మెయిన్ ఫీచర్

తాత్త్విక దార్శనికులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతినీ, సనాతన ధర్మమును, వైదిక ధర్మమును కర్మకాండలను, జాతీయ సమగ్రతను తమ బుద్ధికుశలతతో, మానసిక బలంతో తర్కబద్ధమైన జ్ఞానంతో, పతనోన్ముఖమైన జాతిని పునరుద్ధరించిన ధీశాలి ఆదిశంకరాచార్యులవారు. ఆయన భక్తి - కర్మ - జ్ఞాన యోగాలను సమన్వయించి, జనులలో నిండి ఉన్న పలు సంశయాలను పారద్రోలి- జగద్గురు స్థానాన్ని పొందగల్గిన మానవతావాది శంకరులు. దేశంలోని హిందువులచేగాకుండా, హైందవేతరులచే భారతీయ ఏకాత్మకు ప్రతీకగా నిలిచి కొనయాడబడిన మేధావి.
హిందూ సమాజ చరిత్రను పూర్తిగా మార్చివేసిన కర్మమయ జీవనుడు. జాతీయ నిర్మాతలలో శ్రీ శంకరాచార్యులవారిది మహోన్నతమైన స్థానం. ఎందరో విద్వాంసులు ఆయనను హిందూ ధర్మానికి జనకునిగా ప్రశంసించారు. మహాపురుషులు ప్రతి వ్యక్తి జీవనంలోనూ కార్య శక్తి, ప్రేరణా ప్రసాదించి సంచలనం కల్గిస్తాడు. అలాంటివారి కోవకు చెందిన యుగపురుషుడు శ్రీ శంకరాచార్యులవారు ప్రథములు.
జగద్గురు జీవన విధానాన్నీ, ఆయన దివ్య సందేశాలను ఆయన జయంతి రోజైన వైశాఖ శుద్ధ పంచమినాడు జగతి యావత్తూ స్మరించి, తరించి, వారి ఆదర్శాలను ఆచరణలో చూపించినపుడు వారికి హిందువులందరూ అందించే శుభనివాళి అవుతుంది.
విద్యాభ్యాసం - ప్రతిభ
శివగురువు, ఆర్యాంబలకు పుట్టిన శంకరుని అసమాన ప్రతిభా విశేషాలను ఛూసి శివగురువు ఆనందంతో ఉపనయనం చేయడానికి 5వ ఏట ఉద్యుక్తులయ్యారు. వేదాధ్యయనం, జ్ఞాన సముపార్జనకై గురుకులంలో చేరాడు శంకరుడు వేదాలు చదివి వైదిక ధర్మం పునరుద్ధరించడానికి సమర్థుడు కావాలని తల్లి ఆర్యాంబ కోరుకొన్నది. శంకరుడు అనతికాలంలోనే వేదాలు- వేదాంగాలు అధ్యయనం చేశాడు. ఈ సమయంలోనే శంకరుడు 3బాలబోధ సంగ్రహమనే2 గ్రంథమును రచించాడు. సరళభాషలో రచించాడు. అది నిజంగా బాలబోధే. వేదమంత్రార్థాలు వాటంతటవే శంకరునికి స్ఫురించేవి. విద్యార్థి దశలోనే నాలుగు దిక్కులా కనిపిస్తున్నా అనేకత్వంలో నిజమైన ఏకత్వం చూడగలిగాడు. అందరూ ఒక్కటే అనే సత్యమును గ్రహించాడు. గురుకులానికి వచ్చినవారిలో నాస్తికవాదులైన బౌద్ధులున్నారు. వారితో శాస్త్ర చర్చలు చేశాడు. వారికి వైదిక ధర్మం అంటే ఏమిటో నిరూపించి తన సామర్థ్యం చూపాడు. ప్రతివాదులను తన వాక్‌పటిమతో తన వైపు త్రిప్పుకొనుట చూసి శంకరుడు భారతదేశంలో తప్పకుండా వైదిక ధర్మాన్ని ప్రచారం చేస్తాడు. చర్చలతోనే నెగ్గుకు వస్తాడని గురువులు గర్వంగా తలచి ఆనందించేవారు.
గురుకుల విద్యార్థులెంతటివారైనా సరే ఊరిలోకి వెళ్లి భిక్షమడిగి తెచ్చేవారు. దీని ప్రకారం బ్రహ్మచారికి గ్రామస్థులపై ఎంతో ఆదరభావం- వినయం- శ్రద్ధా- తనవారనే అభిప్రాయం ఏర్పడేవి. గురుకుల విద్యార్థి 3్భక్షాందేహి2 అని వాకిలిముందు కేకవేయాలి. గృహస్థురాలు భిక్ష వేసేటప్పుడు విద్యార్థి శిరస్సు కృతజ్ఞతతో వంగిపోయేది.
వటువుగా శంకరుని ప్రతిభ
శంకరుడు భిక్షమడుగుతూ ఒక రోజు ఒక పేద బ్రాహ్మణుని ఇంటి ముందు నిలిచాడు. భిక్షాందేహి అన్నాడు. గృహిణి ఇబ్బంది పడి భిక్షకు ఇంట్లో ఏమీ లేవు, ఊరికే పంపరాదు గదా అని తలంచి ఇంట్లో ఎండిపోయ ఉన్న ఉసిరికాయ ండగా చూసి దానిని భిక్షకోసం తెచ్చింది. కన్నీరు కారుస్తూ దానినే భిక్ష వేయగా బాలశంకరుడు ఈ సంగతిని కనిపెట్టాడు. ఆమె వేదన తెలిసి ‘‘అమ్మా! ఎందుకు కన్నీరు’’ అన్నాడు. భిక్షకు ఒక్క ఉసిరికాయే వుంది అంటూ ఆమె కన్నీరును ఒలికించగా కన్నతల్లిలా ఆమెను భావించి ఆమె కుటుంబం దారిద్రాన్ని తొలగించాలనుకున్నాడు. భగవంతుని ప్రార్థించాడు. లక్ష్మీదేవిని స్తోత్రం చేశాడు. కనకధారాస్తోత్రం చేశాడు. అంతే ఆ విప్రుని ఇల్లు బంగారు ఉసిరికాయలతో నిండి ఉంది. శంకరులు చేసిన సోత్రమే 3కనకధారాస్తోత్రమై2 యుగయుగాలలో స్తుతింపబడుచున్నది.
ఆచార్య బిరుదు ప్రదానం
ఎనిమిదేండ్ల వయసు వరకు గురుకులంలో వున్నాడు. వేద శాస్త్రాలన్నింటిలోనూ నిష్ణతుడయ్యాడు. గురువులు ఆచార్య బిరుదుతో శంకరుని సత్కరించారు. తండ్రి శివగురువు పెట్టిన శంకరుడన్న పేరు శంకరాచార్యులుగా మారింది. శంకరులు గురుకులాన్నుంచి రాకముందే 3శివగురువు2తనువు చాలించాడు. తండ్రి అంటే ఎంతో ప్రేమ శంకరునికి.
భగవంతుడు మెల్ల మెల్లగా ఒక్కో బంధనాన్ని ఈ విధంగా తెంపుతున్నాడని భావించాడు. తండ్రి శవ సంస్కార వేళ, ఈ శరీరం నిత్యం కాదని తెలుసుకొన్నాడు. మరణం తప్పదని భావించాడు. వైరాగ్యభావంతో నిండిపోయాడు. ఈ పునాది పైనే తన భవిష్యత్ జీవన భవనం నిర్మించాలన్న నిర్ణయానికొచ్చాడు. సంవత్సరీకం అయిందాకా ఇంటివద్దనే ఉండి తనకు అనుకూలంగా తల్లి భావాలను మార్చడానికి తీవ్ర ప్రయత్నం చేశాడు. శంకరుడు వైదిక ధర్మం ఉద్ధరించాలని తల్లి కోరిక. తన కొడుకు సన్యాసం తీసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. వివాహం చేయాలనే నిర్ణయాన్ని శంకరుడు అంగీకరించలేకపోయాడు. తాను సన్యాస ధర్మం అవలంభించాలనే దీక్ష పట్టాడు.దానికి ఆర్యాంబ యిష్టపడలేదు.
ఒక రోజు ఆర్యాంబ సోదరుడు జయదేవుడు వచ్చి శంకరునకు ఎన్నో రకాలుగా చెప్పి, ధర్మ విషయాలు బోధించినా బాలశంకరుడు వినలేదు. సన్యాసం స్వీకరించడానికి అనుమతిని కోరాడు తల్లిని. పితృణం తీర్చడానికే సన్యాసం అన్నాడు. ఇరువురూ వాదించుకుంటూ నదీ స్నానానికెళ్లారు. సన్యసిస్తే నన్ను ఎవరు నా మరణానంతరం దహనం చేస్తారు అన్నది. నేను చేస్తానమ్మా. ఇఛ్చినమాట తప్పనన్నాడు. నదిలో దిగాడు. మాయా మొసలి శంకరుని పాదం పట్టుకుంది. నీవు అనుమతిస్తే వదులుతుంది అని తల్లిని త్వరపెట్టాడు. చివరికి అంగీకరించి ప్రతిజ్ఞ చేయించింది. తాను మరణించే సమయంలో నా దగ్గరకు రావాలి. నాకు అంత్య సంస్కారం చేయాలన్నది ఆర్యాంబ కోరిక. ఆ కోరికను తీరుస్తానని ప్రతిజ్ఞ చేశాడు శంకరుడు. మొసలి కాలు వదిలింది. నది నుండి బైటకు వచ్చాడు మహత్తరమైన లక్ష్య సాధనకోసం. ఈ ఘట్టం హిందూ సమాజాన్ని సంపూర్ణంగా మార్చివేసింది. ప్రాచీన ఆదర్శాన్ని గుర్తించి ఆత్మదర్శనం కోసం అన్నీ వదిలి సన్యసించాడు. తల్లికి వందనం చేశాడు. సద్గురువుకోసం బయలుదేరాడు.
సద్గురు దర్శనం
అంతఃకరణమే ధనంగా- ఆత్మవిశ్వాసమే శక్తిగా- బుద్ధిబలమే మార్గదర్శిగా కార్యోన్ముఖుడై సద్గురువుకై పయనం సాగించాడు. కార్యతత్పరత - భగవంతుని శరణం రెండే ఆయన బలం- శాంతీ- ఆత్మ చైతన్యం ఉత్సాహం కలిగించాయి. మదిలో భగవంతుడు సాక్షాత్కరించాడనిపించింది ఆయనకు. భక్తితో నిండిన3అచ్యుతాష్టకమును2 అద్భుతంగా రచించాడు. అది నేటికీ అద్భుత స్తోత్రంగా భక్తుల నాలుకపై నర్తిస్తున్నది.
బదరికాశ్రమంలో రచించిన గ్రంథాలు
శంకరుని గ్రంథాలు భక్తి భావ సుపరి మళాలు. జ్ఞానదీపికలు. ధర్మప్రకాశికలు బదరికాశ్రమంలో 3ముండకోపనిషత్తుకారిక2పై భాష్యమును సరళంగా రచించాడు. షోడశ భాష్యాలు ప్రస్థానత్రయంపై రచించాడు. శంకర భాష్యాలు ఎంత ప్రాచీనమైనవో- అంత అధీకృతమైనవి. వేదాంతానికి ఆది అయిన బాదరాయణుని శంకరులు దర్శించి ధన్యుడైనాడు. అక్కడే 3్ధన్యాష్టకం2 రచించారు. తల్లి పంపిన ధనంతో బదరికాశ్రమంలో బదరీనాథ దేవాలయంనిర్మించాడు. తల్లి నదీ స్నానానికి ఇబ్బంది లేకుండా మాతృభక్తి చిహ్నంగా పూర్ణానదిని వేడి తన గుమ్మం వద్దకు తెచ్చిన మహామనిషి. తల్లి కోరిక ప్రకారం చివరలో ఆమెకు అద్వైతం బోధించాడు. తత్త్వబోధ అనే గ్రంథం రచించాడు. కృష్ణాష్టకం రచించి తల్లికి వినిపించాడు. భక్తితో తన్మయం చెందింది ఆర్యాంబ. దైవధ్యానంలో తల్లి ఆర్యాంబ దేవునిలో లీనమైపోయింది. దహనం చేయడానికి సన్యాసికి అనుమతి లేదు. సాటి కులస్థులు ఎదురు తిరిగితే వాకిట్లోనే చితి పేర్చి తన భుజాలపై తల్లిని మోసి చితిపేర్చాడు. దానిపై వేదమంత్రాలు చదివాడు. అగ్ని సంస్కారం చేశాడు. మాతృస్తుతి అనే శ్లోకాలు రచించాడు. భారతీయ సమన్వయాత్మక సంస్కృతీ చరితంలో ఒక కొత్త అధ్యాయం. తక్షశిలనుండి శంకరులు కాశ్మీరం చేరాడు. కావ్య కళలకూ క్రీడా స్థలం కాశ్మీరం. శ్రీనగరంలో శారదా దేవి మందిరం సుప్రసిద్ధం. శారదను స్మరించాడు. జగద్గురువై నిలిచాడు. మందిరం తలుపులు మూసి వుంటే అమ్మను స్మరింపగా తలుపులు వాటికవే తెరుచుకున్నాయి. అద్వైత ప్రచారం సాగించి జీవన లక్ష్యం సిద్ధించినందుకు ఆనందించి హిమాలయం చేరాడు. బదరికాశ్రమం చేరి ధ్యానమగ్నులై సమాధిస్థితుడై శివునిలో లీనమైనాడు. భారత జాతీయ జీవనంలో శ్రీకృష్ణపరమాత్మ తరువాత జగద్గురు శంకరాచార్యుల అవతారమే దేశంలో వౌలికమైన ఏకత్వం రూపుదాల్చింది.అద్వైత సిద్ధాంతాల ద్వారా విశ్వంలో శాంతి- సౌఖ్యం కల్గించిన మహనీయుని నిజమైన జగదుర్గువుగా ఆయన జయంతి జరుపుకొని వారిని స్మరించి తరించి ఆధ్యాత్మిక భక్తి భావమిళితములైన వారి సోత్త్రాలలో వారిని గాంచి పులకించి ఆయన పుణ్యాత్మకు మనం అందించే నివాళి ఆదిశంకరుల జయంతి.

-పి.వి.సీతారామమూర్తి 9490386015