మెయిన్ ఫీచర్

ఎవరి తప్పులకు వారిదే బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ తప్పులకు మీరెలా బాధ్యులవుతారు? మీరు తప్పుగా బొమ్మవేసి, బొమ్మదే తప్పంటే ఎలా కుదురుతుంది. ఆ తప్పు మీదే కదా!
గుంపునకు ఏమాత్రం భయపడవలసిన పని లేదు. ప్రపంచానికి ప్రళయం వచ్చిన రోజున ఏ కాల్పనికి దేవుడో వచ్చి ‘‘ఇంతవరకు నువ్వేంచేసావు. ఏంచెయ్యలేదు’’అని మిమ్మల్ని అడుగుతాడని ఎప్పుడూ భావించకండి. ఆ నిర్ణయాలన్నీ ఎప్పుడో జరిగిపోయాయి. కాబట్టి, మీకు పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లే. ఈ సత్యాన్ని తెలుసుకున్న వెంటనే మీ జీవితం క్రియాశీలమైన నాణ్యతను సంతరించుకుంటుంది.
‘్భయం మీకు బేడీలు వేస్తుంది, స్వేచ్ఛ మీకు రెక్కలనిస్తుంది.’’
దేనినుంచి స్వేచ్ఛ- దేనికోసం స్వేచ్ఛ:
ఎప్పుడూ ‘‘దేనికోసం స్వేచ్ఛగా ఉండాలి’’ అని ఆలోచించాలి తప్ప, ‘‘దేనినుంచి స్వేచ్ఛగా ఉండాలి’’అని ఆలోచించకండి, వాటిమధ్య చాలా తేడా ఉంది. ‘‘దేనినుంచి’’కాకుండా, ‘‘దేనికోసం’’ గురించే ఎప్పుడూ ఆలోచించండి. సత్యంకోసం, దేవుడికోసం స్వేచ్ఛగా ఉండండి. అంతేకానీ, గుంపునుంచి, చర్చినుంచి, దానినుంచి, దీనినుంచి బయటపడి స్వేచ్ఛగా ఉండాలని ఎప్పుడూ ఆలోచించకండి, ఆశించకండి, ఏదో ఒకరోజు మీరు వాటికి చాలాదూరంగా వెళ్ళగలిగినా, మీరు ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేరు. ఎందుకంటే, అదికూడా ఒక రకమైన అణచివేత లాంటిదే.
అయినా, గుంపంటే మీకెందుకంత భయం? ఆ భయమే మీ గుంపుకు గుంజుకునే ఆకర్షణ శక్తి ఉన్నట్లు, అందుకే మీరు దాని ఆకర్షణలో పడ్డట్లు నిరూపిస్తోంది. అందువల్ల మీరు ఎక్కడికి వెళ్ళినా గుంపు మిమ్మల్ని శాసిస్తూనే ఉంటుంది. దాని పరిమితులు, పద్ధతుల గురించి మీరు ఏమాత్రం ఆలోచించవలసిన పని లేదు. కేవలం దాని వాస్తవాలను మీ పద్ధతిలో మీరు గమనిస్తే దానిని మీరు వెంటనే వదిలెయ్యగలరు. అది పెట్టే అవస్థలలో చిక్కుకున్న మీరు ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేరు. పైగా, అలా అవస్థలు పడడంలో ఏమాత్రం అర్థంలేదు. కాబట్టి, దానిని వదిలించుకోండి.
నిజానికి, గుంపు ఒక సమస్యకాదు, మీకుమీరే సమస్య. గుంపు మిమ్మల్ని గుంజట్లేదు. మీకుమీరే గుడ్డిగా వెళ్ళి ఆ గుంపులో పడ్డారు. బాధ్యతను ఎవరిపైకో నెట్టడం భావ్యంకాదని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అలా నెట్టినా మీరు ఏమాత్రం స్వేచ్ఛగా ఉండలేరు. ఎందుకంటే, దానికి మీరే బాధ్యులని మీ అంతరంగం మిమ్మల్ని దొలుస్తూనే ఉంటుంది. ఎవరైనా గుంపును ఎందుకు అంతగా వ్యతిరేకించాలి, అది చేసే గాయాలను ఎందుకు భరించాలి? మీరు సహకరించకపోతే గుంపు మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. మీ సహకారమే అసలు సమస్య. అందువల్ల ఏమాత్రం ఆలోచించకుండా గుంపుకు సహకరించడం వెంటనే మానండి. ఏమాత్రం ఆలోచించినా వెంటనే మీరు సమస్యలో పడతారు. ఎందుకంటే, గుంపుతో పోరాడాలనుకుంటే మీరు ఓడిపోయే యుద్ధం చేస్తున్నట్లే, గుంపుకు ప్రాధాన్యమిస్తున్నట్లే.
అలా అనేక లక్షల మంది ఓడిపోయే యుద్ధమే చేశారు. స్ర్తినుంచి, లైంగిక సంభోగంనుంచి అనేక మంది తప్పించుకోవాలనుకున్నారు. భారతదేశంలో అనేక శతాబ్దాలపాటు అదే జరిగింది. నిద్ర, ఆహారాలు మాని, ఉపవాసాల వ్రతాలు, యమ, నియమ, ప్రాణాయామ యోగప్రక్రియలు చేస్తూ స్ర్తినుంచి, లైంగిక సంభోగం నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చాలా చేశారు. అయినా వారు వాటినుంచి ఏమాత్రం తప్పించుకోలేకపోగా, ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ, వాటిదగ్గరే ఉన్నారు. అలా అవే వారికి చాలా ముఖ్యమైపోయాయి.
క్రైస్తవ మఠాలలో అదే జరిగింది. వారు చాలా భయంకరమైన అణచివేతకు గురయ్యారు. అందుకే వారు చాలా భయపడ్డారు. గుంపును చూసి భయపడితే రేపు మీకూ అదే జరుగుతుంది. మీరు సహకరించకపోతే గుంపు మిమ్మల్ని ఏమీచెయ్యలేవు. కాబట్టి, గుంపుకు ఏమాత్రం సహకరించకుండా చాలా అప్రమత్తంగా ఉండండి.
- ఇంకాఉంది
==========================================================
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛమీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.