మెయిన్ ఫీచర్

ఇక్కత్ ట్రెండ్ అదరహో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటితరానికి తెలియని.. నాటి తరాన్ని వదలని ఒకే ఒక్క ఫ్యాషన్, అవసరం.. చీర. కట్టుతో కనికట్టు చేసే సౌందర్యం ఈ చీరకే సొంతం. ముఖ్యంగా భారతీయ చేనేతకు అంతర్జాతీయ వైభోగం తీసుకొచ్చిన చీర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వనె్న వనె్న చీరల్లో.. ఎనె్నన్ని అందాలో.. అనిపించేలా ఉంటాయి ఈ చీరలు. పోచంపల్లి, గద్వాల, కంచిపట్టు, పటోలా వంటి చేనేత చీరలు ఏ సందర్భానికైనా చక్కగా నప్పుతాయి. ఫ్యాషన్ ప్రపంచంలో ఎన్ని రకాల చీరలు ఉన్నప్పటికీ వస్త్రశ్రేణిగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలు ప్రత్యేకతను నిరూపించుకుంటున్నాయి. సిల్క్, కాటన్, పట్టు ఫ్యాబ్రిక్‌లో లభ్యమయ్యే ఇక్కత్ మెటీరియల్స్ అందంగా, హుందాగా కనిపించేలా చేస్తాయి. చీరలు, కుర్తీలు, స్కర్ట్‌లు, సల్వార్లు, టాప్స్, బ్లౌజ్ మెటీరియల్స్, చున్నీలు.. ఇలా ఇక్కత్ ఫ్యామిలీలో బోలెడన్ని వెరైటీలు ఉన్నాయి. అందుకే వార్డ్‌రోబ్‌లో ఎన్ని రకాల చీరలున్నా.. ఒక్కసారి ఇక్కత్‌ను ఎంచుకున్నాక.. తరువాత నుంచి వనితలు ఇక్కత్‌ను వేసుకోవడానికే ఇష్టపడతారు. గాఢంగా ఉండే రెండు, మూడు రంగులు మిళితమైనప్పటికీ గాడీగా కనిపించకపోవడమే వీటి ప్రత్యేకత. రకరకాల డిజైన్లు, రకరకాల కాంబినేషన్లతో ఈ వస్త్రాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి ఏ వయసు వారికైనా, ఎలాంటి శరీరాకృతి కలవారికైనా ఇవి చాలా బాగా నప్పుతాయి. అందుకే పార్టీలు, ఫంక్షన్లలో చాలామంది ఇక్కత్‌తోనే కనువిందు చేస్తుంటారు. అయితే వీటికి కాంబినేషన్‌గా బ్లౌజ్‌ను ఎలా డిజైన్ చేయించుకోవాలనే టెన్షన్ అస్సలు అవసరం లేదు. ఎందుకంటే ఒక డిజైనర్ తెలుపులేదా క్రీమ్ కలర్ బ్లౌజ్‌ను జతచేస్తే చాలు. ముచ్చటైన కళతో వెలిగిపోతారు. హ్యాండ్లూమ్ చీర కట్టుకోవాలనుకున్నప్పుడు, ప్రత్యేకంగా కనిపించాలంటే తెలుగు రంగు జాకెట్టును ధరిస్తే చాలు. ఇక ఎందుకు ఆలస్యం. ఎంచక్కా ఇక్కత్ హ్యాండ్లూమ్‌తో హుందాగా సెలబ్రేట్ చేసుకోండి. కాటన్, సిల్క్, సీకో రకాలు లేదా స్కి,కాటన్‌లు కలిసి తయారయ్యే ఈ చీరల మీద వేసే రంగుల కోలాటం చూడచక్కగా, అందంగా ఉంటుంది. అలాగే వీటిపై చేసే డిజైన్లు కూడా భిన్నంగా ఉంటాయి. తమని తాము యునిక్‌గా ప్రెజెంట్ చేసుకోవాలనుకునే వాళ్లకు పోచంపల్లి ఇక్కత్ చీరలు బెస్ట్ చాయిస్. సంప్రదాయం, ఫ్యాషన్ రెండింటినీ కలిపి కోరుకుంటే ఇక్కత్ చీరల్ని ఇష్టంగా కట్టుకోవాల్సింది.
ఇటీవల కాలేజీల్లో జరిగే వేడుకలకు అమ్మాయిలు ఎవరూ అదిరేటి డ్రెస్సులు వేసుకోవడం లేదట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు చక్కటి చేనేత చీరలు ధరించి హుందాగా హొయలు పోతున్నారు. అమ్మాయిల మనసు ఆకట్టుకునేలా.. చేనేత వస్త్రాలు రకరకాల డిజైన్లలో వస్తున్నాయి. ఇక్కత్ చీరలు ధరించి పైన బ్లేజర్ వేసుకుని అమెరికాలో జరిగిన ఓ వేడుకలో భారతీయ అమ్మాయిలు కనువిందు చేశారట. ఇదే బాటలో ఇక్కడ కూడా కాలేజీ వేడుకల్లో అమ్మాయిలు చేనేత వస్త్రాలనే ధరించి కొత్త లుక్కుతో కనికట్టు చేస్తున్నారు. నేడు ఇక్కత్‌లో ఆధునిక డిజైన్లను సంతరించుకుని నేటితరం అమ్మాయిలు ఇష్టపడేలా వస్తున్నాయి. కాలేజీ విద్యార్థినులే కాదు, మధ్యతరగతి మహిళల నుంచి ఐశ్వర్యరాయ్, సోనియాగాంధీ వరకు అందరూ మక్కువతో ఇక్కత్ చీరలను ధరిస్తున్నారు. దీని ధర రెండు వేల రూపాయలు మొదలుకొని ఇరవై వేల రూపాయల వరకు మాత్రమే. ఇక్కత్‌లో మేనిని అంటిపెట్టుకునే మహత్యం దాగి ఉంది. అందుకే ఈ ఇక్కత్ చీరలు ఇంతులకు ఇష్టసఖిగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.