తెలియదు’’అన్నాడు వివేకానందుడు. ‘‘నీ వాదనలు చాలా చక్కగా ఉన్నాయి. నాకు చాలా నచ్చాయి. ఇదేమీ చర్చకాదు. కానీ, దేవుడున్నాడని మాత్రం నా అంతర్వాణి నాకు చాలా స్పష్టంగాచెప్తోంది. దానిని నేను నిరూపించలేను. కానీ, నీకు కావాలంటే దానిని చూపించగలను’’అన్నాడు రామకృష్ణ పరమహంస.
ఇంతవరకు తనతో ‘‘దేవుడిని చూపించగలను’’ అని చెప్పిన వ్యక్తి ఎవరూ లేరని ఆలోచనలోపడిన వివేకానందుని ఒక్క తోపుతో కింద పడేసిన రామకృష్ణ పరమహంస అతని గుండెలపై కాలుపెట్టి గట్టిగా నొక్కాడు. వెంటనే ఏదో శక్తి అతనిలోకి ప్రవహించడంతో వివేకానందునికి ఏదో మైకం కమ్మినట్లైంది. మూడు గంటల తరువాత కళ్ళుతెరిచిన వివేకానందునికి కొత్తగా ఏదో నిర్మలమైన, ప్రశాంతమైన, పరమానందం తనలో పొంగి ప్రవహిస్తున్నట్లు తెలిసింది. అప్పుడు రామకృష్ణ పరమహంస అతనితో ‘ఇప్పుడు చెప్పు. దేవుడున్నట్లా, లేనట్లా?’’అన్నాడు. వెంటనే వివేకానందుడు ఆయన పాదాలపై పడి ‘దేవుడున్నాడు’ అన్నాడు.
కాబట్టి, దేవుడు ఒక వ్యక్తికాదు. అత్యున్నత శ్రేయోభావ చైతన్యమే దేవుడు. అది మీ ఇంట్లో మీకున్న సౌకర్యం లాంటిది. ఇంకా చెప్పాలంటే, ‘‘ఈ ప్రపంచం నాది, నేనే ఈ ప్రపంచం. ఇక్కడ నేను పరదేశిని కాదు, గ్రహాంతరవాసిని కాదు. నేను, ఈ విశ్వం విడివిడిగా లేము. నేనే ఈ విశ్వం, ఈ విశ్వమే నేను’’ అనే అత్యున్నత అస్తిత్వభావానుభవమే ‘దేవుడు’.
మీ అంతర్వాణి పనిచేసేందుకు మీరు పూర్తిగా అంగీకరించినప్పుడు మాత్రమే ఆ అనుభవం మీకు దక్కుతుంది. కాబట్టి, వెంటనే దానిని అంగీకరించడం ప్రారంభించండి. అలాగే, దానికి మీరు ఇవ్వగల అవకాశాలన్నీ ఇవ్వండి. అంతేకానీ, బాహ్య అధికారుల అభిప్రాయాలకోసం మీరు ఎప్పుడూ ఎదురు చూడకండి.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు-విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.