మెయిన్ ఫీచర్

అతుకులు లేనిదే వాస్తవం( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశ్వవిద్యాలయం చదువు ముగిసిన తరువాతే నేను ఎప్పుడూ టోపీ పెట్టుకోవడం ప్రారంభించాను. అందువల్ల నాపై ఫిర్యాదు ప్రిన్సిపాల్‌కు చేరడంతో ‘‘నువ్వు కాలేజీ నిబంధన ఎందుకు పాటించట్లేదు?’’ అన్నారాయన నాతో. ‘‘మీ కాలేజీ నియమావళిలో అలాంటి నిబంధన ఉన్నట్లు మీరు నిరూపిస్తే నేను టోపీ పెట్టుకుంటాను. అయినా టోపీ పెట్టుకున్నంత మాత్రాన అవగాహన, తెలివితేటలు పెరుగుతాయా చెప్పండి. నాకు తెలిసినంతవరకు మన దేశంలోని అత్యంత తెలివైన బెంగాల్ రాష్ట్రంలో ఎవరూ టోపీలు ధరించరు. కానీ, మన దేశంలోని అత్యంత తెలివి తక్కువ రాష్టమ్రైన పంజాబ్ అందుకు పూర్తిగా విరుద్ధం. అక్కడ అందరూ తమ తెలివి ఎక్కడ పైకిపోతుందో అన్నట్లుగా పెద్దపెద్ద తలపాగాలను తలకు చుట్టుకుంటారు’’అన్నారు ఆయనతో. ‘‘నీ వాదనలో అర్థముంది. కానీ, నీలాగే అందరూ చేస్తారని నా భయం’’అన్నారాయన. అయితే మీ నియమావళిలో లేని, అర్థంలేని ఆ ఆచారాన్ని వెంటనే ఆపండి’’అన్నాను ఆయనతో. అలా ఆయనతో నా వాదన ముగిసింది.
మా నాన్నగారిది బట్టల వ్యాపారం. మా దుకాణానికి వెనకాలే మా ఇల్లు ఉండడంవల్ల నేను రోజూ దుకాణంలోకి వస్తూ, పోతూ ఉండేవాడిని. నాకు చాలా పొడవైన జుట్టు ఉండడంతో అందరూ నన్ను ఆడపిల్ల అనుకునేవారు. అది భరించలేని మా నాన్నగారు ఒక రోజు నా జుట్టు కత్తిరించబోతుంటే ఏమాత్రం ఎదురుచెప్పని నాతో ‘‘ఏం మాట్లాడవేంటి?’’ అన్నారాయన ఆశ్చర్యపడుతూ. ‘‘తరువాత చెప్తాను. ముందు మీరనుకున్న పని చెయ్యండి’’అన్నాను ఆయనతో. ఏమనుకున్నారో ఏమో కానీ, ఆయన తనకు నచ్చినట్లుగా నా జుట్టు కత్తిరించి వెళ్ళిపోయారు. వెంటనే నేను మా దుకాణానికి ఎదురుగా ఉండే మంగలి షాపుకెళ్ళి ‘‘నున్నగా గుండు గియ్యి’’అన్నాను. ‘‘ఎందుకు? మీ నాన్నగారు పోయారేమిటి?’’ అన్నాడు మంగలి. ‘‘ఆ వివరాలు నీకు అనవసరం. ముందు నున్నగా గుండు గియ్యి’’ అన్నాను అతనితో. భారతదేశంలో తండ్రి మరణిస్తే గుండు గీయించుకునే ఆచారం అనాదిగా ఉంది. అలా బోడి గుండుతో నేను మా దుకాణంలోంచి ఇంట్లోకి వెళ్తుంటే నన్ను చూసిన కొందరు ‘‘అయ్యో పాపం. ఆ కుర్రాడి తండ్రి పోయాడా?’’ అని దుకాణంలో ఉన్న మా నాన్నను అడిగారు. ‘‘వాడు నా కొడుకే. నేనింకా బతికే ఉన్నాను’’అన్నారాయన వారితో. వెంటనే నేను మా నాన్నతో ‘‘ఇదంతా అవసరమా? ఎవరైనా నన్ను చూసి పొరపాటున ‘‘ఆడపిల్లా? అని అడిగితే ‘‘అవును’’అనవచ్చు కదా! అలా చెప్పకుండా అనవసరంగా నా జోలికొచ్చి నన్ను చాలా ఇబ్బందిపెట్టారు. నా సంగతి మీకు తెలుసుకదా!’’అన్నాను. ఆరోజు నుంచి మా నాన్నగారు ఎప్పుడూ నా జోలికి రాలేదు.
ఎవరిని వారుగా ఎవరూ అంగీకరించరు. ఆ భావాలన్నీ మీవే అన్నట్లుగా మీరు వాటిని చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఎండుటాకులు చెట్టును వదిలినట్లుగా నిబద్ధీకరణలన్నింటినీ మీరు విడిచిపెట్టి, వాటి గురించి పూర్తిగా మర్చిపోయి హాయిగా విశ్రాంతి పొందండి. ప్లాస్టిక్ పువ్వులు, ఆకులతో ఉన్న చెట్టు చాలా వికారంగా కనిపిస్తుంది. అంతకన్నా, పువ్వులు, ఆకులు పూర్తిగా రాలి మోడైపోయిన చెట్టే చూసేందుకు చక్కగా ఉంటుంది.
తల్లిదండ్రులు, గురువులు, మతాచార్యులు, మతం, నైతికత, సమాజం- ఇలా దేని పెత్తన ప్రభావం లేని ముఖంతో, మీ అంతరంగ సాక్షిగా, మీకున్న జ్ఞాన చైతన్యంతో, మీకుమీరుగా మీ జీవితాన్ని జీవించడమే మీ ‘‘నిజ స్వరూపం’’.
***
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ పోన్: 9490004261, 9293226169.