మెయిన్ ఫీచర్

కోట్లకొద్దీ వినోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకప్పుడు సినిమా అంటే-
కథేంటి? హీరో ఎవరు? ఈ ప్రశ్నలెదురయ్యేవి.
కొంతకాలం క్రితం వరకూ సినిమా అంటే-
హీరో ఎవరు? బడ్జెట్టెంత? అన్న ప్రశ్నలుండేవి.
ఇటీవలి కాలం వరకూ సినిమా అంటే-
కోటి దగ్గర ఆగేదా? కోట్ల క్లబ్‌కు చేరేదా? అన్న ప్రశ్నలూ వినిపించాయి.
ఇప్పుడు సినిమా అనగానే-
-బడ్జెట్ పద్మనాభమా?, బడ్జెట్ బాహుబలా? అంటున్నారు.
ప్రపంచానికి ఒక్కటిగా కనిపిస్తున్న తెలుగు సినిమా -పరిశ్రమపరంగా రెండుగా వినిపిస్తోంది. అది -చిన్నది, పెద్దది. పరిశ్రమకు కొత్తగా వస్తున్న వాళ్లు చిన్న సినిమాను నమ్ముకుంటున్నారు. పరిశ్రమలో స్థిరపడినోళ్లు పెద్ద సినిమాను అమ్మడం నేర్చుకున్నారు. చిన్న నిర్మాతలు, చిన్న హీరోలు, చిన్న దర్శకులు, చిన్న టెక్నీషియన్లు.. ఇలా ‘చిన్న’దంతా ఒకవర్గం. ఇదో సినిమా. ఇక స్టార్ నిర్మాతలు, స్టార్ హీరోలు, స్టార్ దర్శకులు, స్టార్ స్టార్ టెక్నీషియన్లు.. ఇలా ‘పెద్ద’లదంతా మరోవర్గం. ఇదింకో సినిమా. ప్రస్తుతం పరిశ్రమలో ఈ సినిమా, ఆ సినిమా -రెండు వస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమాను అందుకోడానికి ప్రయత్నిస్తుంటే -పెద్ద సినిమా ప్రపంచ సినిమాతో పోటీపడేందుకు ప్రయత్నిస్తోంది. మొత్తంగా తెలుగు చిత్ర పరిశ్రమ -కనిపించని కృష్ణబిలంలా విస్తరించుకుంటూ పోతోంది.
తెలుగు సినిమా రూ.50 కోట్ల బడ్జెట్‌కు చేరినపుడు -పరిశ్రమ బెంబేలెత్తిపోయింది. దాటిపోతున్న బడ్జెట్ పరిమితులు ఉనికినే దెబ్బతీసే ప్రమాదానికి కారణం కావొచ్చన్న భయాన్ని వ్యక్తం చేసింది.
తెలుగు సినిమా వంద కోట్ల కలెక్షన్స్‌కు చేరినపుడు -పరిశ్రమ పండగ చేసుకుంది. వ్యాపారపరంగా సినిమాను ఎంతవరకైనా తీసుకెళ్లొచ్చన్న ధైర్యం పుణికిపుచ్చుకుంది. బాహుబలి సీక్వెన్స్ శకం తరువాత -తెలుగు సినిమా స్టేటస్సే మారిపోయింది. అప్పటివరకూ అలాంటి ‘సిత్రాలు’ మాకే సాధ్యమన్న ధీమాతో కనిపించిన పెద్దన్నలాంటి బాలీవుడ్ సైతం -తెలుగు సినిమావైపు చూపుతిప్పింది. క్రమంగా నిర్మాతల్ని, దర్శకుల్ని, టెక్నీషియన్స్‌ని -మొత్తంగా సినిమానే ఓన్ చేసుకునే ఆలోచనకొస్తోంది. నిజానికి ఇప్పుడు బాలీవుడ్ ఎంతో.. టాలీవుడ్డూ అంతే. తేడా ఏమీ లేదు. ఇక్కడా -మహేష్‌భట్‌లు, యాష్‌చోప్రాలున్నారు. సూరజ్ బార్జాత్యాలు, కరణ్ జోహార్లు కనిపిస్తున్నారు. షారుఖ్‌లు, అమీర్లు, సల్మాన్లు తయారవుతున్నారు. అందుకే ప్రాంతీయ నిర్మాతలతో జాతీయ నిర్మాతలు ఒప్పందాలు కుదుర్చుకుని -కంబైన్డ్‌గా సినిమాలు తీద్దామంటూ ఆహ్వానాలు, ప్రతిపాదనలు పంపుతున్నారు.
పనిపరంగానూ, పరపతిపరంగానూ -ప్రాంతీయ సినిమా జాతీయ సినిమా స్థాయిని దాటిపోవడంతో ఆలోచనలు ఇంకాస్త పదునుదేరాయి. ప్రపంచ సినిమాతో టై-అప్ అయ్యి -్భరీ భారీ బడ్జెట్ సినిమాలనూ తెరకెక్కించే వ్యవస్థీకృత ఆలోచనల రూపం సాక్షాత్కరిస్తుండటం మహాదానందం. హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కొన్ని ‘తెలుగు వనరుల’తో కలిసి పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నాయన్న కథనాలు వింటూనే ఉన్నాం. అలాంటివన్నీ ఇందులో భాగమే. అంటే -తెలుగు సినిమా ఎక్కడికో వెళ్లిపోతోందన్న మాట.
**
ఏ పనికైనా ప్రణాళికుంటుంది. సినిమానూ -అదే ఆపరేట్ చేస్తుంది. పెట్టుబడి -వసూలు.. ఈ ప్రాతిపదికనే ఆ ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది. ఆ రెంటిమధ్య గ్యాప్‌ను (ప్రొడ్యూసర్ స్టామినా, హీరో ఇమేజ్, డైరెక్టర్ క్రియేటివిటీ, మార్కెట్ ఎక్స్‌పాన్షన్, టెక్నీషియన్స్ ఎక్స్‌పర్టైజేషన్, ఆడియన్స్ ఇంట్రెస్ట్) అనేక అంశాలు ప్రభావితం చేస్తుంటాయి. సిద్ధం చేసుకున్న ‘బ్లూప్రింట్’ ప్రకారం అంతకుముందు వసూలు చేసిన చిత్రాల తాలూకు అంకెలూ ఆలోచనల లెక్కల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఈ అంకెల పక్కన మరిన్ని అంకెల్ని చేర్చుకుంటూపోతోంది తెలుగు సినిమా. ‘దమ్మున్న సినిమాగా నమ్మిస్తే వసూళ్ల దుమ్ము దులిపేయొచ్చు’. ఇదొక్కటే -్భరీ చిత్రాలకు ప్రాతిపదిక అనిపిస్తోంది.
**
ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్న ‘మహర్షి’నే తీసుకుందాం. భారీ బడ్జెట్ చిత్రాలవైపు తెలుగు సినిమా భయంభయంగా అడుగులేస్తున్న టైంలో -మహేష్‌బాబు ప్రాజెక్టు కాస్ట్ రూ.20 కోట్లు. ఇప్పుడు మహర్షి ప్రాజెక్టు బడ్జెట్ రూ.120 కోట్లు. తొలిరోజు వసూళ్లెంత? వారంలో కలెక్షనెంత? ఓవర్సీస్ షేరెంత? శాటిలైట్ బరువెంత? డిజిటల్ తూకమెంత? ఇలాంటి లెక్కల ప్రకటనలన్నీ సినిమాను ముందుకు నడిపించడానికే తప్ప ఫైనల్‌వి కాదు. విడుదల దగ్గర్నుంచీ క్లోజయ్యే టైమ్‌కి -సినిమా ప్లస్సా? మైనస్సా? ఇదే ఫైనల్ లెక్క. దీన్నిబట్టే తదుపరి ప్రాజెక్టును ఆ స్థాయిలో ఉంచాలా? రెండు గజాలు పెంచాలా? నాలుగడుగులు దించాలా అని నిర్ణయించేది. జక్కన్న ప్రాజెక్టు బాహుబలితో అమాంతం అంతర్జాతీయ రేంజ్‌కి వెళ్లిన ప్రభాస్ తాజా ప్రాజెక్టు సాహో. మూడొందల కోట్ల ప్రాజెక్టు అన్నది వినిపిస్తూనే ఉంది. భారీ గ్యాప్ తరువాత ఖైదీ నెంబర్ 150తో తన చరిష్మా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్న మెగాస్టార్ తాజా ప్రాజెక్టు సైరా. సామాజిక ఇతివృత్తానికి కమర్షియల్ టచ్ ఇచ్చి చేస్తోన్న ప్రాజెక్టూ -250 కోట్లు దాటొచ్చంటున్నారు. ఇక రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్‌తో జక్కన్న చెక్కుతున్న ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు బడ్జెట్టూ రూ. 300 కోట్లు. రానా హీరోగా గుణశేఖర్ తెరకెక్కించనున్న హిరణ్యకశ్యప.. రూ.250 కోట్ల పైచిలుకు ‘బ్లూప్రింట్’తోనే కనిపిస్తున్నాడు. తెలుగుకే పరిమితమై వస్తున్న భారీ చిత్రాలు ఇప్పుడు లేవు. పైన చెప్పుకున్న చిత్రాలన్నీ బహుభాషను టార్గెట్ చేసి వస్తున్నవే. ఇలాంటి సినిమాలన్నీ -సౌత్, బాలీవుడ్, ఓవర్సీస్ లెక్కల్లోంచే పుడుతున్నాయి. ఆ మాటకొస్తే -తెలుగులోనే ఈ పరిస్థితి కనిపిస్తుందని చెప్పలేం. సౌత్ స్టేట్స్‌లోని తమిళ, కన్నడ చిత్రాలూ భారీ బడ్జెట్లవైపే పరుగులు తీస్తున్నాయి. తమిళంలో శంకర్ సినిమాలన్నీ ఎప్పుడో వంద కోట్ల బడ్జెట్‌ను దాటిపోయినవే. ఇంతకు ముందొచ్చిన ఐ, రోబో-2లాంటి చిత్రాలే కాదు, ఈమధ్యే మొదలుపెట్టిన భారతీయుడు-2 ప్రాజెక్టు సైతం మూడొందల కోట్ల ప్రాజెక్టుగానే డిజైన్ చేస్తున్నట్టు కథనాలు వెలువడ్డాయి. తాజాగా ‘మహావీర్ కర్ణ’గా కనిపించనున్న చియాన్ విక్రమ్ ప్రాజెక్టు రూ.300 కోట్లు దాటొచ్చని వినిపిస్తోంది.
కథాపరంగానైనా, సాంకేతికంగానైనా అప్‌డేట్స్‌ని అందిపుచ్చుకోవడంలో -తెలుగు పరిశ్రమ తక్కువేం కాదు. కాకపోతే, వసూళ్ల పరిమితుల నేపథ్యంలోనే అడుగు ముందుకేయలా వద్దా? అన్న సంకోచాలు ఉండేవి. ఇప్పుడు వెచ్చించిన సొమ్మును ఎలా వసూలు చేసుకోవాలన్న సుళువు తెలిసింది కనుక, పరిమితుల్ని చెరిపేసి ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తున్నారు. అందుకే టాలీవుడ్‌లో భారీ చిత్రాల హంగామా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడి భారీ చిత్రాలను రీమేక్ చేద్దామన్న ఆలోచనకు బాలీవుడ్ సైతం వస్తోందంటే -తెలుగు సినిమా ‘స్టేటస్’ ఎక్కడికెళ్లిందో అంచనా వేసుకోవచ్చు.
టీవీల దగ్గరే కాలక్షేపం చేస్తున్న ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించాలంటే ఏంచేయాలో -బాహుబలితో ఓ ప్రయోగం చేసి చూపించాడు జక్కన్న. కొత్త అనుభూతినిస్తే ఆడియన్స్ థియేటర్లకు పరిగెత్తుకొస్తారన్న విషయాన్ని ఆ తరువాతి చిత్రాలూ నిరూపించాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే తెలుగు సినిమా బడ్జెట్‌పరంగా వటుడింతౌతుంది.
**
అంతర్జాతీయ చిత్రాలు ప్రాంతీయ థియేటర్లను టార్గెట్ చేస్తుంటే, ప్రాంతీయ చిత్రాలన్నీ అంతర్జాతీయ కాన్వాసుకు ఎక్కుతున్నాయి. ఆ స్థాయికి చేరాలన్న ఆలోచనతో అంతర్జాతీయ స్టాండర్డ్స్‌ను అనుసరిస్తున్నాయి. అలాంటి కథల్నే ఎంచుకుంటూ, అందుకు అనుగుణంగా భారీ బడ్జెట్‌కు ‘జయహో’ అంటున్నాయి.
*